చైనాతో డీల్.. మళ్లీ ఫైటింగ్.. ఈ ట్రంప్ ఇక మారడంతే?

ఇక ఈ వ్యాఖ్యలు వస్తున్న సమయమే అమెరికా–చైనా మధ్య సంబంధాలు మళ్లీ సున్నిత దశలోకి వెళ్తున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.;

Update: 2025-11-03 13:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన మాటలతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇటీవల చైనాతో వాణిజ్య ఒప్పందానికి సంకేతాలు ఇచ్చిన ట్రంప్‌.. ఇప్పుడు మళ్లీ కఠిన హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

*డీల్ నుండి వార్నింగ్‌కు.. పాలిటిక్స్‌లో కొత్త మలుపు!

ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ట్రంప్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తో సుమారు రెండు గంటలపాటు గోప్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో వాణిజ్య టారిఫ్‌లు, అరుదైన ఖనిజాల సరఫరా, అలాగే తైవాన్‌ పరిస్థితిపై చర్చలు జరిగినట్టు సమాచారం.

టారిఫ్‌ల తగ్గింపుతో సానుకూల సంకేతాలు

ఆ తర్వాత ట్రంప్‌ చైనా మీద టారిఫ్‌లను 10 శాతం మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించడం, రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదరనుందనే సంకేతాలు ఇవ్వడం, ప్రపంచ మార్కెట్లలో సానుకూల ప్రభావం చూపించింది.

*అకస్మాత్తుగా ఎందుకు హెచ్చరికలు?

కానీ ఇప్పుడు అదే ట్రంప్‌ మళ్లీ చైనాకు వార్నింగ్‌ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. "తైవాన్‌పై చైనా మిలిటరీ చర్య తీసుకుంటే ఏమవుతుంది అనేది వారికే తెలుసు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం వారు జాగ్రత్తగా ఉంటారు" అని వ్యాఖ్యానించారు. "నేను ఎలాంటి రహస్యాలు బయటపెట్టను, కానీ జరిగే పరిణామాలు చైనాకు ఖచ్చితంగా తెలుసు," అని మరోమారు హెచ్చరించారు.

* జియో పాలిటిక్స్ లో ట్రంప్ వ్యూహం

ఇక ఈ వ్యాఖ్యలు వస్తున్న సమయమే అమెరికా–చైనా మధ్య సంబంధాలు మళ్లీ సున్నిత దశలోకి వెళ్తున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం, సాంకేతిక ఆంక్షలు, తైవాన్‌ సమస్య వంటి అంశాలు ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. చైనాతో మృదువుగా వ్యవహరించిన ట్రంప్‌ ఇప్పుడు అకస్మాత్తుగా గట్టిగా మాట్లాడటానికి కారణమేమిటన్నదే ఇప్పుడు విశ్లేషకుల చర్చ.

కొందరి అభిప్రాయం ప్రకారం.. అమెరికా లో షట్ డౌన్ నడుస్తుండడంతో ట్రంప్‌ మళ్లీ "అమెరికా ఫస్ట్‌" నినాదాన్ని బలంగా వినిపిస్తూ దేశభక్తి భావనను పెంచే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. మరికొందరు, ఇది కేవలం చర్చలలో తమ బలాన్ని పెంచుకోవడానికి చేసే వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు.

* ట్రంప్ స్టైల్ మారదు!

మొత్తం మీద చైనాతో డీల్‌ ఒకవైపు.. మళ్లీ వార్నింగ్‌లు మరోవైపు ట్రంప్‌ పాలిటిక్స్‌ ఎప్పటిలాగే అంచనా వేయలేనిది. ఆయన చర్యలు, వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ వేదికపై అమెరికా–చైనా సంబంధాలపై కొత్త ఊపిరి రేపుతున్నాయి.

కీలకంగా చెప్పాలంటే ట్రంప్‌ శైలీ మారదు.. నిన్న డీల్‌, ఈ రోజు ఫైట్‌. చైనాతో ఆయన రాజకీయ గేమ్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News