ట్రంప్ కు మెలానియాను ఎవరు పరిచయం చేశారు.. తెరపైకి షాకింగ్ సమాధానం!

అమెరికాలో హైప్రొఫైల్‌ సె*క్స్‌ కుంభకోణం ఎప్ స్టీన్ ఫైల్స్ లో రోజులు గడిచేకొద్దీ రకరకాల సంచలన విషయాలు తెర పైకి వస్తున్నాయి.;

Update: 2025-07-28 08:00 GMT

అమెరికాలో హైప్రొఫైల్‌ సె*క్స్‌ కుంభకోణం ఎప్ స్టీన్ ఫైల్స్ లో రోజులు గడిచేకొద్దీ రకరకాల సంచలన విషయాలు తెర పైకి వస్తున్నాయి. ప్రధానంగా... ఈ కుంభకోణం సూత్రధారి ఎప్‌ స్టీన్‌ తో డొనాల్డ్‌ ట్రంప్‌ కున్న పరిచయాలు, తిరిగిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో మెలానియా - ట్రంప్ పరిచయంపై ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇప్పుడిది సంచలనంగా మారింది.

అవును... ఎప్ స్టీన్ సెక్స్‌ కుంభకోణంలో వరుస సంచలన విషయాలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా.. మోడల్‌ గా ఉన్న మెలానియాను డొనాల్డ్‌ ట్రంప్‌ కు ఎప్ స్టీన్ పరిచయం చేశాడని.. వారి పరిచయంలో ఎప్ స్టీన్ ది కీలక పాత్ర అని.. ట్రంప్‌ జీవిత విశేషాలను రాస్తున్న మైఖెల్‌ వోల్ఫ్‌ ఓ సంచలన ప్రకటన చేశారు.

ది డైలీ బెస్ట్‌ అనే పాడ్‌ కాస్ట్‌ లో మాట్లాడిన వోల్ఫ్... 1998లో ట్రంప్‌ కు తొలిసారిగా పరిచయం అయ్యే నాటికి ఎప్‌ స్టీన్‌ సోషల్‌ సర్కిల్‌ లో మెలానియా చాలా నిమగ్నమై ఉందని వెల్లడించారు. ఆమె అమెరికాకు రావడానికి సహాయం చేసింది ఐడీ మోడల్స్‌ వ్యవస్థాపకుడు పౌలో జాంపొల్లి అని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమెకు ట్రంప్‌ తో ఆమెకు పరిచయం ఏర్పడిందని తెలిపారు.

ఈ సందర్భంగా... ఆమెను ఒక మోడల్ ఏజెంట్ పరిచయం చేశారని.. ఆమెతో ట్రంప్, ఎప్ స్టీన్ ఇద్దరూ సంబంధం కలిగి ఉన్నారని.. ఎప్ స్టీన్ ఆమెకు బాగా తెలుసని వోల్ఫ్ అన్నారు. అప్పట్లో అస్థిరంగా ఉండే మోడల్స్‌ కల్చర్‌ గా దానిని వోల్ఫ్‌ అభివర్ణించారు.

ఖండించిన మెలానియా!:

మరోవైపు ఈ విషయాలపై మెలానియా స్పందించారు.. ఈ సందర్భంగా వోల్ఫ్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు! ఈ సందర్భంగా... తాను డొనాల్డ్ ట్రంప్ కు ఎప్‌ స్టీన్‌ ద్వారా పరిచయం అయినట్లు వస్తున్న ప్రచారాన్ని తిరస్కరించారు. తాను – ట్రంప్ మొదట న్యూయార్క్‌ లోని కిట్‌ కాట్‌ క్లబ్‌ లో కలుసుకొన్నట్లు తెలిపారు.

ఆ రోజు తాను అక్కడికి ఓ ఫ్రెండ్‌ తో వెళ్లినట్లు పేర్కొన్నారు. తాను రాసిన ఓ పుస్తకంలో ట్రంప్‌ తో తొలి డేట్‌ ఆహ్లాదకరంగా సాగినట్లు వెల్లడించారు. కాగా... ట్రంప్ - మెలానియాను తానే కలిపినట్లు ఎప్‌ స్టీన్‌ ఓ దశలో పేర్కొన్న సంగతి తెలిసిందే! ఇదే సమయంలో.. ట్రంప్‌ పేరు ఎప్‌ స్టీన్‌ ఫైల్స్‌ లో ఉందని వాల్‌ స్ట్రీట్‌ పత్రిక తన కథనంలో పేర్కొంది.

Tags:    

Similar News