గడ్డి కత్తిరిస్తే రూ.10 లక్షలు..జాబ్ వివరాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తే ఇంక కోట్లు సంపాదించవచ్చని చాలామంది అనుకుంటారు.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తే ఇంక కోట్లు సంపాదించవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ అక్కడ గడ్డి కత్తిరించే వాళ్లు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారట! వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అమెరికాలో కేవలం లాన్ క్లీనింగ్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు ఎలా ఆర్జిస్తున్నారో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఆసక్తికరమైన నిజం ఇప్పుడు తెలుసుకుందాం.
టెకీల కంటే ఎక్కువ సంపాదన:
సాధారణంగా అమెరికా వెళ్లిన వాళ్లంతా పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల గురించే మాట్లాడుతుంటారు. కానీ తాజాగా ఓ ఎన్‌ఆర్ఐ మహిళ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతూ హల్‌చల్ సృష్టిస్తోంది. ఇక అమెరికాలో ఇళ్ల ముందు ఉండే గడ్డిని కత్తిరించే పని చేసేవారు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే కూడా ఎక్కువ రేంజ్‌లో సంపాదిస్తున్నారని ఆమె ఆ వీడియోలో వివరించారు.
గంటకు వంద డాలర్లు: లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే:
అక్కడ వేసవి కాలంలో ఇళ్ల ముందు గడ్డి విపరీతంగా పెరుగుతుంది. ఆ సమయంలో సొంతంగా గడ్డి కత్తిరించే బిజినెస్ చేసేవాళ్లు గంటకు ఏకంగా 100 డాలర్ల వరకు చార్జ్ చేస్తారట. ఈ లెక్కన చూసుకుంటే వాళ్లు నెలకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు చాలా ఈజీగా సంపాదిస్తారని ఆ మహిళ లెక్కలతో సహా చెప్పింది.
ఇతరుల దగ్గర పనిచేసినా భారీగా ఆదాయం:
ఒకవేళ మనకు సొంతంగా లాన్ క్లీనింగ్ బిజినెస్ లేకపోయినా, వేరే వాళ్ల దగ్గర కేవలం కార్మికుడిగా చేరి ఈ పని చేసినా కూడా తక్కువ ఆదాయం ఏమీ రాదు. ఇతరుల వద్ద హెల్పర్‌గా పనిచేసినా సరే నెలకు దాదాపు రూ. 4 లక్షల వరకు జీతం అందుకోవచ్చట. అందుకే అక్కడ ఈ పనికి అంత డిమాండ్ ఉంది.
చలికాలంలో 'స్నో క్లీనింగ్' మ్యాజిక్:
మరి వేసవి కాలం అయిపోయాక వీళ్ల పరిస్థితి ఏంటి? అనే డౌట్ మీకు రావచ్చు. చలికాలం రాగానే అమెరికాలో విపరీతంగా మంచు కురుస్తుంది. ఇళ్ల ముందు, రోడ్లపై మంచు పేరుకుపోతుంది. ఆ టైమ్‌లో వీరంతా 'స్నో క్లీనింగ్' వైపు షిఫ్ట్ అవుతారు. అలా ఏడాది అంత వీళ్లకు బాగ డిమాండ్, భారీ ఆదాయం ఉంటుంది.
ఈ విషయాన్ని బట్టి చూస్తే ఏ దేశంలోనైనా డిమాండ్‌ను బట్టే సంపాదన ఉంటుందని అర్థమవుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకే కాదు, అక్కడ శారీరక శ్రమతో కూడిన పనులకు కూడా విపరీతమైన గౌరవం, భారీగా డబ్బులు ఇస్తారు. అందుకే ఏ పని తక్కువ కాదు, కష్టపడే గుణం ఉండాలే కానీ అమెరికాలో గడ్డి కత్తిరించినా సరే లక్షాధికారి అయిపోవచ్చు అని ఈ వైరల్ వీడియో నిరూపించింది.