ట్రెడిషనల్ పాలిటిక్స్ టెన్షన్... ఉద్యమ సిలబస్ మారుతోంది !
ఏ ఉద్యమం కైనా హద్దు ఉంటుంది. ఎందువల్ల అంటే వారు పెట్టుకున్న నియమాలు నియంత్రణలు కావచ్చు.
ఉద్యమాలు అంటే దేశంలో బ్రిటిష్ కాలం నుంచి అంతా చూస్తూ వస్తున్నారు. గాంధీజీ సత్యాగ్రహం నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి. టంగుటూరి తెల్లవాడి తుపాకీ గుండుకు తన గుండెని చూపించిన ధైర్యాన్ని కూడా చూశారు. ఏకంగా పార్లమెంట్ లో బాంబులు వేసిన భగత్ సింగ్ సత్తాని చూశారు. ఇక స్వాతంత్ర్యం వచ్చాక అనేక పోరాటాలు ఒక విధంగానే సాగాయి. పాలకుల దుర్నీతిని ఎదిరించడం కోసం వీధి పోరాటాలు చేస్తూ రావడం ఒక ట్రెండ్. ఇక్కడ తమ డిమాండ్లను జనాలకు తెలియచెప్పడమే అజెండాగా ఉంటూ వచ్చింది. మరి కొన్ని సందర్భాలలో సహనంతో శాంతియుతంగా దీఎర్ఘకాలం ఉద్యమించి ఎన్నో కొన్ని డిమాండ్లు నెగ్గించుకున్న ప్రజాస్వామిక పంధాను అంతా చూశారు. అయితే ఇపుడు ఉద్యమ పంధా మారుతోంది. సోషల్ మీడియా యుగంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన శకంలో ఉద్యమం అంటే మైండ్ గేం గా కూడా పరిణామ క్రమం తీసుకుంటోంది.
జెన్ జీ తరంతో సవాల్ :
జెన్ జీ తరం ఉద్యమాలు వేరేగా ఉంటున్నాయి. వారి ఆవేశం ఉప్పెనగా మారుతోంది. వారు డిమాండ్ పెడితే నెరవేరాల్సిందే అన్నది కూడా ఉంటోంది. వారు వేడి నెత్తురు కొత్త సత్తువతో సాగించే పోరాటాలు సరి కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సోషల్ మీడియా భాష వారి ఊపిరిగా ఉంటోంది. అత్యాధునిక కమ్యూనికేషన్ వారికి ఆయుధంగా మారుతోంది. దాంతో సునామీగా మారే ఆ ఉద్యమాన్ని కానీ వారి భాషను కానీ అర్ధం చేసుకోవడం ట్రెడిషనల్ పాలిటిక్స్ కి కష్టసాధ్యం అవుతోంది. ఈ రోజున మారుతున్న ఉద్యమ సిలబస్ ని కూడా తెలుసుకోవడం ఇంకా ఇబ్బందికరంగా మారుతోంది.
నియంత్రించడం సాధ్యమా :
కట్టలు తెంచుకున్న కడలిని సునామీ అంటారు. అది దాటి వస్తే ఎవరూ ఆపేది ఉండదు, అలాంటిది జెన్ జీ తరం ఉవ్వెత్తి వస్తే కట్టుబాటు చేయడం కూడా పెను సవాల్ గా మారుతోంది. కాదు అంటే అవును అని దూసుకెళ్ళడం కొత్త ఉద్యమ పరిభాషగా ఉన్న వేళ నియమాలు నిబంధనలు నియంత్రణలు బారికేడ్లుగా మారి కంట్రోల్ చేస్తాయా అంటే ఆలోచించాల్సిందే. చర్చకు అయినా రచ్చకు అయినా రెడీ అంటున్న నవీన తరం ఉద్యమ పంధాగా తీసుకుని వీధుల్లోకి వస్తే వారిని సముదాయించడం ఎలా అంటే అది నిజంగా కొత్త సిలబస్ పాఠంగామే చూడాలి. ఆ టెక్నిక్కులు ట్రిక్కులు అన్నీ కూడా అర్ధం చేసుకోవాలంటే కొత్తగా పాఠాలు చదవాల్సిందే.
కదం తొక్కితూ పోతే :
ఏ ఉద్యమం కైనా హద్దు ఉంటుంది. ఎందువల్ల అంటే వారు పెట్టుకున్న నియమాలు నియంత్రణలు కావచ్చు. లేదా సమస్యలకు పరిష్కారానికి బహు విధ మార్గాలను ఎంచుకోవడం కావచ్చు. అయితే డూ ఆర్ డై అన్నట్లుగా దూకుడు చేసే ఉద్యమాలకు ఇలాంటివి వర్తించవు. తెగించి బరిని తెంచుకుని ముందుకు దూకే ఉద్యమాలను అదుపు చేయడం అంటే రొటీన్ గా ఆలోచించేవారికి మాత్రం పజిల్ లాంటి ప్రశ్నగానే ఉంటుంది. ఉద్యమాలను అన్నీ ఒకేలా చూడడం ఒకే గాటకు కట్టడం అన్న హ్రస్వ దృష్టిని వీడి టెక్నాలజీతో కూడిన మెధడాలజీతో మెదడుకు పదును పెట్టినపుడే వీటికి పరిష్కారాలు దొరుకుతాయి.
సూపర్ ఎల్ నినో మాదిరి :
లేకపోతే చిన్న సమస్యలు పెద్దవిగా మారిపోతూంటాయి. ఒక్కోసారి అదుపు తప్పుతూంటాయి. ఈ రోజున కొన్ని రకాలైన ఉద్యమాలను చూసినపుడు మారుతున్న నవీన తరం ఆశలు, అసంతృపులు, ఆలోచనలు అందులో మిళితం అయి ఆ కెమెస్ట్రీ కాస్తా సూపర్ ఎల్ నినో మాదిరి అధిక ఉష్ణోగ్రతలను రాజేసినపుడు దానికి చెక్ పెట్టాలంటే ఓల్డ్ సిస్టం అన్నది ఏ విధంగానూ అప్లై కాదని తేలుతోంది. మరి దానికి పరిష్కారం ఏమిటి అంటే మారుతున్న ఉద్యమ భాషను తెలుసుకోవాలి. ఆ మీదట దానికి పరిష్కారాలు కూడా ఏ విధంగా సబబు అన్నది రాచ మార్గంలోనే ఆలోచించాలి. లేకపోతే మాత్రం వీధి పోరాటాలే పెను సవాల్ గా మారిపోతాయి.