ఢిల్లీలో పై 'చేయి' ఎవరిది ?!

ప్రస్తుతం ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ చర్యలను సీజేపీ నియంతృత్వం, యువతను ప్రభుత్వం భయపెడుతోందని, మోడీ ఓటమి అంగీకరించాడని చెబుతుంది.

Update: 2026-10-10 06:34 GMT

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను కాక్రోచెస్ పోల్చడంతో వ్యంగ్యంగా మొదలైన కాక్రోచ్ జనతాపార్టీ నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ జంతర్ మంతర్ లో చేసిన ఆందోళనలతో బలపడింది. సీజేపీ ఆందోళనలు మొదట తేలిగ్గా తీసుకున్న కేంద్రం చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాల్సి వచ్చింది.

సర్ ప్రక్రియలో భాగంగా దేశంలో సుమారు 13 కోట్ల ఓట్లు తొలగించిన నేపథ్యంలో ఎన్నికల కమీషన్ ో ఉన్న ఇద్దరు కమీషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు 14 సార్లు సర్ కు ప్రక్రియ కొనసాగుతున్న వివాదం మీద అభ్యంతరాలు నమోదు చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి.

దీంతో అర్హులైన ఓటర్లను ఓటు హక్కు నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఓటు డాటా బేస్ నిర్ణయాల్లో పారదర్శకత లేకపోవడాన్ని ప్రతిపక్షాలు, సీజేపీ దీనిని ఓటు చోరీగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీజేపీ ‘జంతర్ మంతర్ 2.0’ పేరుతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది.

సీజేపీ ఆందోళనలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. 25 వేల పారామిలటరీ బలగాలను మోహరించారు. రైళ్లను రద్దు చేశారు. 45 మెట్రో స్టేషన్లలో ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ పెద్ద ఎత్తున మళ్లించారు. దీంతో ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఆందోళన చేసేందుకు ఢిల్లీకి వచ్చిన సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే, నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ దృవ్ రాఠీని గురుగ్రామ్ లో, సీజేపీ లీగల్ టీమ్ హెడ్ రత్నసింగ్ ను వారి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రైళ్లు రద్దు చేస్తూ ఆందోళనలు అదుపులోకి తేవాలని చేసిన ప్రభుత్వ చర్యలపై ‘ఈగను చంపడానికి సుత్తిని ఉపయోగిస్తారా’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ చర్యలను సీజేపీ నియంతృత్వం, యువతను ప్రభుత్వం భయపెడుతోందని, మోడీ ఓటమి అంగీకరించాడని చెబుతుంది. ఢిల్లీని కంటోన్మెంట్ గా మార్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

గతంలో జరిగిన ఆందోళనలు మొదట తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం తర్వాత అణచివేతకు కఠినంగా వ్యవహరించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు కేంద్ర మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుత ప్రభుత్వ చర్యలు నివారణాత్మకమేనా ? లేక అణచివేతనా ? అరెస్టు అయినవారు, అదుపులోకి తీసుకున్న వారు ఎప్పుడు విడుదల అవుతారు ? నిరసన ఎలా ముందుకు సాగుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలో ఎవరిది పైచేయి అవుతుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News