విదేశీయులపై అదే విద్వేశం.. అమెరికన్ల కోసం బట్టలు చింపేసుకున్న జేడీ వాన్స్

స్థానిక ఉద్యోగులకు తగిన అవకాశాలు ఇవ్వకుండా.. వారి పొట్టగొడుతూ కేవలం తమ స్వార్థ లాభాల కోసమే చూసే కంపెనీల వైఖరిని ఇక ఏమాత్రం సహించేది లేదని వాన్స్ తేల్చిచెప్పారు.

Update: 2026-10-18 05:53 GMT

లక్షల కోట్ల డాలర్ల ఆదాయంతో గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్న టెక్ దిగ్గజాలు నేడు అమెరికా ఐటీ రంగంలో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. తమ వ్యాపారాలను విపరీతంగా విస్తరిస్తూ.. లాభాల బాటలో పయనిస్తున్నప్పటికీ.. సంస్థల పునాదులకు ఆధారం అయిన ఉద్యోగుల భవిష్యత్తును మాత్రం గాలికి వదిలేస్తున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా స్వదేశీయులైన అమెరికన్లను విధుల్లోంచి నిర్దాక్షిణ్యంగా తొలగించి.. ఆ స్థానాల్లో ఇతర దేశాల నుంచి తక్కువ వేతనాలకే లభించే ఉద్యోగులను నియమించుకోవడం.. పనులను విదేశాలకు తరలించడం వ్యాపార నైతికతకే సవాలుగా మారింది. ఈ కఠోర వాస్తవాల నేపథ్యంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు టెక్ ప్రపంచంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

స్థానిక ఉద్యోగులకు తగిన అవకాశాలు ఇవ్వకుండా.. వారి పొట్టగొడుతూ కేవలం తమ స్వార్థ లాభాల కోసమే చూసే కంపెనీల వైఖరిని ఇక ఏమాత్రం సహించేది లేదని వాన్స్ తేల్చిచెప్పారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థ గత ఏడాది సుమారు ఆరు వేల మంది అమెరికన్ ఉద్యోగులను రోడ్డున పడేసి.. వేలాది హెచ్1బీ వీసాలకు దరఖాస్తులు చేయడాన్ని ఆయన గట్టిగా తప్పుబట్టారు. అయితే ఆ దరఖాస్తుల్లో అత్యధిక భాగం పాత ఉద్యోగుల వీసాల పొడిగింపులకేనని కంపెనీ వర్గాలు వివరణ ఇస్తున్నప్పటికీ తక్కువ వ్యయంతో పనులు ముగించేందుకు విదేశీ నైపుణ్యాన్ని వాడుకుంటున్నారనే ఆరోపణలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. అమెరికన్ల హక్కుల పరిరక్షణ, వీసా విధానాలపై రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతకు ఈ వ్యవహారం ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ పరిణామాలు కేవలం అమెరికన్లకే కాక.. ఎన్నో ఆశలతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వేలాది మంది భారతీయ ఉద్యోగుల్లో కూడా తీవ్ర ఆందోళనను నింపుతున్నాయి. ప్రభుత్వం విధించిన తాత్కాలిక పీఈఆర్ఎం కార్యక్రమ ఆంక్షల వల్ల ఏళ్ల తరబడి గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న ఎంతోమంది భారతీయ నైపుణ్యవంతుల జీవితాలు ఐయోమయంలో పడ్డాయి. అయితే అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు, కఠినతరమవుతున్న నిబంధనల వల్ల టెక్ పరిశ్రమ తన భవిష్యత్ వ్యూహాలను మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కేవలం విదేశీయుల వల్లే స్థానికుల ఉద్యోగాలు పోతున్నాయనడం పూర్తిగా నిజం కాకపోయినా.. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి మార్పుల మధ్య మానవీయ కోణాన్ని మరచిపోకూడదు. ప్రస్తుతం స్థానిక ఉద్యోగుల ప్రయోజనాలు, విదేశీ ప్రతిభావంతుల అవసరం, కంపెనీల లాభాల మధ్య నలిగిపోతున్న ఉద్యోగుల భవిష్యత్తు ఏ దిశగా పయనిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News