అన్ని బిల్లులూ వేరు...వైసీపీ తీరు మారకపోతే ?
కేంద్రంలో ఎన్డీయే కి మద్దతు ఇస్తూ వైసీపీ తనదైన రాజకీయం చేస్తోంది. అది ఆ పార్టీ వ్యూహం కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కి వైసీపీ దూరం కాబట్టి.;
కేంద్రంలో ఎన్డీయే కి మద్దతు ఇస్తూ వైసీపీ తనదైన రాజకీయం చేస్తోంది. అది ఆ పార్టీ వ్యూహం కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కి వైసీపీ దూరం కాబట్టి. పైగా బీజేపీకి వైసీపీకి మధ్య ఉన్న ఒకే ఒక్క భావసారూప్యత కాంగ్రెస్ వ్యతిరేకత. అయితే అన్ని రోజులూ అన్ని కాలాలూ ఒక్కటిగా ఉండవు. అలాగే అన్ని బిల్లుల తీరు వేరు, డీలిమిటేషన్ సంగతి వేరు అని అంతా అంటున్నారు. ప్రస్తుత రూపంలో ఉన్న డీలిమిటేషన్ బిల్లు కనుక ఆమోదం పొందితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని ఇండియా కూటమి పార్టీలు వాదిస్తున్నాయి. కేంద్రంలో దక్షిణాదికి ఏ మాత్రం పలుకుబడి పరపతి లేని రోజులు దాపురిస్తాయని అసలు ఎవరూ పట్టించుకోరని అంటున్నారు, ఒక విధంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయం మీద హెచ్చరిస్తున్నారు.
మొత్తం ఆగ్రహానికి :
దక్షిణాదికి ఇప్పటివరకూ ఉన్న 24 శాతం షేర్ ఎంపీల బలం కేంద్రంలో లేకుండా తయారయ్యే డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ కనుక ఆమోదం తెలిపితే మాత్రం అది ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని అంటున్నారు. కేవలం ఏపీకి మాత్రమే అది పరిమితం కాదని దక్షిణాదిన ఇతర రాష్ట్రాలలో కూడా వైసీపీ పట్ల వ్యతిరేకత పెద్ద ఎత్తున వస్తుందని అంటున్నారు. వైసీపీకి ఉన్న నలుగురు ఎంపీల బలంతో ఈ బిల్లు నేరుగా నెగ్గేయకపోవచ్చు. కానీ ఇపుడున్న నంబర్ గేమ్ లో ఆ నాలుగు సీట్లూ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయని అంటున్నారు.
పార్టీలకు అతీతంగా :
డీలిమిటేషన్ బిల్లు అన్నది సౌత్ స్టేట్స్ కి అత్యంత సున్నితమైన ఇష్యూగా ఉండబోతోంది. రేపటి రాజకీయానికి దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాలుగా ఈ బిల్లు ఈ రూపంలో ఉంటే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. యాభై సాతం సీట్లు అదనం మంచిదే అయినా అదే సమయంలో ఉత్తరాదిన ఇంతకు రెండింతలు సీట్లు పెరిగిపోతాయి. అపుడు సౌత్ స్టేట్స్ సీట్లు ఎన్ని పెరిగినా కూడా కేంద్రంలో అధికార కేంద్రానికి దగ్గరగా కూడా వెళ్లలేని దుస్త్ఘితి దక్షిణాది రాష్ట్రాలకు ఏర్పడుతుందని అంటున్నారు. అందుకే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి అడుగులు వేయాల్సి ఉంటుందని అంటున్నారు.
ఆ పార్టీల విషయం వేరు :
ఇక ఏపీలో చూస్తే టీడీపీ జనసేన రెండూ ఎన్డీయేలో ఉన్నాయి. పొత్తులు పెట్టుకుని పోటీ చేసి గెలిచాయి. దాంతో కూటమి ధర్మం ప్రకారం మద్దతు ఇస్తున్నాయి. ఆ పార్టీలు కూడా కేంద్రం మీద ఈ బిల్లులో దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూడాలని ఒత్తిడి పెట్టాల్సి ఉంది. అయితే చివరికి ఓటేసినా తాము ఎన్డీయేలో భాగం అని సమర్ధించుకునే వీలు ఉంది. కానీ న్యూట్రల్ గా ఉన్న వైసీపీకి మాత్రం అతి పెద్ద చిక్కు ఉందని అంటున్నారు. ఆ పార్టీ కనుక ఈ బిల్లుకు మద్దతు ఇస్తే మాత్రం ఏకంగా సౌత్ స్టేట్స్ కే వ్యతిరేకం అన్న భావన కలిగించేలా ఉంటుందని అంటున్నారు. అందుకే వైసీపీ కూడా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండానే అన్న కండిషన్ పెడుతోంది. కానీ దీని మీద నిలబడి ఉండాలని సూచిస్తున్నారు. లేకపోతే వైసీపీకే పూర్తిగా రాజకీయ ఇరకాటం తప్పదని అంటున్నారు.