కాశ్మీర్ అసలు చరిత్ర తెలీదా? సైనికుల త్యాగాలపై జెన్-జీ పర్యాటకురాలి రచ్చ!
ఈనాటి జెన్-జీ (Gen-Z) తరానికి కాశ్మీర్ అనగానే ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యాటకం, సోషల్ మీడియా రీల్స్ మాత్రమే గుర్తుకొస్తున్నాయి.
ఈనాటి జెన్-జీ (Gen-Z) తరానికి కాశ్మీర్ అనగానే ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యాటకం, సోషల్ మీడియా రీల్స్ మాత్రమే గుర్తుకొస్తున్నాయి. గతంలో కాశ్మీర్ ఎదుర్కొన్న తీవ్రమైన అభద్రత, హింస మరియు అక్కడి ఆర్మీ జవాన్లు చేసిన త్యాగాల గురించి నేటి తరం యువతకు సరైన అవగాహన ఉండటం లేదు. తాజాగా ఒక జెన్-జీ పర్యాటకురాలు సెక్యూరిటీ చెక్‌పోస్ట్ వద్ద ఆర్మీ జవాన్లతో ప్రవర్తించిన తీరు, వారిని తీవ్రంగా నిందించిన ఘటన దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
వైరల్ వీడియో.. ఆర్మీతో జెన్-జీ రచ్చ :
కాశ్మీర్ టూర్‌కు వెళ్లిన ఒక జెన్-జీ అమ్మాయికి సెక్యూరిటీ కారణాల వల్ల ఆర్మీ అధికారులు రోడ్డు బ్లాక్ చేయడం నచ్చలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ పర్యాటకురాలు "నేను జెన్-జీని, నా ట్రావల్ ను అడ్డుకుంటారా? మీ జీతాలు మేము కట్టే పన్నుల నుంచే వస్తున్నాయి, మీ వల్లే కాశ్మీరీలు ఇబ్బంది పడుతున్నారు" అంటూ ఆర్మీ పర్సనల్‌పై విరుచుకుపడింది. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారింది.
భద్రత ముఖ్యం కానీ ఫోటోలు కాదు:
ఆర్మీ జవాన్లు ఒక రహదారిని బ్లాక్ చేశారంటే అక్కడ ఏదో ఒక తీవ్రమైన భద్రతా కారణం ఉండే ఉంటుంది. ఇక ఏదో సరదాగా వెకేషన్‌కు వెళ్లే పర్యాటకులకు అక్కడి అసలు పరిస్థితులు, ప్రాణాపాయాల గురించి ఏం తెలుస్తుంది? వేల అడుగుల ఎత్తులో రాత్రింబవళ్లు పహారా కాస్తూ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సరిహద్దులను కాపాడే సైనికుల కష్టాన్ని గుర్తించకుండా, కేవలం వ్యక్తిగత అసౌకర్యం కోసం వారిని అసహ్యించుకోవడం ఎంతవరకు సమంజసం?
90ల నాటి కాశ్మీర్ పరిస్థితి తెలుసా?:
80లు, 90ల కాలంలో పుట్టిన వారికి ఆనాటి కాశ్మీర్ భయానక వాతావరణం బాగా తెలుసు. నిత్యం కాల్పులు, ఉగ్రవాద దాడులు, స్థానికుల అభద్రతా భావంతో ఆ ప్రాంతం ఎంతగా నలిగిపోయిందో వర్ణించలేం. మన సైన్యం రాత్రింబవళ్లు చేసిన అసాధారణ త్యాగాలు, పోరాటాల వల్లే ఈరోజు కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడి, సురక్షితంగా టూరిజం ఎంజాయ్ చేసే స్థాయికి వచ్చింది. ఇక చదువుకుంటున్న నేటి యువత ఈ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సామాజిక బాధ్యత విస్మరిస్తున్నారా?:
ఏదైనా విఐపి కన్వాయ్ వెళ్తుంటే గంటల తరబడి ట్రాఫిక్‌లో ఆగిపోతే ప్రశ్నించడంలో ఒక అర్థం ఉంది. కానీ, దేశ రక్షణ బాధ్యతను మోస్తున్న ఆర్మీ అధికారులతో వాదనకు దిగడం అహంకారానికి, అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. ప్రతికూల వాతావరణంలో, గడ్డకట్టే చలిలో దేశ సరిహద్దుల్లో కాపలా కాసే ఆర్మీ గౌరవాన్ని నిలబెట్టడం ప్రతి పౌరుడి బాధ్యత.
ఈరోజు మనం హాయిగా ఇలా పర్యటించగలుగుతున్నామంటే దాని వెనుక వేలాది మంది సైనికుల రక్తం, చెమట ఉన్నాయి. ఇక కేవలం రీల్స్, ఫోటోల కోసమే కాకుండా, కాశ్మీర్ సాధించిన శాంతి వెనుక ఉన్న మన సైనికుల త్యాగాలను జెన్-జీ తరం గుర్తించి, గౌరవించడం నేర్చుకోవాలి కొందరి అభిప్రాయం.