గూగుల్ డేటా సెంటర్లలో ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ !

ఈ విధంగా ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

Update: 2026-10-19 03:34 GMT

గూగుల్ డేటా సెంటర్ విశాఖ ఏర్పాటు అయితే అధిక నీరు వినియోగం అవుతుందని దాని వల్ల విశాఖలో నీటి కొరత ఏర్పడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అంతే కాదు విశాఖలో భవిష్యత్తు తరాలు తాగు నీటికి నానా ఇబ్బందులు పడతారని కూడా చెబుతున్నారు. దీంతో గూగుల్ డేటా సెంటర్ల మీద జనంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొంత వరకూ ఇవన్నీ నిజమే అయినా డేటా సెంటర్లు అధునాతన సాంకేతిక సంపత్తిని సొంతం చేసుకుంటే కచ్చితంగా ఈ సమస్యలను అధిగమిస్తాయని కూడా టెక్నాలజీ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇపుడు చూస్తే గూగుల్ డేటా సెంటర్లు దానినే ముందుకు తీసుకుని వస్తున్నాయి.

ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో :

ఇక విశాఖలో ఏర్పాటు చేస్తున్న అదానీ గూగుల్ డేటా సెంటర్లు ఈ రకమైన విమర్శలకు చెక్ పెడుతూ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాయి. డేటా సెంటర్లకు భారీగా ఖర్చు అయ్యే నీటి వినియోగాన్ని తగ్గించేందుకు ఎయిర్ కూలింగ్ టెక్నాలజీని తీసుకుని వస్తున్నాయి. దీని వల్ల నీటి అవసరాలు దాదాపుగా తగ్గిపోతాయని చెబుతున్నారు. విశాఖలో తర్లువాడ అలాగే ముడసర్లోవలలో ఏర్పాటు చేయనున్న తమ క్యాంపస్ లలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తామని అదానీ గూగుల్ సంస్థ ప్రకటించింది.

దీని వల్ల లాభమేంటి :

ఈ విధంగా ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మొత్తం డేటా సెంటర్ ప్రాజెక్టులు అన్నింటికీ కలిపి వినియోగించే మంచి నీరు ఒక ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ పరిమాణం కంటే తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విధంగా సేకరించిన నీటిలో కూడా 80 శాతం పైగా నీటిని ఉద్యోగుల సదుపాయాలతో పాటు వంట గందులలో వినియోగం, పచ్చదనం కోసం కేటాయిస్తారు అని అంటున్నారు. పైగా ఈ డేటా సెంటర్లు తీసుకునే నీరు కూడా ప్రజల అవసరాలు గృహ వినియోగం కోసం ఉపయోగించే మంచి నీరు కాకుండా పరిశ్రమలకు అందించే వాటర్ కనెక్షన్ నుంచి సేకరిస్తామని సంథ ప్రకటించింది. ఇక జీరో డిశ్చార్జి విధానం ద్వారా ప్రాజెక్టుల నుంచి వచ్చే వ్యర్ధ జలాలు మురికినీరుని కూడా ఆన్ సెట్ విధానం ద్వారా శుభ్రం చేసి వాటిని ఇరిగేషన్ ఫ్లషింగ్ వంటి వాటికి వాడుతామని పేర్కోంది.

కేరాఫ్ గూగుల్ గా :

విశాఖలో కొద్ది నెలల క్రితం అదానీ గూగుల్ డేటా సెంటర్లు ప్రారంభం అయ్యాయి. అదానీ గూగుల్‌తో కలిసి దాదాపు 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది తొలి దశ ప్రాజెక్టు 2028 నాటికి స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ నేపథ్యంలో గూగుల్ డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని పర్యావరణ నిపుణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ప్రజా సంఘాలు మేధావులు కూడా విశాఖలో డేటా సెంటర్ల వల్ల ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. దీంతో వీటిని దృష్టిలో ఉంచుకుని అదానీ గూగుల్ డేటా సెంటర్లు ఎయిర్ కూలింగ్ టెక్నాలజీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక చూస్తే . ఈ ప్రాజెక్టులతో పాటు విశాఖకు వచ్చిన రిలయన్స్ ఎయిర్‌టెల్ వంటి సంస్థల కార్యకలాపాలతో విశాఖపట్నం త్వరలో దేశంలోనే ఒక ముఖ్యమైన డేటా సెంటర్ గా అలాగే , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు. అత్యాధునికత సాంకేతికతను జోడిస్తే విశాఖలో ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News