ప్రేమ గుడ్డిదంటే నమ్మాం.. కానీ ఇంత మైండ్ బ్లాక్ చేస్తుందనుకోలేదు!
వినడానికి ఏదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీలా ఉంది కదూ? కానీ తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ రియల్ లైఫ్ డ్రామా చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.
ప్రేమలో పడితే తాజ్‌మహల్ కట్టిస్తామనో.. ఆకాశంలో నక్షత్రాలు తెచ్చిస్తామనో చెప్పడం పాత ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ మారింది. సైలెంట్‌గా వెళ్లి పక్కంటి బంగారం కొట్టేసి.. ప్రియుడి చేతిలో బ్రాండ్ న్యూ ‘కేటీఎం బైక్’ కీలు పెట్టడం కొత్త ట్రెండ్. వినడానికి ఏదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీలా ఉంది కదూ? కానీ తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఈ రియల్ లైఫ్ డ్రామా చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.
సవర్ల బంగారం.. సర్రున ఎగిరిన కేటీఎం బైక్..
మేటర్ ఏంటంటే.. మన కాలేజీ పాప ఒక యువతి, అదే కాలేజీలోని ఓ కుర్రాడి ప్రేమలో మునిగి తేలిపోయింది. ప్రియుడు ఖరీదైన కేటీఎం బైక్ కోసం కలలు కంటుంటే చూసి తట్టుకోలేకపోయింది. ఎలాగైనా ఆ కోరిక తీర్చాలనుకుంది. ఆ జేబులో చూస్తే రూపాయి లేదు.. పోనీ కిడ్నీ అమ్ముకుందామంటే అంత టైమ్ లేదు. దీంతో రూట్ మార్చి, తన తండ్రి స్నేహితుడి ఇంట్లో ఉన్న సుమారు 75 గ్రాముల బంగారు ఆభరణాలపై కన్నేసింది.
చెయ్యి తిరిగిన దొంగలా సైలెంట్‌గా ఆ బంగారాన్ని లేపేసి మార్కెట్‌లో అమ్మి రూ.2.5 లక్షలు కాజేసింది. ఆ డబ్బుతో షోరూమ్‌కి వెళ్లి ప్రియుడికి కళ్లముందే ధగధగలాడే కేటీఎం బైక్ కొనిచ్చేసింది. బైక్ డెలివరీ తీసుకునేటప్పుడు ఆ జంట ఇచ్చిన పోజులు, పండించిన నవ్వుల వీడియోలు సోషల్ మీడియాలో చూస్తే.. వామ్మో వీళ్లేదో కష్టపడి సంపాదించి బైక్ కొన్నంత బిల్డప్ ఇచ్చారు.
ఆనందం కాసేపే.. ఆపై కటకటాల వెనకాల సీన్
బాగానే ఉంది.. మరి అసలు కథలో ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఇటు ఇంట్లో బంగారం గాయబ్ అవ్వడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సీన్ కట్ చేస్తే.. ఎంట్రీ ఇచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో మన ప్లానింగ్ స్టార్ దొరికిపోయింది. చోరీ, సేల్, డెలివరీ.. మొత్తం స్క్రిప్ట్ బయటపడటంతో పాపకి పోలీసులు చేతులకు (సంకెళ్లు వేసి కస్టడీకి తరలించారు.
"ప్రేమ గుడ్డిది" అని ఊరికే అనలేదు పెద్దలు. ప్రియుడికి బైక్ ఇచ్చి సోకులు పోదామనుకుంటే చివరికి ఖాకీలు వచ్చి యువతిని జైలు జీవితాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. అటు ప్రియుడి కేటీఎం బైక్ సీజ్, ఇటు ప్రియురాలు జైలుపాలు.. కాబట్టి యూత్ జాగ్రత్త.. ప్రేమించండి తప్పులేదు.. కానీ ఇలా పక్కోళ్ల బంగారం నొక్కేసి కేటీఎం రైడ్‌లు చేద్దామనుకుంటే చివరికి లాకప్‌లో ఉచలు లెక్కపెట్టాల్సి వస్తుంది!