వైసీపీకి భారీ షాక్ ఇవ్వనున్న కూటమి

వైసీపీ భారీ ఓటమికి ఏణ్ణర్థం పూర్తి అవుతోంది. ఇంకా పార్టీ కోలుకోలేదు. పార్టీ పరిస్థితి ఇలా ఉంటే స్థానిక సంస్థలలో ఉన్న వైసీపీ నేతలు అంతా మెల్లగా జారుకుంటున్నారు.;

Update: 2025-11-24 03:42 GMT

వైసీపీ భారీ ఓటమికి ఏణ్ణర్థం పూర్తి అవుతోంది. ఇంకా పార్టీ కోలుకోలేదు. పార్టీ పరిస్థితి ఇలా ఉంటే స్థానిక సంస్థలలో ఉన్న వైసీపీ నేతలు అంతా మెల్లగా జారుకుంటున్నారు. కీలకమైన కార్పోరేషన్లు వైసీపీ కి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నాయి. విశాఖ గుంటూరు కార్పోరేషన్లు అలాగే వైసీపీకి దూరం అయ్యాయి. ఇపుడు నెల్లూరు మేయర్ పీఠానికి ఎసరు వచ్చేలా ఉంది అని అంటున్నారు దానికి ముహూర్తం సైతం ఖరారు చేశారు అని అంటున్నారు.

నారాయణ మంత్రాంగం :

నెల్లూరు జిల్లాకే చెందిన వారు మున్సిపల్ మంత్రి నారాయణ. ఆయన ఇపుడు సొంత జిల్లాలో మేయర్ పీఠం మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. మేయర్ గా ఉన్న స్రవంతిని గద్దె దించాలని కూటమి ఫిక్స్ అయిపోయింది. నిజానికి నెల్లూరు కార్పోరేషన్ లో ఉన్న 56 కార్పోరేటర్లను 2021లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది. ఒక్క డివిజన్ కూడా అప్పట్లో కూటమికి దక్కలేదు. అయితే 2024లో కూటమి అధికారంలోకి రాగానే ఈ 56 మందిలో ఏకంగా 29 మంది కూటమిలో చేరిపోయి వైసీపీకి కార్పోరేషన్ లో బలమైన ప్రతిపక్షంగా అవతరించారు. ఇపుడు వారితో పాటు మరో 11 మంది వైసీపీ కార్పోరేటర్లు జత కలవడంతో కూటమి బలం 40కి చేరింది. దాంతో మైనారిటీలో నెల్లూరు కాపోరేషన్ లో వైసీపీ పడింది అని అంటున్నారు. ఇక వీరంతా మంత్రి నారాయణను కలసి మేయర్ మీద ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. అభివృద్ధి జరగకుండా మేయర్ ప్రయత్నం చేస్తున్నారు అని దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని వారు అన్నట్లుగా తెలుస్తోంది.

అవిశ్వాసం నోటీసుతో :

ఇక మేయర్ మీద అవిశ్వాసం నోటీసుని ఎన్నికల అధికారికి ఇచ్చేందుకు రంగం సిద్ధం అయింది అని అంటున్నారు. మరో వైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఈ అవిశ్వాస ప్రక్రియకు మద్దతుగా నిలిచినట్లుగా చెబుతున్నారు. ఆయన వైసీపీలో ఉన్నపుడే ఈ కార్పోరేషన్ వైసీపీ పరం అయింది ఆయన మనిషిగా ఉన్న వారినే మేయర్ ని చేశారు అని చెబుతారు. అయితే ఇపుడు రాజకీయం పూర్తిగా మారింది. అందుకే అవిశ్వాసం అని అంటున్నారు.

పీఠం జారినట్లే :

నెల్లూరులో ఇప్పటికే ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ వైసీపీకి లేదు. ఇపుడు ఏకైక అధికార కేంద్రంగా ఉన్న మేయర్ పదవి కూడా పోతే వైసీపీ ఓటమి సంపూర్ణం అవుతుందని అంటున్నారు. మొత్తం కార్పోరేటర్లను గెలిచిన వైసీపీకి ప్రస్తుతం మూడవ వంతు మాత్రమే ఉన్నారని అంటున్నారు. అంటే రెండు వంతుల మంది కూటమి వైపు వెళ్ళారు, మరో నాలుగు నెలలలో పదవీ కాలం ముగుస్తున్న ఈ కార్పోరేషన్ లో అవిశ్వాసం పెట్టం రాజకీయంగా సంచలనం రేపుతోంది. అయితే ఇది ఎన్నికల వ్యూహంలో భాగం అని అంటున్నారు. నెల్లూరులో ఇప్పటికీ వైసీపీ గ్రాఫ్ పెద్దగా పెరగలేదు అని అంటున్నారు. దాంతో మేయర్ పీఠంతోనే గట్టి షాక్ ఇవ్వాలని కూటమి పెద్దలు చూస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News