కాక్రోచ్ ల పని ఖతం అయినట్లేనా ?!

సుప్రీంకోర్టు సీజేఐ సూర్యాకాంత్ చేసిన వ్యాఖ్యలతో అభిజీత్ దీప్కే స్థాపించిన సెటైరికల్ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ నిరుద్యోగం, ప్రశ్నపత్రాల లీకేజీ, వ్యవస్థాపక వైఫల్యాల మీద మొదట ఫోకస్ చేసింది.

Update: 2026-10-16 05:19 GMT

సుప్రీంకోర్టు సీజేఐ సూర్యాకాంత్ చేసిన వ్యాఖ్యలతో అభిజీత్ దీప్కే స్థాపించిన సెటైరికల్ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ నిరుద్యోగం, ప్రశ్నపత్రాల లీకేజీ, వ్యవస్థాపక వైఫల్యాల మీద మొదట ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష పత్రం లీకేజీ మీద చేపట్టిన నిరసనలు జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. మొదట దీనిని తేలికగా తీసుకున్నా చివరకు విద్యా శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రదాన్ రాజీనామాకు దారితీసింది.

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణదిన, తెలుగు రాష్ట్రాలలో యువత నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఓటర్ల జాబితా తొలగింపులు, ఏకపక్ష నిర్ణయాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ సీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే నీట్ నిరసనలకు వచ్చిన మద్దతు, సీఈసీ రాజీనామా డిమాండ్ కు రావడం లేదు. దీంతో సీజేపీకి ఆదరణ తగ్గిందా ? ఉనికిని కోల్పోతుందా ? అన్న చర్చ మొదలయింది. ముఖ్యంగా దక్షిణాదిన, తెలుగు రాష్ట్రాలలోనే ఈ ప్రభావం కనిపిస్తుందా ? అన్న వాదన కూడా ఉంది.

నీట్ పరీక్ష వ్యక్తిగత భవిష్యత్తుకు సంబంధించిన అంశం అయినందున దేశవ్యాప్తంగా విద్యార్థులు ప్రభావితం అయ్యారని, సీఈసీ రాజీనామా అంశం ప్రజాప్వామ్యం, ఎన్నికల సమగ్రతకు సంబంధించిన విస్తృత అంశం. ఇది రాజకీయ అంశంగా కనిపిస్తుండగా, ఈ నిరసనల మూలంగా యువతకు తక్షణ ప్రయోజనం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే సీజేపీ ఆందోళనలకు సరయిన స్పందన రావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

నీట్ పరీక్షాపత్రాల లీకేజీ ఆందోళనల సమయంలో సీజేపీని యవతలోని లోతైన అసంతృప్తికి ప్రతీకగా చూశారు. ఇప్పుడు సీజేపీ విద్యకు సంబంధించిన అంశాల నుండి ఎన్నికలకు సంబంధించిన అంశం వైపు విస్తరించడంతో దానికి రాజకీయ ఆశయాలు ఉన్నట్లు కనిపిస్తుందని భావిస్తున్నారు. అందుకే ఈ పరిణామాలను కొందరు ప్రత్యేకంగా చూస్తున్నారు.

ఇక దక్షిణాదిన కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు, భాషా, సాంస్కృతిక కారణాలతో పాటు, కేంద్రీకృత ఉద్యమాలపై అపనమ్మకం ఉండటం వల్ల సీజేపీకి ఆదరణ లభించడం లేదని భావిస్తున్నారు. సీజేపీ యువతలో ఉన్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నప్పటికీ ప్రాంతీయ సంధర్భాలు దాని వ్యాప్తిని పరిమితం చేస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News