లోకేష్.. మీ నాన్నలా తయారవుతున్నావే: ప్రధాని కామెంట్స్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నారా లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నారా లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''నువ్వు కూడా మీ నాన్నలా తయారువుతున్నావే!'' అని వ్యాఖ్యానించారు. తొలుత ఢిల్లీ నుంచి కర్నూలు జిల్లాలోని ఓవర్వకల్లు విమానాశ్రయానికి వచ్చిన ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల నుంచి ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కూడా విమానాశ్రయానికి చేరుకుని ప్రధానికి స్వాగతం పలికారు. అయితే.. సీఎం , డిప్యూటీ సీఎం, బీజేపీ చీఫ్ మాధవ్‌కు వెనుకాల నిలబడ్డ నారా లోకేష్‌ను ప్రధాని స్వయంగా దగ్గరకు తీసుకున్నారు. చేతిలో చేయి వేసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నారా లోకేష్ వెయిట్ బాగా తగ్గుతున్నారని వ్యాఖ్యానించారు. గతంలో చూసినప్పటికీ.. ఇప్పటికీ.. స్మార్ట్‌గా ఉన్నారని అన్నారు.
ఈ సందర్భంగా పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని.. ప్రతిరోజూ.. వర్కవుట్‌లు చేస్తున్నార ని వివరించారు. మీ నుంచి స్ఫూర్తి పొంది.. యోగా, ప్రాణాయామం వంటివి ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు.. నీరు ఎక్కువగా తీసుకుని.. తృణధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. మొత్తంగా నారా లోకేష్ గురించి రెండు నిమిషాల్లో వివరించారు. ఈ క్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ``ఇలానే చేస్తే.. త్వరలోనే నువ్వు కూడా మీ నాన్నలాగా తయారవడం ఖాయం`` అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అనంతరం.. ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలానికి వెళ్లారు.