టీడీపీ నేతల కు చంద్రబాబు.. `సీక్రెట్` సూచన.. ఏంటిది?
టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక సూచన చేశారు. నాయకులుగా ఎదగడమే కాదు.. రాణించేందుకు కూడా కొన్ని విధానాలను అవలంభించాలని సూచించారు.
టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక సూచన చేశారు. నాయకులుగా ఎదగడమే కాదు.. రాణించేందుకు కూడా కొన్ని విధానాలను అవలంభించాలని సూచించారు. దీనికి తానే ఉదాహరణగా ఆయన పేర్కొన్నా రు. తాను `ది సీక్రెట్` అనే పుస్తకాన్ని నిరంతరం చదువుతున్నట్టు తెలిపారు. ఎప్పుడు చదివినా.. ఒక కొత్త విషయం నేర్చుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈ పుస్తకం తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చిందన్న ఆయన.. ప్రతి ఒక్కరూ `సీక్రెట్` పుస్తకాన్ని చదవాలని సూచించారు. తద్వారా ప్రజలకు - నాయకులకు మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుందన్నారు.
ఏంటీ పుస్తకం.. ?
ఆస్ట్రేలియాకు చెందిన రచయిత రోండా బైర్న్ రాసిన `ది సీక్రెట్` పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి ఒక్కరిలోనూ అనేక కోరికలు ఉంటాయని, అభిలాషలు ఉంటాయని.. వాటిని సాధించేందుకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలనే.. `ది సీక్రెట్` పుస్తకంలో రచయిత వివరించారు. ఈ పుస్తకం విడుదలైన 2006 నుంచి కేవలం సంవత్సరకాలంలో కోటీ 90 లక్షల మంది కొనుగోలు చేశారు. 46 భాషలలోకి అనువదించిన పుస్తకంగా కూడా రికార్డు సృష్టించింది. ఈ పుస్తకం ఆధారంగా సినిమాను కూడా రూపొందించారు.
ముఖ్యంగా `ది సీక్రెట్` ఒక స్వీయ-సహాయక పుస్తకం. దీని ద్వారా ఎంచుకున్న రంగంలో విజయం సాధించడానికి అవసరమైన స్ఫూర్తిని అందిస్తుంది. ప్రజలు ఏ విషయాలను ఎలా చూస్తారో వివరిస్తుంది. ఇది వారిని విజయం, నిజమైన సంతోషం వంటి మార్గంలో నడిపిస్తుంది. ఈ పుస్తకం 'సూత్రాన్ని సజావుగా, సరైన విధంగా వినియోగించడానికి, సానుకూలంగా ఆలోచించడం వల్ల కలిగే గొప్ప ఆనందం, ఆరోగ్యం, సంపద ల నిధిని ఎలా దారితీస్తుందో వివరిస్తుంది.
ప్రజలు ఆలోచించి అనుభూతి చెందుతున్నప్పుడు, వారు విశ్వానికి సంబంధిత ఫ్రీక్వెన్సీని పంపుతారని, అదే ఫ్రీక్వెన్సీ సంఘటనలు. పరిస్థితులను ఆకర్షిస్తుందని ఈ పుస్తకం పేర్కొంటుంది. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సానుకూలంగా, సరైన పద్ధతిలో ఆలోచించగలిగితే, దానివల్ల సహజంగానే ఎల్లప్పుడూ ఉత్తమ ఫలితాలను పొందుతాడనే విషయాన్ని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది. అభిప్రాయాలకు శాస్త్రీయ ఆధారం లేదు. ప్రజ లు తమ కలలను, కోరికలను వ్యక్తీకరించడానికి సహాయపడే రెండు ప్రధాన శక్తివంతమైన ప్రక్రియలుగా దృశ్యరూపకత, కృతజ్ఞతలను ఈ పుస్తకం పేర్కొంది.