మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!

అప్పటివరకు మద్దతు ఇస్తున్న వారు సైతం.. ఇప్పుడు తల పట్టుకున్నట్లుగా ఉంది పరిస్థితి. ఇజ్రాయెల్ తీరును బలంగా సమర్థించేవారు సైతం ఇప్పుడు లెబనాన్ పై ఆ దేశం చేస్తున్న దాడుల్ని తప్పు పడుతున్నారు.;

Update: 2026-04-09 03:51 GMT

అప్పటివరకు మద్దతు ఇస్తున్న వారు సైతం.. ఇప్పుడు తల పట్టుకున్నట్లుగా ఉంది పరిస్థితి. ఇజ్రాయెల్ తీరును బలంగా సమర్థించేవారు సైతం ఇప్పుడు లెబనాన్ పై ఆ దేశం చేస్తున్న దాడుల్ని తప్పు పడుతున్నారు. దీనికి కారణం హోర్మూజ్ జలసంధి ప్రపంచంలోని పలు దేశాలకు ప్రాణవాయువుగా మారటమే. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం అంతకంతకూ తీవ్రత పెరగటమే కాదు.. హోర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటంతో.. భారీ ఎత్తున వాణిజ్య నౌకలు.. ముడి చమురు.. గ్యాస్ నౌకలన్ని నిలిచిపోవటంతో.. పలు దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇరాన్ - అమెరికాకు మధ్య కాల్పుల విరమణ జరిగితే.. ఇజ్రాయెల్ ఆటోమేటిక్ గా దాన్ని ఫాలో అవుతుందన్న అంచనాలకు భిన్నంగా.. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ మిత్రదేశం.. లెబనాన్ పై దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున జరిగిన దాడుల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం నుంచి దూరం జరిగిన ఇరాన్.. వెంటనే హోర్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. షెడ్యూల్ ప్రకారం పాకస్థాన్ లోని ఇస్లామాబాద్ లో ఇరాన్ - అమెరికా ప్రతినిధుల మధ్య కాల్పుల విరమణకు చర్చలు జరగనున్నాయి.

లెబనాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో తాము హోర్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్లుగా ఇరాన్ ప్రకటించింది. దీంతో.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. ఇదంతా చూసినప్పుడు.. ఆ ఇజ్రాయెల్ ను ఎవరైనా కాస్త ఆపండ్రా అన్నట్లుగా మారింది. తన ఎజెండాలో భాగంగా ముందుకెళుతున్న ఇజ్రాయెల్ తీరుతో ప్రపంచ దేశాలు సతమతమవుతున్న పరిస్థితి.

కాల్పుల ఒప్పందం మీద ఇజ్రాయెల్ మొదట్నించి అసంత్రప్తిగా ఉందన్న మాట వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే.. ఇరాన్ తో కాల్పుల ఒప్పందం జరిగినా.. ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ పై భారీ ఎత్తున దాడులు నిర్వహించిన తీరు చూస్తే.. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని మరింత సున్నితంగా మార్చేలా ఇజ్రాయెల్ వ్యవహరించిందన్న భావన కలుగక మానదు. లెబనాన్ పై జరిగిన దాడులకు నిరసనగా హోర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా స్పందన ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News