పెళ్లి లేట్ అయితే పబ్లిక్ పన్నిష్‌మెంట్!.. ఈ దేశం రూల్స్ షాక్!
ఈ ఆచారం గురించి వింటే మన దేశంలోని బ్యాచిలర్స్ అబ్బా.. మనం ఇండియాలో పుట్టి పుణ్యం చేసుకున్నాం అని మొక్కుకుంటారు..ఆ వివరాలు చూద్దాం..
మన దగ్గర పెళ్లి లేట్ అయితే చుట్టుపక్కల వారు, బంధువులు "ఎప్పుడు పెళ్లి?" అని మాటలతో గుచ్చుతారు. కానీ డెన్మార్క్‌లో మాత్రం మాటలు ఉండవు.. నేరుగా చేతలే! అక్కడ 25 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గా మిగిలిపోతే స్నేహితులు ఊరుకోరు. రోడ్డు మీద స్తంభానికి కట్టేసి మరీ ఒక వింత శిక్ష వేస్తారు. ఈ ఆచారం గురించి వింటే మన దేశంలోని బ్యాచిలర్స్ అబ్బా.. మనం ఇండియాలో పుట్టి పుణ్యం చేసుకున్నాం అని మొక్కుకుంటారు..ఆ వివరాలు చూద్దాం..
25 ఏళ్లు దాటాయా? ఇక దాల్చిన చెక్క పొడి రెడీ:
డెన్మార్క్‌లో ఎవరికైనా 25 ఏళ్లు నిండినప్పుడు వారు ఇంకా సింగిల్‌గా ఉంటే, వారి స్నేహితులంతా కలిసి ఒక గ్యాంగ్‌గా వస్తారు. ఆ వ్యక్తిని వీధిలో ఉన్న ఒక స్తంభానికి కట్టేస్తారు. ఆ తర్వాత ఒళ్లంతా తడిపి, పైన కిలోల కొద్దీ దాల్చిన చెక్క పొడిని చల్లుతారు. ఇక పాపం, ఆ వ్యక్తి ఒళ్లంతా ఆ పొడితో నిండిపోయి ఒక వింత వాసనతో కనిపిస్తాడు. ఇది ఒక రకమైన 'పబ్లిక్ హ్యుమిలియేషన్' అయినా, అక్కడ దీన్ని ఒక సరదా ఆచారంగా పాటిస్తారు.
30 ఏళ్లు వస్తే పరిస్థితి ఇంకా ఘోరం:
ఒకవేళ 25 ఏళ్లకు పెళ్ళికాలేదు, 30 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకపోతే శిక్ష డోస్ పెరుగుతుంది. ఈసారి దాల్చిన చెక్క పొడికి బదులు మరింత ఘాటైన మిరియాల పొడి లేదా కారం పొడిని వాడుతారట. కళ్ళలోకి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నా, ఆ ఘాటుకు బాధితులు విలవిలలాడిపోతారు. "ఇప్పుడైనా పెళ్లి చేసుకో బాబోయ్" అని పరోక్షంగా హెచ్చరించడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
అసలు ఈ ఆచారం ఎందుకు మొదలైంది?:
దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పూర్వం సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవారు వ్యాపారం కోసం దేశదేశాలు తిరుగుతూ పెళ్లికి దూరంగా ఉండేవారట. ఇక అలా వారు బ్యాచిలర్స్‌గా మిగిలిపోవడంతో, వారిని గేలి చేయడానికి ఈ 'స్పైస్ బాత్' పద్ధతి మొదలైంది. కాలక్రమేణా అది ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఇప్పటికీ డెన్మార్క్‌లో యువత తమ స్నేహితులకు ఈ శిక్ష వేసి ఎంజాయ్ చేస్తుంటారు.
మన దేశం నయం కదా:
మన దగ్గరైతే పెళ్లి కాలేదని గరిటెలు పట్టుకుని తరిమే అమ్మలు, సంబంధాలు చూసి విసిగించే నాన్నలు ఉంటారు. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మనం ఇబ్బంది పడతాం కానీ, ఇలా స్తంభాలకు కట్టేసి కారాలు, మసాలాలు చల్లే రకం కాదు. ఇక డెన్మార్క్ బ్యాచిలర్స్ పడుతున్న ఈ తిప్పలు చూస్తుంటే, మనవాళ్లు అడిగే ప్రశ్నలే వేల రెట్లు నయం అనిపిస్తుంది కదూ..
ఏ దేశ ఆచారాలు ఆ దేశానికి ముచ్చటగా ఉండొచ్చు కానీ, డెన్మార్క్ రూల్స్ మాత్రం కొంచెం 'హాట్' గానే ఉన్నాయి. బ్యాచిలర్స్‌ను ఒక ఆట ఆడుకునే ఇలాంటి ఆచారాలు వినడానికి వింతగా ఉన్నా, అక్కడ మాత్రం ఇదొక పండుగలా సాగుతుంది.