ఇక WFH అంటే హ్యాపీ కాదు… జాబ్ సెక్యూరిటీపై ఉద్యోగుల గుబులు

ఐటీ ఉద్యోగులకు ఒకప్పుడు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) అంటే ఎంతో ఇష్టమైన పని. హ్యాపీగా ఇంట్లో కూర్చుని పనిచేసుకోవచ్చని పండగ చేసుకునేవారు.

Update: 2026-05-20 08:27 GMT

ఐటీ ఉద్యోగులకు ఒకప్పుడు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) అంటే ఎంతో ఇష్టమైన పని. హ్యాపీగా ఇంట్లో కూర్చుని పనిచేసుకోవచ్చని పండగ చేసుకునేవారు. కానీ, ఇంటర్నేషనల్ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 7000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తూ వాడిన ఒక క్లెవర్ స్ట్రాటజీ ఇప్పుడు అందరినీ వణికిస్తోంది. ఇకపై కంపెనీల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ మెయిల్ వస్తే సంతోషపడాలో లేక ఉద్యోగం ఊడుతుందేమోనని గుబులు పడాలో తెలియని పరిస్థితి వచ్చింది. ఆ వివరాలు చూద్దాం..

కార్పొరేట్ కంపెనీల మైండ్ గేమ్:

సాధారణంగా ఆఫీసులో అందరూ ఉన్నప్పుడు ఎవరికైనా లేఆఫ్ ఆర్డర్ ఇస్తే, ఉద్యోగులంతా ఒకటై గొడవ చేసే అవకాశం ఉంటుంది. క్యాంపస్‌లో వందల మంది ఒక్కసారిగా నిరసనలు తెలిపితే మీడియాలో కంపెనీ బ్రాండ్ ఇమేజ్ పాడవుతుంది. ఇక అందుకే మెటా లాంటి టాప్ కంపెనీలు ఇప్పుడు ఒక సైకలాజికల్ స్ట్రాటజీని వాడుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా ముందే ‘ఇంటి నుంచే పనిచేయండి’ అని చెప్పి, ఆ తర్వాత ఫోన్ లేదా మెయిల్ ద్వారా పింక్ స్లిప్ చేతిలో పెడుతున్నాయి. ఆఫీసు వాతావరణం ప్రశాంతంగా ఉంచడానికే ఈ ప్లాన్.

ఉదయం 8 గంటలకే డెడ్‌లైన్ ప్లాన్:

మెటా ఈ లేఆఫ్ ప్రక్రియను ఉదయం 8 గంటలకే ప్రారంభించడం వెనుక ఒక పక్కా స్కెచ్ ఉంది. ఉద్యోగి ఆఫీస్‌కు బయలుదేరే ముందే లేదా ల్యాప్‌టాప్ ఆన్ చేసే టైమ్‌లోనే ఈ మెసేజ్ వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల వాళ్ళ టైం ప్రకారం, ఆయా దేశాల్లో ఉదయం కాగానే ఈ లేఆఫ్ ప్రక్రియను పూర్తి చేసేలా సాఫ్ట్‌వేర్ ఆటోమేషన్‌ను సెట్ చేశారు. దీనివల్ల ఉద్యోగి ఆఫీస్ లోపలికి అడుగు పెట్టకుండానే ఇంట్లోనే జాబ్ పోయిందని తెలుస్తుంది.

ఏఐ మాయ:

ఈ 7000 మంది తొలగింపునకు ప్రధాన కారణం కంపెనీ నష్టాల్లో ఉండటం కాదు. మెటా సంస్థ పూర్తిగా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' వైపు అడుగులు వేస్తుండటమే దీనికి అసలు కారణం.ఇక మానవ వనరుల అవసరం లేకుండా, ఏఐ టూల్స్ ద్వారానే చాలా పనులు పూర్తి చేసుకోవచ్చనే నమ్మకానికి మెటా వచ్చేసింది. రాబోయే రోజుల్లో మిగతా గ్లోబల్ కంపెనీలు కూడా ఇదే బాటలో నడవబోతున్నాయనే దానికి ఇదొక బలమైన హెచ్చరిక లాంటిది.

ఉద్యోగుల్లో కొత్తగా ‘WFH ఫోబియా’:

ఈ సంఘటన తర్వాత ఐటీ రంగంలో ఒక కొత్త భయం పట్టుకుంది. సాధారణంగా కంపెనీల నుంచి వచ్చే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఈమెయిల్స్ చూస్తే ఇకపై ఉద్యోగులు సంతోషపడటం మానేస్తున్నారు. ఇక నా ఉద్యోగం ఊడిపోవడానికి ఇదొక ముందస్తు హెచ్చరికా? అని సాఫ్ట్‌వేర్ బాబులు వణికిపోయే పరిస్థితి వచ్చింది. డబ్ల్యూఎఫ్హెచ్ అంటే హ్యాపీ అనే రోజులు పోయి, అదొక డేంజర్ బెల్ లాగా ఉద్యోగస్తులకు మారిపోయింది.

ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మానవ వనరుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకప్పుడు లగ్జరీగా భావించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్, ఇప్పుడు ఉద్యోగులను ఆఫీసుకు రాకుండా నిరోధించే ఒక సాకుగా మారిపోవడం బాధాకరం. ఇక మెటా తెచ్చిన ఈ సరికొత్త ట్రెండ్ చూస్తుంటే.. భవిష్యత్తులో ఐటీ ఉద్యోగులు తమ జాబ్ సెక్యూరిటీ కోసం ఎన్ని సవాళ్లు ఎదురుకోవాలో అని టెన్షన్ పడుతున్నారు.

Tags:    

Similar News