క‌మ‌లం.. ఫ్ల‌వ‌ర్ కాదు.. ఫైరే!

బీజేపీ ఎన్నిక‌ల గుర్తు.. క‌మ‌లం. అంటే ఫ్ల‌వ‌ర్‌!. ఓ ప‌దేళ్ల కింద‌ట‌... ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ... ఈ పార్టీని చేర‌దీశారు.;

Update: 2026-05-04 17:46 GMT

బీజేపీ ఎన్నిక‌ల గుర్తు.. క‌మ‌లం. అంటే ఫ్ల‌వ‌ర్‌!. ఓ ప‌దేళ్ల కింద‌ట‌... ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ... ఈ పార్టీని చేర‌దీశారు. క‌మ్యూనిస్టుల‌ను అణిచేయాల‌న్న కోపమో.. క‌సో.. రాజ‌కీయ వ్యూహమో.. మొత్తంగా ఆమె క‌మ‌లం పార్టీతో జ‌ట్టుక‌ట్టారు. నేరుగా ప్ర‌త్య‌క్ష పొత్తు లేక‌పోయి నా.. ప‌రోక్షంగా ఆ పార్టీని పెంచి.. నీరు పోసి నారు పెట్టి.. పెద్ద‌ది చేశారు.

ఆ స‌మ‌యంలో మ‌మ‌త స్పందిస్తూ.. ``బీజేపీ.. ఫ్ల‌వ‌ర్ పార్టీ. అది మాకు లెక్క‌కాదు. మా పోరాటం ప్ర‌జా వ్య తిరేక శ‌క్తుల‌పైనే(క‌మ్యూనిస్టులు)`` అని వ్యాఖ్యానించారు. కానీ, ఆమె అనుకున్న అంచ‌నాలు త‌డ‌బడ్డా యి. ఆమె ఏ పార్టీ అయితే.. ఫ్ల‌వ‌ర్ అనుకున్నారో.. అది ఫ్ల‌వ‌ర్ కాదు `ఫైర్‌` అని తాజా ఎన్నిక‌లు నిరూపించా యి. కార‌ణాలు ఎలా ఉన్నా.. ఇక్క‌డ కావాల్సింది విజ‌యం.. అన్న ప్ర‌ధాని మోడీ వ్యాఖ్య‌లు తాజాగా సాకా రం అయ్యాయి.

ఏడేళ్ల కింద‌ట‌.. బీజేపీ దూకుడు పెరిగింది. ఈ స‌మ‌యంలోనే ఆ పార్టీకి బ‌ల‌మైన ద‌న్నుగా సువేందు అధి కారి క‌నిపించారు. ఆయ‌న ఒక‌ప్పుడు మ‌మ‌త‌కు రైట్ హ్యాండ్‌. ఎన్నో అంత‌ర్గ‌త స‌మావేశాలు.. పార్టీ ప‌ర‌మై న నిర్ణ‌యాలు.. మ‌మ‌త తీసుకునే అత్యంత ర‌హ‌స్య నిర్ణ‌యాలు కూడా తెలిసిన నాయ‌కుడిగా సువేందుకు పేరుంది. మ‌మ‌త‌కు ఇంట్లో మ‌నిషి మాదిరిగా వ్య‌వ‌హ‌రించిన సువేందుకు.. బీజేపీ తాంబూలం ఇచ్చేసిం ది. మ‌నం గెలిస్తే.. నువ్వే సీఎం అని హామీ ఇచ్చింది.

అప్ప‌టి నుంచి సువేందుకు-మ‌మ‌త‌కు మ‌ధ్య పోరాటం జ‌రుగుతూనే ఉంది. తాజాగా సువేందు.. స‌హా అనేక మంది తృణ‌మూల్ కీల‌క నాయ‌కులు.. ఎన్నిక‌ల‌కుముందు పార్టీ మారారు. బీజేపీ పంచ‌న చేరారు. ఇది మ‌మ‌త ఊహించ‌ని ప‌రిణామం. అంతేకాదు.. కొన్నికొన్ని జిల్లాల్లో ఆమె స్వ‌యంగా బీజేపీ కార్యాల యాల నిర్మాణం కోసం భూములు ఇచ్చి.. అనుమ‌తులు కూడా ఉచితంగా ఇచ్చి పోషించి పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ దెబ్బ‌కు గ‌డ్డి పూలు(తృణ‌మూల్‌) నేల‌రాలుతున్నాయి.

క‌మ్యూనిస్టుల హ‌వాపోయింది!

అయితే.. ఈ 15 ఏళ్ల కాలంలో మ‌మ‌త సాధించిన విజయం మాత్రం ఉంది. అదే కమ్యూనిస్టుల కంచుకోట ల‌ను బ‌దాబ‌ద‌లు చేయ‌డం. త‌ద్వారా త‌న రాజ‌కీయ అవ‌నిక‌ను సుస్థిరం చేసుకోవాల‌ని ఆమె భావించారు. కానీ, కమ్యూనిస్టులు పోవ‌డంతో ఏర్ప‌డిన గ్యాప్‌ను బీజేపీ లాఘ‌వంగా కైవ‌సంగా చేసుకుంది. దీనికితోడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డంతో మ‌మ‌త‌కు మ‌రిన్ని చిక్కులు వ‌చ్చాయి. వీటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు.. తిరిగి క‌మ్యూనిస్టుల శ‌ర‌ణు జొచ్చే ప్ర‌య‌త్నాలు చేసినా.. ఫ‌లించ‌లేదు. ఇక‌, ఎలానూ కాంగ్రెస్ పార్టీ ఆమెను ప‌క్క‌న పెట్టింది. మొత్తంగా బీజేపీని ఫ్ల‌వ‌ర్ అనుకున్న మ‌మ‌త‌కు అది ఫైర్ అని నిరూపించింది.

Tags:    

Similar News