చిరు వ్యాపారులతో నిరసనకారుల డీల్స్!
అయితే.. వీరి నిరసనలు రోజుల తరబడి సాగుతుండటం..పెద్ద ఎత్తున వస్తున్న నిరసనకారుల సమూహాలు వారికి కస్టమర్లుగా మారుతున్న పరిస్థితి.
మోడీ సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చేలా.. ఉక్కిరిబిక్కిరి చేసేలా ఎజెండా సెట్ చేస్తున్న సీజేపీ వారికి మద్దతుగా నిలుస్తున్న వామపక్ష.. ఆప్.. కాంగ్రెస్ పార్టీలతో పాటు మరి కొన్ని పార్టీలు కలిసి దేశ రాజధాని దద్దరిల్లేలా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వ్యాపార కేంద్రాలైన కన్నాట్ ప్లేస్ తో పాటు.. పాలికా బజార్ తదితర ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల్లో అత్యధికం మీడియాలో రిపోర్టు కావటం లేదన్న మాట వినిపిస్తోంది. తాజాగా సీజేపీ చేపట్టిన నిరసనకు వ్యతిరేకంగా కన్నాట్ ప్లేస్ వ్యాపారులు ఊహించని విధంగా నిరసన తెలపటమే కాదు.. సీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటం తెలిసిందే.
ఓవైపు సీజేపీ తీరును నిరసిస్తూ పలువురు వ్యాపారులు వారి తీరును వ్యతిరేకిస్తుంటే.. మరికొన్ని వ్యాపార సంస్థలు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తూ.. నిరసనల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నట్లుగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మీడియాలో కవర్ కాని కొన్ని ఆసక్తికర అంశాలు ఉండటం గమనార్హం. నిరసనకారులు - చిన్న వ్యాపారుల మధ్య పెరిగిన బంధం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవైపు మధ్యస్థాయి..పెద్ద వ్యాపారులు సీజేపీ తీరుతో ఆగ్రహంగా ఉంటే.. చిన్న వ్యాపారులు.. ముఖ్యంగా కేఫ్ లు.. సమోసా, కచోరీ దుకాణాల యజమానులు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
సీజేపీ తాజాగా చేస్తున్న నిరసనలు.. ఆందోళనలు మొత్తానికి కేంద్ర బిందువుగా కన్నాట్ ప్లేస్ తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న జంతర్ మంతర్, సెంట్రల్ పార్క్.. పార్లమెంట్ స్ట్రీట్ లాంటి ప్రాంతాలే. నిరసనకారులు భారీగా కన్నాట్ ప్లేస్ చుట్టూ ఉండటంతో అక్కడి వ్యాపారుల వ్యాపారాల మీద తీవ్రంగా ప్రభావితం అవుతోంది. కన్నాట్ ప్లేస్, జన్ పథ్ పరిసరాల్లోని కొన్ని చిన్నతరహా రెస్టారెంట్లు.. వీధి వ్యాపారులు ఆరంభంలో నిరసనల్ని.. ఆందోళనల్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
అయితే.. వీరి నిరసనలు రోజుల తరబడి సాగుతుండటం..పెద్ద ఎత్తున వస్తున్న నిరసనకారుల సమూహాలు వారికి కస్టమర్లుగా మారుతున్న పరిస్థితి. తాము వ్యతిరేకంగా ఉన్న వారి కారణంగా తమ వ్యాపారం మరింత పెరుగుతుండటంతో వారి పట్ల చిన్న వ్యాపారులు సానుకూలంగామారిన పరిస్థితి. దీనికి తోడు నిరసనకారులు స్థానికంగా ఉండే చిన్న వ్యాపారులతో మాట్లాడి.. తమకు అవసరమైన టిఫెన్లు.. టీలు నిరంతరం సరఫరా చేసేలా మాట్లాడుకున్న వైనం ఆసక్తికరంగా మారింది.
దీంతో నిరసనల కారణంగా పెద్ద వ్యాపారుల వ్యాపారాలు దెబ్బ తింటే.. చిన్న.. వీధి వ్యాపారుల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా మారింది. అదే సమయంలో నిరసనకారులతో వీధి వ్యాపారులు అప్రకటిత ఒప్పందాల్ని చేసుకున్న వైనం వెలుగు చూసింది. దీని ప్రకారం వారంలోని ఐదు రోజులు నిరసనకారులు తమ నిరసనలు చేసుకోవచ్చు. కానీ.. తమ ఉపాధికి ఆధారంగా నిలిచే శని.. ఆదివారాలలో మాత్రం ఆందోళనలు చేయకూడదన్న మాటకు సీజేపీ అండ్ కో సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. ఆరెండు రోజులు ప్రశాంతమైన నిరసనలు మాత్రమే చేపడతామన్న ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించిన సమయంలో ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్థుల (వామపక్ష, ఆప్, కాంగ్రెస్, సీజేపీకి చెందిన మద్దతుదారులు) ల్యాప్ టాప్ లు.. ఫోన్లలో డిజిటల్ పోస్టులు పెట్టుకోవటానికి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్నికేఫ్ యజమానులు వారికి ఉచిత వైఫై ను అందించారు. అందుకు ప్రతిగా నిరసనకారులు ఆయా కేఫ్ లకే పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వటం.. గంటల తరబడి ఆయా ప్రాంతాల్లో ఉండటంతో వారి వ్యాపారాలు జోరుగా సాగినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ అంశాలకు సంబంధించి వార్తలు ప్రధాన మీడియా కవరేజ్ లో కనిపించకపోవటం గమనార్హం.