బాబు...చలో సింగపూర్ !
ఇక రెండవ రోజు పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సీబీఎన్ ఎట్ ది రేట్ ఆఫ్ 361ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 14న సింగపూర్‌కు ప్రయాణం అవుతున్నారు. ఆయన 15, 16వ తేదీలలో రెండు రోజుల పాటు పర్యటన చేపడతారు. అంతే కాదు 2026 సీఐఐ పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో బాబు పాల్గొంటారు. సింగపూర్ ప్రధానమంత్రి, ఇతర కీలక మంత్రులు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం వరుస భేటీలు వేయనుంది. దీంతో బాబు సింగపూర్ టూర్ ఆసక్తిని కలిగిస్తోంది.
భారీ పెట్టుబడుల కోసం :
ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్ టూర్ చేయనున్నారు అని అంటున్నారు. బాబు టూర్ ప్రోగ్రాం చూస్తే ఈ నెల 14న ఉదయం పదకొండున్నరకు బెంగళూరు నుంచి సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీ నుంచి బాబు అధికారిక టూర్ స్టార్ట్ అవుతోంది. అందులో భాగంగా సింగపూర్ కాలమానం ప్రకారం ఆ దేశంలో ఉదయం పదిన్నర గంటలకు అక్కడి భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో మొదటగా బాబు సమావేశం అవుతారు. ఈ పర్యటనలో తొలిరోజు స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు బాబు హాజరవుతారు. అనంతరం యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్ తో విందు సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలుస్తోంది.
బిజీ షెడ్యూల్ తోనే :
ఇక సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్‌తోనూ బాబు స్ సమావేశం అవుతారు. తర్వాత గూగుల్ క్లౌడ్ ఏపీఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్‌తో బాబు కీలక చర్చలు జరుపుతారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్‌తోనూ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్‌తో ఆయన భేటీ అవుతారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తోనూ బాబు సమావేశం అవుతారు. అలాగే సీఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశం అవుతారు. అక్కడి హోం మంత్రి కె షణ్ముగమ్, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్‌తోనూ బాబు భేటీలు సాగుతాయి.
కీలక చర్చలతోనే :
ఇక రెండవ రోజు పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సీబీఎన్ ఎట్ ది రేట్ ఆఫ్ 361ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఏపీఏసీ సెమికండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్-అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రి వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో బాబు సమావేశం అవుతారు. ఆ తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్ షిప్ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. సింగపూర్ పెవిలియన్ ఇన్నోవేటర్ల అలయ్, గూగుల్ టెక్నాలజీస్ స్టాల్స్ ప్రధానంగా పరిశీలిస్తారు. అలాగే సీట్రియమ్ సమావేశంలోనూ పాల్గొంటారు. ఇక ఈ పర్యటనలో చివరిగా సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో బాబు పాల్గొంటారని తెలుస్తోంది.
బాబు బృందంలో వారంతా :
ఇక సింగపూర్ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ ఈడీబీ సీఈఓ షన్మోహన్ సీఆర్డీఏ అధికారుల బృందం కూడా వెళ్లనుంది. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు సహా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం బృందం సింగపూర్ లో పర్యటించనుందని చెబుతున్నారు. ఈ నెల 16 తేదీ రాత్రి 10 గంటలకు ముఖ్యమంత్రి స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈ మొత్తం టూర్ లో ప్రతీ నిముషం కూడా బాబు బిజీగానే గడపనున్నారు. ఈ రెండు రోజులలో బాబు అనేక మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నారు. అలగే కీలక నేతలతో భేటీలు వేయనున్నారు. మొత్తానికి బాబు సింగపూర్ టూర్ ఆసక్తిని పెంచుతోంది. ఏపీకి పెట్టుబడులను తీసుకుని వచ్చే లక్ష్యంతో సాగుతున్న ఈ టూర్ మీద అంతా ఇంట్రెస్ట్ .