కాక్రోచ్ దేశాన్ని నాశనం చేస్తోందా ?

కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో కాంపెయిన్ గా మొదలై సెటైరికల్ గా మారి అనంతరం గ్రౌండ్ లోకి దిగి సీజేపీగా సత్తా చాటిన వైనం దేశాన్ని ఒకింత విస్మయానికి గురి చేసింది.

Update: 2026-10-14 17:30 GMT

కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియాలో కాంపెయిన్ గా మొదలై సెటైరికల్ గా మారి అనంతరం గ్రౌండ్ లోకి దిగి సీజేపీగా సత్తా చాటిన వైనం దేశాన్ని ఒకింత విస్మయానికి గురి చేసింది. బలమైన కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చి ఏకంగా కేంద్ర మంత్రిని ఒకరిని టార్గెట్ చేసి రాజీనామా చేయించిన తీరుతో సీజేపీ ఒక పవర్ ఫుల్ యూత్ టోన్ అని అంతా అనుకున్నారు. అయితే సీజేపీ 2.0 మాత్రం బిగ్ సౌండ్ చేయలేక చతికిలపడింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీనామా చేయాలన్న నినాదం వెనక రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని ఒక చర్చ ఉంది. పైగా దీనిని అందిపుచ్చుకుని ఆందోళన చేస్తోంది కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి. మరి ఆ చెప్పులో సీజేపీ కాలు పెట్టి ఏమి సాధించాలని అనుకుంటోంది అన్నదే అందరికీ కలిగిన సందేహం. దానికి తగినట్లుగా ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళన చేయాలనుకుంది. దానికి పోలీసు బలగాలతో పాలకులు విజయవంతంగా లేకుండా కాకుండా చేశారు.

జెన్ జీ గ్యాంగ్ అంటూ :

నిజమే ఈ దేశంలో నూటికి అరవై శాతం యువత ఉంది. అందులో పాతికేళ్ల లోపు జెన్ జీ యువత కూడా అధికంగా ఉంది. అంత మాత్రం చేత జెన్ జీ గ్యాంగ్ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకమని ఎక్కడా విశ్లేషణలు కానీ గణాంకాలు కానీ లేవు. జెన్ జీ అంటే కేరాఫ్ జంతర్ మంతర్ అంతకంటే కాదు, నీట్ పరీక్షా పత్రం లీకేజ్ వల్లనే వారంతా ఆవేశపడ్డారు. ఆనాటికి ఒక వేదికగా సీజేపీ ఉంది కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున చేరి తన గళాన్ని విప్పారు. అది అక్కడితో సరి అన్నట్లుగానే ఉంది. ఇక సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయడం అన్నది రాజకీయ డిమాండ్. ఓట్ల చోరీ సమస్య అందరిదీ కదా అంటే దానికి మార్గాలు వేరే ఉన్నాయి. తమ ఓటు హక్కుని సాధించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారు, దానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్ లైన్స్ ఉండనే ఉన్నాయి. దానికంటూ ఉద్యమం అంటే అది రాజకీయ పార్టీల అజెండాగా ఉంటుంది. అందుకే సీజేపీ 2.0 పెద్దగా క్లిక్ కాలేదని అంటున్నారు.

దేశాన్ని నాశనం చేస్తున్నారు :

ఇదిలా ఉంటే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది అని అంటున్నారు. అతను ముంబై నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టులోకి అడుగు పెట్టడంతోనే అతన్ని చూసిన ఆవేశంలో ఒక ప్రయాణీకుడు దేశాన్ని నాశనం చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతే కాదు అనేక మంది అక్కడ ఉన్న వారు కూడా అభిజిత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సీజేపీ నేతకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది అని అంటున్నారు.

అరెస్టు సమయంలోనూ :

ఇక ఈ నెల 10న ముంబై నుంచి విమానంలో ఢిల్లీకి వస్తున్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలని ఢిల్లీ పోలీసులు విమానంలోనే అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కూడా ఆ విమానంలో ఉన్న ప్రయాణీకుల నుంచి సీజేపీ నేతలకు వ్యతిరేకత ఎదురైంది అని గుర్తు చేస్తున్నారు. దేశంలో నియంతృత్వం కొనసాగుతోంది అని దీప్కే నినాదాలు చేయడంతో ఆ విమానంలో ఉన్న ప్రయాణీకులు వ్యతిరేకించారు. దేశంలో అలాంటి పరిస్థితులే లేవని దీప్కేకి గట్టి కౌంటర్ ఇచ్చరు. స్వచ్చ భారత్ లో చెత్తను ఏరి పారేయాలని కూడా మరి కొందరు అంటూ సీజేపీ నేతల తీరు మీద ఫైర్ అయ్యారు.

అమెరికన్ సింగర్ సీజేపీ మీద :

మరో వైపు చూస్తే అమెరికన్ సింగ కూడా సీజేపీ మీద తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్అభిజీత్ దీప్కేలపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని వ్యతిరేకించే అమెరికాలోని కొందరు ప్రత్యేక దాతలు సీజేపీకి అభిజీత్ దీప్కేకు నిధులు అందిస్తున్నారని ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి దాతలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. అమెరికాలో చదువుకున్న వ్యక్తులను ఎంచుకుని వారిని తీవ్రవాద ధోరణి వైపు మళ్లించి ఆపై స్వదేశానికి పంపి ఇలాంటి అల్లర్లు అశాంతి సృష్టించడానికి నిధులు ఇస్తారని మిల్బెన్ పేర్కొన్నారు.

యువ దేశభక్తులు మౌనంగా :

అందువల్ల భారతదేశంలోని యువ దేశభక్తులు మౌనంగా ఉండకుండా సీజేపీ విధ్వంసకర ఆలోచనలకు వ్యతిరేకంగా శాంతియుతంగా తిరగబడాలని ఆమె పిలుపు ఇచ్చారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించాలని కోరారు. ఇలా వరసబెట్టి జరుగుతున్న సంఘటనలు అన్నీ సీజేపీకి ఎదురు దెబ్బలుగానే భావిస్తున్నారు. సీజేపీ వ్యవస్థ పరంగా నిర్మాణం లేనిది. అదే సమయంలో ఆవేశమే అజెండాగా చేసుకుని నడిచే ఈ తరహా సంస్థలు ఒక నిర్దిష్ట లక్ష్యం లేకపోతే ఈ విధంగానే దెబ్బ తింటాయని అంటున్నారు. ఇక దేశీయ యువత కానీ జనం కానీ ఈ తరహా ఆవేశ ఉద్యమాలకు ప్రభావితం కారని కూడా చరిత్ర నిరూపించింది అని గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.



Tags:    

Similar News