ఢిల్లీలో వీకెండ్ ... శాటర్ డే కాదు హీట్ డే !
జంతర్ మంతర్ వద్ద సీజేపీ భారీ నిరసనల పిలుపు నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పరిస్థితి మొత్తం అదుపులో ఉంచేందుకు ఏకంగా 35 వేల మంది పోలీసులను రంగంలోకి దించారు.
సాధారణంగా వీకెండ్ అంటే కూల్ గా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ శాటర్ డే మాత్రం దేశ రాజధాని హీట్ డేగా మారింది. సెకండ్ శాటర్ డే అంటే సెలవు దినం. అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అలాంటిది ఉద్రిక్తతల కొలిమిలో హస్తినాపురి ఉడికిపోతోంది. దానికి కారణం ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ విపక్షాలు కలసి భారీ నిరసనకు పిలుపు ఇవ్వడం. ఈ నిరసనకు ఢిల్లీ పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయినా సరే చేసి తీరుతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. దాంతో నేరుగా కేంద్ర హోం శాఖ రంగంలోకి దిగింది. ఢిల్లీ అంతటా హై అలెర్ట్ ప్రకటించింది. నిఘా నీడలో ఢిల్లీ వెళ్ళిపోయింది. మరి కొద్ది గంటలలో ఢిల్లీలో ఏమి జరగబోతోంది అన్నది అయితే యావత్తు దేశమంతా చూస్తోంది.
వేలాదిగా పోలీసులు :
జంతర్ మంతర్ వద్ద సీజేపీ భారీ నిరసనల పిలుపు నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పరిస్థితి మొత్తం అదుపులో ఉంచేందుకు ఏకంగా 35 వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. అంతే కాదు పారా మిల్టరీ సిబ్బందిని కూడా గ్రొండ్ లోకి దించాలని ప్లాన్ చేశారు. ప్రతీ కీలక ప్రాంతంలో గట్టి నిఘా పెట్టారు. పెద్ద ఎత్తున భర్ద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ మొత్తం నిఘా నీడలోకి వెళ్ళిపోయింది. అంతే కాదు ఇంటర్నెట్ మీద కూడా ఆంక్షలు విధించారు. మెట్రోలతో పాటు రవాణా సాధనాలను కూడా చాలా చోట్ల పరిమితం చేశారు. చీమ చిట్టుక్కుమంటే చాలు గురించి మరీ యాక్షన్ లోకి దిగిపోవాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నరు.
దొరికిన వారిని దొరికినట్లే :
జంతర్ మంతర్ వద్ద ఈగ కూడా శనివారం వాలడానికి వీలు లేకుండా చూస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను కూడా దాటుకుని తెగించి ఆ వైపుగా ఎవరైనా రావాలనుకుంటే వచ్చిన వారిని వచ్చినట్లే నేరుగా తీసుకుని పోయి పోలీసులు నిర్భంధ కేంద్రాలకు తరలించేలా పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. ఈ విధంగా ఢిల్లీలో ఇప్పటికి ఆరు నిర్బంధ కేంద్రాలు కూడా గుర్తించారు. చత్రసాల్ స్టేడియం, రాజీవ్ గాంధీ స్టేడియం, యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్, సూరజ్‌మల్ స్టేడియం, దౌలత్‌పూర్, పాండ్రావల్‌లోని కమ్యూనిటీ సెంటర్లకు ఆనోళన కారులను తరలిస్తారు అని అంటున్నారు.
మహిళా పోలీసులు సిద్ధం :
గతంలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు. వారి మీద మగ పోలీసులు అనుచితంగా వ్యవహరించారు అన్న ఆరోపణలు వినిపించాయి. దాంతో ఈసారి ఆ విమర్శలు రాకుండా మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తున మహిలా పోలీసులను కూడా ఢిల్లీకి రప్పిస్తున్నారు. మహిళా నిరసనకారులను అడ్డుకునేందుకు ఉత్తరప్రదేశ్, హర్యానా నుంచి అదనపు మహిళా పోలీసు సిబ్బందిని కూడా ఢిల్లీకి రప్పిస్తున్నట్లుగా భోగట్టా. అంతే కాదు దేశ రాజధానిలోని కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేస్తూ డేగ కళ్ళతో మొత్తం అంతా తనిఖీలు చేస్తున్నారు.
డ్రోన్లు కెమెరాలే కళ్ళుగా :
ఢిల్లీ పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేయడానికి అత్యాధునిక సాంకేతిక సంపత్తిని వాడుకుంటున్నారు.డ్రోన్లు కెమెరాలే కళ్ళుగా చేసుకుని మొత్తం అంతా పర్యవేక్షణ చేస్తున్నారు. అంతే కాదు అనుమానితుల ముఖ గుర్తింపు వ్యవస్థలని అదనపు సీసీటీవీ కెమెరాలని డ్రోన్లను వినియోగించనున్నారు. అలాగే ఢిల్లీలోని కీలక ప్రాంతాలలోని ఎత్తైన భవనాల పైకప్పులపై సిబ్బందిని నియమించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమగ్రంగా పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అరాచక శక్తుల కదలికలపై :
ఇక ఢిల్లీ భద్రతలో పాలు పంచుకునే కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ఆయుధాలు జారీ చేయవద్దని ఆదేశాలు రావడం విశేషం. గత నిరసనలలో వాటిని వాడారు అన్న ఆరోపణలు ఉండడంతో ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే పోలీసు బృందాలు లాఠీలు, బాటన్లు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. అంటే పరిస్థితి తీవ్రమైతే లాఠీలకు పని చెప్పడానికి మాత్రమే అనుమతి ఉందని అంటున్నారు. మరో వైపు ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల సిఎస్ లకు కేంద్ర హోంశాఖ లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. ఆకతాయిలు అరాచక శక్తుల కదలికలపై దృష్టి పెట్టాలని సూచించినట్లుగా చెబుతున్నారు.