సింగిల్‌గా నిలబడాలంటే గట్స్ కావాలి... షాకింగ్ పోస్ట్

గుంపులో ఎవరైనా దూరుతారు. ఏమైనా చేస్తారు, అంతా గుంపులో గోవిందం మాదిరిగా ఉంటుంది. దొరకను అన్న భరోసా ఉంటే పిరికివాడి గొంతుక కూడా బిగ్గరగా వినిపిస్తుంది.

Update: 2026-10-15 16:23 GMT

గుంపులో ఎవరైనా దూరుతారు. ఏమైనా చేస్తారు, అంతా గుంపులో గోవిందం మాదిరిగా ఉంటుంది. దొరకను అన్న భరోసా ఉంటే పిరికివాడి గొంతుక కూడా బిగ్గరగా వినిపిస్తుంది. కానీ ఆదే గుంపుని సింగిల్ గా ఎదురు నిలిచి హ్యాండిల్ చేసేవారికి ఎంత గట్స్ ఉండాలి. అందులో భారీ ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నపుడు ఆవేశ కావేశాలు పీక్స్ లో ఉన్నపుడు అవతల వైపు నుంచి నిప్పుల పిడుగులే రాల్చుతున్నపుడు ఇవతల ఒంటరిగా నిలిచి నియంత్రించడం అంటే ఎంతటి ధైర్యం ఉండాలి. అందులోనూ మహిళా పోలీసులకు అయితే ఇంకా ఎక్కువే ఉండాలి కదా. ఎందుకంటే ఫిజికల్ గా వారిని టార్గెట్ చేసేందుకు మూక శక్తుల నుంచి ముప్పు ఉంటూనే ఉంటుంది.

అందుకే ఈ ట్వీట్ :

ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలో విపక్షాలతో పాటు సీజేపీ ఇతర విద్యార్థి సంఘాల నిరసనలనౌ అదుపు చేయడానికి రంగంలోకి దిగిన మహిళా పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందుకే వారు ఒంటరిగా ఎదురొడ్డి ఎంతటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అన్నది వారి పరిస్థితి చూపే ఫొటోలను ఢిల్లీ పోలీస్ విభాగం తమ ఎక్స్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలకు పెట్టిన క్యాప్షన్ అయితే ఇపుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. ‘గుంపుతో పాటు నిలబడటం సులభమే. కానీ సింగిల్‌గా నిలబడటానికి ధైర్యం కావాలి’ అని ఇచ్చిన క్యాప్షన్ ని చదివిన వారు అవును నిజమే కదా అనుకోకుండా ఉండలేరు. ఈ ఫోటోలలో నిరసనకారులు మహిళా పోలీసులను చుట్టుముట్టడమే కాదు వారి యూనిఫామ్ పట్టుకొని బలంగా లాగడం, మీద పడి చించేయడం వంటి దృశ్యాలు ఆ ఫొటోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిని చూసిన వారు నిరసన ఏ రూపం తీసుకుంటోంది అన్నది అయితే సీరియస్ గానే ఆలోచిస్తారని అంటున్నారు.

మహిళా పోలీసులకు సవాళ్ళు :

భారీ నిరసనల సమయంలో మహిళా పోలీసులకే ఎక్కువ సవాళ్ళు ఎదురవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో చేపట్టిన నిరసనల వల్ల శాంతిభద్రతలను అదుపు చేయడానికి రంగంలోకి దిగిన మహిళా పోలీసులు అనేక సవాళ్లనే కాదు వేరే విధమైన ఇబ్బందులను సైతం ఎదుర్కొంటున్నారు. నిరసనకారులను అదుపు చేయడానికి మహిళా పోలీసులే ముందు వరసలోకి రావాల్సి వస్తోంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడానికి ఢిల్లీ పోలీసులతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి సుమారు 3,500 మంది మహిళా పోలీసులను తాజాగా ఈ నెల 10న పింక్ ఫోర్స్ పేరుతో ఢిల్లీలో మోహరించారు. ఈ నేపధ్యంలో నిరసనకారులు బారికేడ్ల వద్ద నిరసనకారులు నెట్టడంతో పాట్జు తోసేయడం వల్ల మహిళా పోలీసులే తీవ్ర స్థాయిలో శారీరక ఒత్తిడికి గురవుతున్నారని అంటున్నారు.

దురుసు ప్రవర్తనతోనే :

అంతే కాదు నిరసనకారులు దురుసు ప్రవర్తంతో దాడులకు కూడా తెగబడుతున్నారు. ఈ క్రమంలో యూనిఫాంలో ఉన్న మహిళా సిబ్బంది పట్ల ఆందోళనకారులు అసభ్యంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారిపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులను అదుపు చేసే సమయంలో పురుష పోలీసులు మహిళా నిరసనకారులను ముట్టుకోకుండా జాగ్రత్త పడాల్సి వస్తుండటంతో మహిళా పోలీసులపైనే అధికమైన బాధ్యత పడుతోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో వారు తీవ్ర శ్రమతో పాటుగా ఇబ్బందులకు గురవుతున్నారు.

క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు :

అయితే ఈ నిరసనల క్రమంలో మహిళా నిరసనకారులు విద్యార్థినులు,మహిళా జర్నలిస్టులు కూడా తాము పోలీసుల చేతిలో దురుసు ప్రవర్తనను వేధింపులను ఎదుర్కొన్నట్లుగా అవతల వైపు నుంచి సైతం ఇదే స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా వస్తున్న ఫిర్యాదుల మీద నిష్పక్షపాత విచారణ జరపడానికి ఢిల్లీ పోలీస్ ఈ ఫిర్యాదులను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసింది. మొత్తం మీద చూస్తే ఒక వైపు రాజకీయ పార్టీల ఆందోళనలు, మరో వైపు విద్యార్థి ఉద్యమాలు వీటి కారణంగా అటు నిరసనకారులతో పాటు ఇటు తెగించి విధులకు హాజరవుతున్న ఉన్న మహిళా పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నది నిజం..



Tags:    

Similar News