కుక్క కోసం దేశాల మధ్య వివాదం..? ఈ డాగ్ హిస్టరీ నెక్స్ట్ లెవెల్!

కేవలం ఒక కుక్క కోసం రెండు దేశాల మధ్య పెద్ద రచ్చే నడుస్తోంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం! పెర్రో కారామెలో అనే ఒకే ఒక్క కుక్క జాతి కోసం బ్రెజిల్, మెక్సికో దేశాలు ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

Update: 2026-06-04 00:30 GMT

సాధారణంగా దేశాల మధ్య యుద్ధాలు, గొడవలు ఎందుకు జరుగుతాయి? సరిహద్దుల కోసమో, నదీ జలాల కోసమో లేదా రాజకీయ కారణాల వల్లో జరుగుతుంటాయి. కానీ నిన్న 'న్యూయార్క్ టైమ్స్'లో వచ్చిన ఒక కథనం ప్రకారం.. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, కేవలం ఒక కుక్క కోసం రెండు దేశాల మధ్య పెద్ద రచ్చే నడుస్తోంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం! పెర్రో కారామెలో అనే ఒకే ఒక్క కుక్క జాతి కోసం బ్రెజిల్, మెక్సికో దేశాలు ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అసలు ఈ కుక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటో చూసేద్దాం.

ఆ కుక్క స్పెషాలిటీ ఏంటి?:

ఇక న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. బ్రెజిల్‌లో గోధుమ రంగులో క్యారమెల్ కలర్ లో కనిపించే ఈ కుక్కలను 'పెర్రో కారామెలో' అని పిలుస్తారు. ఇవి మామూలు కుక్కలు కాదండోయ్, దాదాపు 300 రకాల కుక్క జాతుల సమ్మేళనంతో ఇవి పుట్టాయని ఒక నమ్మకం ఉంది. అందుకే ఈ కుక్కలు తమ దేశ చరిత్రకు, సంస్కృతికి అద్దం పడతాయని బ్రెజిల్ ప్రజలు చాలా బలంగా నమ్ముతారు. అక్కడ ఈ కుక్కలకు విపరీతమైన రెస్పెక్ట్, క్రేజ్ ఉన్నాయి.

గొడవ ఎక్కడ మొదలైంది?:

ఇలా బ్రెజిల్ వాళ్లు ఓన్ చేసుకున్న కుక్కపై సడన్‌గా మెక్సికో దేశం కన్నేసింది.ఇక ఇటీవల మెక్సికో ప్రభుత్వం ఈ 'పెర్రో కారామెలో' కుక్కను తమ దేశపు నాల్గవ జాతీయ చిహ్నంగా అధికారికంగా ప్రకటించేసింది. అంతే, ఈ న్యూస్ వినగానే బ్రెజిల్ ప్రజలకు ఎక్కడో కాలిపోయింది. "మా దేశ సంస్కృతిలో భాగమైన కుక్కను మీరెలా జాతీయ చిహ్నంగా ప్రకటిస్తారు?" అంటూ మెక్సికోపై ఫైర్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో వార్:

ఇప్పుడు ఈ కుక్కపై హక్కులు మావంటే మావంటూ ఇరు దేశాల ప్రజలు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. "ఆ కుక్క మా దేశానికి చెందింది" అని బ్రెజిల్ వాళ్లు, "లేదు, దీని హిస్టరీ మా దేశంతో ముడిపడి ఉంది" అని మెక్సికో వాళ్లు మీమ్స్, పోస్టులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఒక జంతువు కోసం రెండు దేశాల పౌరులు ఇంటర్నెట్‌లో ఇలా తలపడటం నెటిజన్లకు భలే వింతగా అనిపిస్తోంది.

గతంలో దేశాల మధ్య ఎన్నో వింత కారణాలతో గొడవలు జరిగాయి కానీ, ఇలా ఒక వీధి కుక్క జాతి కోసం రెండు పెద్ద దేశాలు కొట్టుకోవడం మాత్రం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ కుక్క చిచ్చు ఎక్కడికి దారితీస్తుందో కానీ, ప్రస్తుతం ఈ 'పెర్రో కారామెలో' మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది. మరి ఈ ఇరు దేశాల వివాదానికి ఎలా ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.

Tags:    

Similar News