అన్ని క్షిపణులకు బాప్... స్టార్ మిసైల్! ప్రపంచానికి షాకిచ్చిన భారత్!
DRDO రూపొందిస్తున్న ఈ స్టార్ క్షిపణి ధ్వని వేగం కంటే కనీసం మాక్ 7 లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి.;
భారత రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ (DRDO) మరోసారి ప్రపంచ రక్షణ వర్గాల దృష్టిని ఆకర్షించింది. అత్యాధునిక సాంకేతికత, హైపర్సోనిక్ వేగం, కృత్రిమ మేధస్సు (AI) కలయికతో రూపొందిస్తున్న "స్టార్ మిసైల్" (STAR – Supersonic Tactical Advanced Response) ప్రాజెక్ట్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది భారతీయ రక్షణ సామర్థ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లబోతోందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
* మాక్ 7 వేగంతో దూసుకెళ్లే అస్త్రం
DRDO రూపొందిస్తున్న ఈ స్టార్ క్షిపణి ధ్వని వేగం కంటే కనీసం మాక్ 7 లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ అసాధారణ వేగం కారణంగా శత్రువుల క్షిపణి రక్షణ వ్యవస్థలు దీనిని గుర్తించడం, అడ్డుకోవడం అనేది దాదాపు అసాధ్యం. ఈ క్షిపణి పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతోంది. దీనిలో స్క్రామ్‌జెట్ , రామ్‌జెట్ ఇంజిన్‌ల కలయికను ఉపయోగిస్తున్నారు, ఇది సుదీర్ఘకాలం పాటు అత్యధిక వేగాన్ని నిలుపుకోవడానికి దోహదపడుతుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ క్షిపణి 2,000 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. ఇది వ్యూహాత్మకంగా భారత్‌కు అపారమైన శక్తిని అందిస్తుంది.
* కృత్రిమ మేధస్సుతో ఆలోచించే ఆయుధం
ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత విప్లవాత్మకమైన అంశం దాని AI-ఆధారిత గైడెన్స్ సిస్టమ్. ఈ అత్యాధునిక సాంకేతికతతో స్టార్ మిసైల్ గగనతలంలో ఎదురయ్యే ప్రతీ పరిస్థితిని, శత్రువుల కదలికలను స్వయంగా విశ్లేషించి, దానికి అనుగుణంగా తన మార్గంలో మార్పులు చేసుకోగలదు. ఒక సీనియర్ DRDO శాస్త్రవేత్త దీని గురించి మాట్లాడుతూ "ఇది సాధారణ క్షిపణి కాదు. ఇది ఆలోచించే ఆయుధం. STAR క్షిపణి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని, శత్రు రక్షణ వ్యవస్థలను మోసం చేసి, ఎదురుదాడులను తప్పించుకుంటూ తన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంటుంది," అని తెలిపారు.
* ప్రపంచ రక్షణ వర్గాల్లో సంచలనం
స్టార్ మిసైల్ ప్రాజెక్ట్ గురించి సమాచారం బయటకు వచ్చిన వెంటనే ప్రపంచ దేశాల్లోని రక్షణ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా వంటి సాంకేతికంగా ముందున్న దేశాల నిపుణులు భారత్ సాధిస్తున్న వేగవంతమైన పురోగతిని, హైపర్సోనిక్ - AI-ఆధారిత క్షిపణుల రంగంలో లీడర్‌గా అవతరించే అవకాశాలను గురించి చర్చించుకుంటున్నారు. అంతర్జాతీయ రక్షణ విశ్లేషకుడు మైఖేల్ ఆండర్స్ మాట్లాడుతూ "భారత్ ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే, అది ప్రపంచ క్షిపణి సాంకేతికత చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది," అని అభిప్రాయపడ్డారు.
* ‘ఆపరేషన్ వజ్ర’ కింద వేగవంతమైన పరిశోధన
ఈ కీలకమైన ప్రాజెక్ట్ “ఆపరేషన్ వజ్ర” పేరిట DRDO లోని ముఖ్య పరిశోధనా కేంద్రాలలో హైదరాబాద్, బెంగళూరు, చందీపూర్ లో పగలు రాత్రి తేడా లేకుండా చకచకా కొనసాగుతోంది. రక్షణ వర్గాల అంచనా ప్రకారం, 2026 నాటికి మొదటి ప్రోటోటైప్ పరీక్షలు జరిపే అవకాశం ఉంది, ఆ తరువాత 2028 నాటికి పూర్తి స్థాయి ప్రయోగం సిద్ధం కావచ్చు. DRDO శాస్త్రవేత్తల నిరంతర కృషి, దేశ రక్షణ వ్యవస్థను తిరుగులేని విధంగా బలోపేతం చేసే దిశగా ఒక పటిష్టమైన అడుగు. "స్టార్ మిసైల్" కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, భారత టెక్నాలజీ స్వావలంబన, ప్రపంచ వేదికపై పెరుగుతున్న మన శక్తికి ప్రతీక.