ట్రంప్‌కు గట్టి షాక్.. ఊహించని రీతిలో ట్రోలింగ్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంటారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంటారు. ఆయన నిర్ణయాలు, ప్రసంగాలు, పర్యటనలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తీవ్ర సంచలనంగా మారింది. ఒక ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై అమెరికా అధ్యక్షుడికి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురైంది. స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు ఆయనను చూసి పెద్ద ఎత్తున నిరసన గళం విప్పడం ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
న్యూయార్కులోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బాస్కెట్‌బాల్ టోర్నమెంటును వీక్షించడానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెళ్లారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై ట్రంప్ హాజరైన వీడియోను ప్రదర్శించారు. సాధారణంగా దేశ అధ్యక్షుడు స్క్రీన్‌పై కనిపిస్తే ప్రేక్షకులు గౌరవంతో చప్పట్లతో స్వాగతం పలుకుతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ట్రంప్ స్క్రీన్‌పై కనిపించడమే ఆలస్యం అన్నట్లు ప్రేక్షకులు ఒక్కసారిగా ‘బూస్’అంటూ గట్టిగా అరిచారు. అధ్యక్షుడికి వ్యతిరేకంగా వేల మంది ప్రేక్షకులు ఇలా వ్యవహరించడంతో ట్రంప్ కు తీరని అవమానమే అంటున్నారు.
ట్రంప్ అక్కడ ఉన్నంతసేపు కొందరు మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేసినప్పటికీ, మెజారిటీ ప్రేక్షకుల నుంచి వచ్చిన భారీ వ్యతిరేక శబ్దాల హోరులో అవి కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. ట్రంప్ వ్యతిరేక వర్గాలు ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ క్రీడా మైదానాల్లో ప్రజలు తమ అసంతృప్తిని ఇలాగే చూపిస్తారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ట్రంప్ మద్దతుదారులు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా వేదికలపై రాజకీయాలు తీసుకురావడం తగదని, అక్కడ కేవలం కొందరు కావాలనే గందరగోళం సృష్టించారని, ట్రంప్ క్రేజ్‌ను తగ్గించడానికి ఇదంతా చేస్తున్నారని వారు వాదిస్తున్నారు.
వైరల్ కంటెంట్‌గా ట్రంప్..
ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అది క్షణాల్లో వైరల్ కంటెంట్‌గా మారిపోతోంది. ఆయన పొలిటికల్ ర్యాలీలు, ఇంటర్వ్యూలలో మాట్లాడే ప్రతి మాట సంచలనంగా మారుతున్న తరుణంలో, ఇలాంటి బహిరంగ క్రీడా ఈవెంట్లలో ఆయనకు ఎదురవుతున్న స్పందనలు కూడా ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఈ తాజా 'స్టేడియం ఇన్సిడెంట్' వీడియో కేవలం అమెరికాలోనే కాకుండా గ్లోబల్ ట్రెండ్స్‌లో టాప్‌లో కొనసాగుతోందని చెబుతున్నారు.