రియల్ గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్.. తెలుగు రాష్ట్రాల్లో ఏటా 1000 కోట్ల ఆదాయం..
ఈ నేపథ్యంలోనే గోల్డ్ కంటే ఇప్పుడు ఈ ఇమిటేషన్ గోల్డ్ కి ఆదరణ మరింత పెరిగిపోయింది.. ఒక్క మన తెలుగు రాష్ట్రాలలోనే ఏటా 1000 కోట్ల వ్యాపారం జరుగుతోందని వ్యాపారస్తులు చెబుతున్నారు.;
ఈ మధ్యకాలంలో రియల్ గోల్డ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సామాన్యుడు ఆ బంగారం కొనలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ వాటిని కొనలేక ఇబ్బందులు పడుతూ శుభకార్యాలను కూడా సవ్యంగా జరిపించలేకపోతున్నామే అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఈ సమయంలో రోల్డ్ గోల్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనినే ఇమిటేషన్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఇందులో గోల్డ్ లేకపోయినా వివిధ లోహాలతో ఈ ఆభరణాలను తయారు చేస్తారు. వాస్తవానికి దొంగల భయం నుండి తప్పించుకోవాలి అంటే ఈ ఇమిటేషన్ గోల్డ్ చాలా బెస్ట్ అని చాలామంది ఇప్పటికే చెబుతున్నారు కూడా. అందుకే సామాన్యులను మొదులుకొని మధ్యతరగతి సంపన్నులు కూడా ఇప్పుడు ఈ ఇమిటేషన్ గోల్డ్ పైనే ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే గోల్డ్ కంటే ఇప్పుడు ఈ ఇమిటేషన్ గోల్డ్ కి ఆదరణ మరింత పెరిగిపోయింది.. ఒక్క మన తెలుగు రాష్ట్రాలలోనే ఏటా 1000 కోట్ల వ్యాపారం జరుగుతోందని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇకపోతే ఈ ఇమిటేషన్ గోల్డ్ ను ఎలా తయారు చేస్తారు? వీటి బిజినెస్ సంగతి ఏంటి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇమిటేషన్ గోల్డ్ ను నికెల్, కాడ్మియం, ఇత్తడి తదితర లోహాలతో తయారుచేస్తారు. వీటిలోకి గాజు, పూసలు, రంగురాళ్లతో పాటు ప్లాస్టిక్, కాటన్, తోలు వంటి వివిధ రకాల వస్తువులను జోడించి ఈ ఆభరణాలను తయారుచేస్తారు. ముఖ్యంగా బ్రేస్లెట్ లు, నల్లపూసలు, హారాలు, చెవి పోగులు, గాజులు రూపొందిస్తూ ఉండడం గమనార్హం. ప్రత్యేకంగా వివాహాలతో పాటు ఇతర శుభకార్యాలకు కూడా ఆభరణాలు సెట్ లు, సౌత్ ఇండియన్ , టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ పీసులు వంటివి తయారు చేస్తున్నారు.
ఇకపోతే ఇలా తయారుచేసిన ఈ ఇమిటేషన్ గోల్డ్ లో 50% నెక్లెస్లు , చైన్లు అమ్మకాలలో ప్రథమంగా ఉండగా.. మిగతా చెవిపోగులు, ఉంగరాలు, బ్రేస్లెట్లకు డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాలలో 50 రూపాయల నుంచి రూ.3వేల మధ్య ధరలలో ఈ ఇమిటేషన్ నగలు లభిస్తున్నాయని, అటు మధ్యతరగతి ఇటు సామాన్య కుటుంబాలతో పాటు ఇటీవల సంపన్న మహిళలు కూడా ఆర్డర్ ఇస్తున్నారు అంటూ బేగంబజార్ కి చెందిన వ్యాపారి రితేష్ శర్మ కూడా తెలిపారు. ఇకపోతే ఈ ఇమిటేషన్ గోల్డ్ వల్ల వ్యాపారం ప్రతి యేటా రూ.22 వేల కోట్ల మేర దేశవ్యాప్తంగా జరుగుతోందని.. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఏకంగా 1000 కోట్ల మేరా క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు వరల్డ్ కౌన్సిల్ తాజా నివేదికలో వెల్లడించింది.
ఇకపోతే ఈ ఇమిటేషన్ ఆభరణాల తయారీలో చైనా తర్వాత భారత్ రెండవ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, కర్నూలు, మచిలీపట్నం, విశాఖపట్నం, తిరుపతిలో వీటి తయారీ అమ్మకాలు భారీగా సాగుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి..తెలంగాణలో హైదరాబాద్, సిద్దిపేట , ఢిల్లీ, జైపూర్, ముంబై వంటి ప్రాంతాలలో కూడా వీటికి పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణలో జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా జాతీయ స్థాయి శిక్షణ కేంద్రం నడుస్తోంది. ఇందులో ఆన్లైన్ కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఈ పరిశ్రమ దేశవ్యాప్తంగా 40 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు సమాచారం.