పెరిగిపోతున్న అంబానీ ఆస్తి.. 24 రాష్ట్రాల జీడీపీలను వెనక్కి నెడుతూ..

దేశంలో రిచెస్ట్ మెన్ ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ.. కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాలో కూడా ముకేశ్ అంబానీ స్థానం సంపాదించుకున్నారు.;

Update: 2025-10-03 06:09 GMT

దేశంలో రిచెస్ట్ మెన్ ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ.. కేవలం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాలో కూడా ముకేశ్ అంబానీ స్థానం సంపాదించుకున్నారు. అలా పలు బిజినెస్ లు చేస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో నిలుస్తున్న ముకేష్ అంబానీ.. తాజాగా ప్రకటించిన హురూన్ రిచ్ లిస్ట్-2025 జాబితాలో కూడా టాప్ ప్లేస్ లో నిలిచారు. హురూన్ రిచ్ లిస్ట్ - 2025 ప్రకారం ముకేష్ అంబానీ ఆస్తి ఏకంగా రూ.9.55 లక్షల కోట్లు. ఈయన దేశంలో అత్యంత ధనవంతుడిగా అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు ఈయన నెట్వర్క్ విషయం చూసుకుంటే.. దేశంలో ఉన్న 24 రాష్ట్ర జీడీపీల కంటే అత్యధికంగా ఉంది.

ముకేష్ అంబానీ ఆస్తి ఇంతలా పెరగడానికి కారణం ఆయన పలు దేశాల్లో పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో పెట్టే పెట్టుబడులే..వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కొత్త కొత్త ఆవిష్కరణలు, వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెడుతూ భారీగా ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు.

ముఖేష్ అంబానీ వ్యాపారాల విషయానికి వస్తే.. ఈయన టెలికాం, రిలయన్స్ సమూహం పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీ, రిటైల్ వంటి రంగాలలో ముకేష్ అంబానీ చేసిన విస్తృతమైన వ్యాపార విస్తరణ ఈయన్ని ప్రపంచ స్థాయి బిలియనీర్ల జాబితాలో నిలిపింది. ఇండియా ఇన్ పిక్సెల్ డేటా ప్రకారం చూసుకుంటే.. ముకేష్ అంబానీ ఫ్యామిలీ నికర సంపద దేశంలో ఉండే 24 రాష్ట్రాల జీడీపీల కంటే అత్యధికంగా ఉంది అంటే ఆస్తిపాస్తులు ఏ లెవెల్ లో పెరుగుతున్నాయో చెప్పనక్కర్లేదు. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ముకేష్ అంబానీ కుటుంబం ఈ స్థాయి ఆస్తులను పెంచుకోవడం నిజంగా చెప్పుకోదగిన విషయమే..

మనదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో కేవలం నాలుగు రాష్ట్రాలు అంటే తమిళనాడు(15.71 లక్షల కోట్లు), మహారాష్ట్ర ( 24.11లక్షల కోట్లు ), కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ ( 14.23 లక్షల కోట్లు ), వంటి నాలుగు రాష్ట్రాలకే ముకేష్ అంబానీ కుటుంబం ఆస్తి కంటే ఎక్కువ ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల జీడీపీ కంటే ముకేష్ అంబానీ కుటుంబ నికర ఆస్తి ఎక్కువగా ఉంది.. ఓవైపు ఉన్న వ్యాపారాలను పెంచుకుంటూ.. మరోవైపు కొత్త కొత్త రంగాలలో పెట్టుబడులు పెడుతూ మరింత సక్సెస్ అవుతున్నారు.. ఈయన టెక్నాలజీకి అనుగుణంగా అంతర్జాతీయ ప్రాజెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో ఈయన ఆస్తిపాస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా పేరు తెచ్చుకొని భారతీయుల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలవడం గమనార్హం. అలాగే గత ఏడాది ప్రకటించిన హురూన్ ఇండియా రిచ్ లిస్టు- 2024లో గౌతమ్ అదానీ అంబానీని అధిగమించి అత్యంత ధనవంతుడైన ఇండియన్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ తాజాగా విడుదల చేసిన లిస్టులో ముకేష్ అంబానీ గౌతమ్ అదానీని అధిగమించి టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇక హురూన్ రిచ్ లిస్టు-2025 ప్రకారం మొదటి 3స్థానాల్లో మొదట ముకేష్ అంబానీ, రెండో ప్లేసులో గౌతమ్ అదానీ, మూడో ప్లేస్ లో HCL కి చెందిన రోష్నీ నాదర్ మల్హోత్రాలు ఉన్నారు.

Tags:    

Similar News