ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో ఏముంది?

ఈ నేపథ్యంలో కోర్టుకు హైదరాబాద్ నగర పోలీసులు రవికి సంబంధించిన రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు.;

Update: 2025-11-19 08:23 GMT

పెను సంచలనంగా మారిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేయటమే కాదు.. కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ మీద చంచలగూడ జైలుకు తరలించారు. 

ఈ నేపథ్యంలో కోర్టుకు హైదరాబాద్ నగర పోలీసులు రవికి సంబంధించిన రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. ఇందులో రవికి సంబంధించిన పలు కీలక అంశాల్ని పోలీసులు పేర్కొన్నారు. కోర్టుకు సమర్పించిన ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో ఏముందంటే?

- భార్యతో విడిగా ఉన్న రవి.. విడాకుల కోసం హైదరాబాద్ కు వచ్చిన సమయంలో.. అతని భార్య పోలీసులకు సమాచారం అందించటంతోనే అరెస్టు అయ్యాడన్న సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. రిమాండ్ రిపోర్టులో మాత్రం అందుకు భిన్నమైన వాదనను పోలీసులు వినిపించారు.

- రవిని పోలీసులకు పట్టించటంలో అతని భార్య పాత్ర లేదని.. అతను వినియోగించిన రెండు డొమైన్ల ద్వారానే పోలీసులు అతన్ని గుర్తించినట్లుగా తేలింది. ఇదిలా ఉండగా.. ఐ బొమ్మ.. బప్పం టీవీతో పదిహేడు ప్రధాన వెబ్ సైట్లు.. అలాగే 65కు పైగా మిర్రర్ వెబ్ సైట్లను నిర్వహించినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వెబ్ సైట్లకు సుమారు 3.7 మిలియన్ల యూజర్లు లాగిన్ అవుతున్నారు.

- రవి కోసం ఆరా తీసిన పోలీసులు అతను రెండు ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు. అందులో ఒకటి ఆరిజోనా అడ్రస్ తో ఒక డొమైన్.. మరొకటి హైదరాబాద్ లోని అమీర్ పేట అడ్రస్ తో రిజిస్ట్రేషన్ చేశాడు. వీటి ఆధారంగా రవి ఫోన్ నెంబరు దొరికింది. దాని సీడీఆర్ ను తనిఖీ చేయగా.. అతను కూకట్ పల్లి రెయిన్ బో విస్టా అపార్టుమెంట్లో ఉన్నట్లుగా తేలింది.

- రవి ఇంటికి వెళ్లిన పోలీసులకు.. తలుపులు తీయకుండా గంటన్నర పాటు ముప్పతిప్పలు పెట్టాడు. చివరకు అదుపులోకి తీసుకొని విచారించగా.. చేసిన తప్పును అంగీకరించాడు.

- పోలీసులు ఇంటికి వచ్చిన సమయంలో తలుపులు తీయకుండా గంటన్నర పాటు టెలిగ్రామ్ డేటా.. తన ఫోన్ లోని డేటా మొత్తాన్ని క్లియర్ చేశాడు. వ్యక్తిగత ల్యాప్ టాప్ బాత్రూంలోని రూఫ్ కింద పెట్టి.. సెల్ ఫోన్ ను బీరువాలో దాచాడు. ఎక్కడకు వెళ్లినా సర్వర్లకు కనెక్టు అయ్యేందుకు వీలుగా సాఫ్ట్ వేర్ ఉన్న పరికరాల్ని రవి తన వెంట తీసుకెళ్లేవాడు.

- రవి ఇంట్లో రెండు ఫోన్లు.. ప్రహ్లాద్ కుమార్ పేరుతో ఉన్న డ్రైవింగ్ లైసెన్సు.. పాన్ కార్డు.. 18 హార్డు డిస్కులు.. 21 బ్యాంక్ పాసుపుస్తకాలు.. టూవీలర్.. ల్యాప్ ట్యాప్.. సీపీయూలు.. 34 డెబిట్.. క్రెడిట్ కార్డుల్నిస్వాధీనం చేసుకున్నారు. అతనికి సహకరించిన బాలాజీ.. ప్రశాంత్ అనే ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.

- భారీ ట్రాఫిక్ నేపథ్యంలో బెట్టింగ్ సైట్లకు లింక్ చేసిన రవి.. రెండు ట్రాఫిక్ డొమైన్లను ఏర్పాటు చేశాడు. ఇందులో ఒకటి అమెరికాలో ఉండగా.. మరొకటి అమీర్ పేట నుంచి రిజిస్టర్ చేయించారు. నిజానికి రవి అరెస్టు వెనుక ఈ రెండు వెబ్ సైట్లే పట్టించాయి.

- రిమాండ్ రిపోర్టులో రవి తానే సినిమాలను పైరసీ చేసినట్లుగా అంగీకరించాడు. ఏ విధంగా సైట్లు నడిపోడో వివరంగా పోలీసులకు వివరించాడు.

- పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీల ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. రవి బెదిరింపులకు పాల్పడ్డ స్టేట్ మెంట్లు.. విదేశీ పౌరసత్వం తీసుకున్న వివరాల్ని కూడా వెల్లడించారు.

- క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ లు.. ఎన్ఆర్ ఈ బ్యాంకు ఖాతాల్ని విశ్లేషించాల్సి ఉంది.తన గుర్తింపును మార్చుకొని ప్రహ్లాద్ పేరుతో ఉన్న పాన్ కార్డుపై తీసుకున్న ఖాతాల్ని తనిఖీ చేయాల్సి ఉంది. తన భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేసుకొని.. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశం పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఇందు కోసం రూ.80 లక్షలు ఖర్చు చేశాడు.

- ఒకవేళ భారత పోలీసులు పట్టుకుంటే ఎన్ఆర్ఐ పేరుతో తప్పించు కునేందుకు వీలుగా ఈ విధంగా చేసినట్లుగా గుర్తించినట్లుగా పేర్కొన్నారు. రవికి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల్లోనే రూ.20కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.

- బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చే డబ్బుతో రెండు నెలలకు ఒక దేశం తిరిగేవాడు. పైరసీ వైపు మళ్లిన రవి కేవలం యాడ్స్ ద్వారానే నెలకు రూ.11 లక్షలు ఆర్జిస్తున్నట్లుగా గుర్తించారు. అరెస్టు కావటానికి ముందు ఫ్రాన్స్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు.

- సినిమాల్ని పైరసీ చేయటం ఎలా అన్న అంశంతో పాటు..తనకుతానే సినిమాల్ని పైరసీ చేసిన వైనాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

- పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీల ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు టెక్నికల్ ఎవిడెన్సు సేకరించారు.

- రవి తీసుకున్న విదేశీ పౌరసత్వం తీసుకున్న వివరాలు కూడా రిపోర్డులో పేర్కొన్నారు.

Tags:    

Similar News