గద్దర్‌కు పవన్ కళ్యాణ్ కారు కొనివ్వలేదా?
ప్రజా గాయకుడు గద్దర్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సంబంధాలపై గత కొంతకాలంగా అనేక కథనాలు, ప్రచారాలు వినిపిస్తున్నాయి.
ప్రజా గాయకుడు గద్దర్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న సంబంధాలపై గత కొంతకాలంగా అనేక కథనాలు, ప్రచారాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గద్దర్‌కు పవన్ కళ్యాణ్ కారు కొనిచ్చారనే వార్తలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తరచూ చర్చకు వస్తుంటాయి. అయితే ఈ ప్రచారాల్లో నిజం లేదని ప్రముఖ ప్రజా సంఘాల నేత మామిడి నారాయణ తాజాగా స్పష్టం చేశారు.
ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన మామిడి నారాయణ.. గద్దర్‌తో పవన్ కళ్యాణ్‌కు ఏర్పడిన అనుబంధం వెనుక ఉన్న పరిస్థితులను వివరించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం..‘ గద్దర్ మూడే కార్లు వాడారని ఒకటి బొలెరా వాహనం.. అది మల్కాజిగిరి మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ చింతల కనకరెడ్డి గారు ఇలా ఆటోలో తిరగవద్దు అని గద్దర్ కు బోలెరో వాహనం ఇచ్చాడు. కొంతకాలానికి అది పాడైంది. పాతది తీసుకొని కనకరావు గారే స్కార్పియో కొనిచ్చాడు. ఇది పైకి ఎక్కడానికి ఇబ్బంది అవుతుందని.. కారు ఎత్తుగా ఉందని గద్దర్ అంటే చివరకు దాన్ని తీసుకొని ఇన్నోవా కారు కొనిచ్చింది కూడా కనకా రెడ్డినే అని ’’ మామడి నారాయణ సంచలన నిజాలు బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ కారు కొనివ్వలేదని స్పష్టం చేశారు.
పవన్ ఇంటికొచ్చి కారు కొనివ్వమనే దౌర్భగ్య స్థితిలో గద్దర్ లేడని మామిడి నారాయణ పేర్కొన్నారు. పరిటాల రవి కుటుంబం, పవన్ కళ్యాణ్ కుటుంబాల మధ్య రాజకీయ, వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని తెలిపారు. ఆ కారణంగా తనకు భద్రతాపరమైన ముప్పు ఉండొచ్చనే ఆందోళన పవన్ కళ్యాణ్‌లో ఉండేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గద్దర్‌ను తన నివాసానికి తరచూ ఆహ్వానించి, చేగువేరా, భగత్ సింగ్ బొమ్మలతో పవన్ తన ఇంటిని అలరించి గద్దర్ ను విప్లవకారుడిగా నమ్మించాడని.. ఆయనతో సన్నిహితంగా మెలిగారని మామిడి నారాయణ పేర్కొన్నారు. తాను కూడా సామాజిక మార్పు, విప్లవ భావజాలం పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తినని పవన్ కళ్యాణ్ గద్దర్‌కు చెప్పి ఆయన విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నించారని వెల్లడించారు.
అయితే గద్దర్‌కు పవన్ కళ్యాణ్ కారు కొనిచ్చారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మామిడి నారాయణ స్పష్టంగా కొట్టిపారేశారు. గద్దర్‌ను ఆర్థికంగా ఆదుకున్నారనే ప్రచారాలు కూడా అతిశయోక్తులేనని ఆయన అభిప్రాయపడ్డారు. గద్దర్ వంటి ప్రజాకళాకారుడు తన వ్యక్తిత్వం, ప్రజాదరణ, ప్రజా మద్దతుతోనే జీవించారని, ఆయనను ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఆదుకున్నారనే ప్రచారం సరైనది కాదని పేర్కొన్నారు.
మామిడి నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గద్దర్, పవన్ కళ్యాణ్ సంబంధాలపై ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న అనేక కథనాలపై కొత్త చర్చకు తెరలేపాయి. అయితే ఈ అంశాలపై జనసేన పార్టీ లేదా పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
మొత్తంగా చూస్తే, గద్దర్‌కు పవన్ కళ్యాణ్ కారు కొనిచ్చారనే ప్రచారాన్ని మామిడి నారాయణ ఖండించగా.. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వెనుక భద్రతా, రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణమని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.