మ‌హాఘ‌ట్‌బంధ‌న్ కాదు.. 'ల‌ఠ్' బంధ‌న్‌: మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. ప్ర‌ధాని నరేంద్ర మోడీ దాదాపు ప్ర‌చారంలోకి దిగిపోయారు.;

Update: 2025-10-23 17:40 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. ప్ర‌ధాని నరేంద్ర మోడీ దాదాపు ప్ర‌చారంలోకి దిగిపోయారు. ఎక్క‌డ ఏ రా ష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా.. ముందుగా ఆయ‌న కార్య‌క‌ర్త‌ల నుంచే ప్ర‌సంగాలు, రాజ‌కీయాల‌ను ప్రారంభి స్తారు. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో గురువారం రాత్రి ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు.. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి పార్టీల కార్య‌క‌ర్త‌ల‌తోనూ.. సంభాషించారు. స్థానికంగా ఉన్న ప్ర‌జ‌ల మూడ్‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అనంత‌రం.. ప్ర‌ధాని మాట్లాడుతూ.. కార్య‌క‌ర్త‌లే ఎన్డీయే కూట‌మికి బ‌ల‌మ‌ని వ్యాఖ్యానించారు. వారు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయ‌డం వ‌ల్లే పార్టీకిగుర్తింపు వ‌చ్చింద‌న్నారు. మ‌రోసారి కూడా రాష్ట్రంలో ఎన్డీయే కూట‌మి అధికారంలోకి రావ‌డం త‌థ్య‌మ‌ని చెప్పిన ఆయ‌న‌.. అలాగ‌ని ఎవ‌రూ అజాగ్ర‌త్త‌గా ఉండ‌డానికి వీల్లేద‌ని తెలిపారు. త్వ‌రలోనే ఎన్నికల ప్ర‌చారం కోసం వ‌స్తున్న‌ట్టు తెలిపారు. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఎన్డీయే కూట‌మిని.. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారును గెలిపించుకుందామ‌ని పిలుపునిచ్చారు.

ఇదేస‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మ‌హాఘ‌ట్‌బంధ‌న్ కూట‌మిపై మోడీ విమ‌ర్శ‌లు గుప్పించా రు. మ‌హాఘ‌ట్‌బంధ‌న్‌కు కొత్త నిర్వ‌చ‌నం చెప్పారు. అది మ‌హాఘ‌ట్‌బంధ‌న్‌(మ‌హా కూట‌మి) కాద‌ని.. ల‌ఠ్ బంధ‌న్‌(మ‌హా నేర‌స్తుల కూట‌మి) అని అభివ‌ర్ణించారు. ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని సూచించారు. ఈ కూట‌మిలో ఉన్న నాయ‌కులు అంద‌రూ ప్ర‌స్తుత బెయిల్‌పైనే ఉన్నార‌ని.. ప‌రోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు.. ప్ర‌జ‌లకు మేలు చేస్తాయా? అంటూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఆర్జేడీని ఉద్దేశించి విమ‌ర్శించారు.

అంతేకాదు.. జంగిల్‌రాజ్‌.. అంటూ.. ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ గ‌త పాల‌న‌పైనా ప్ర‌ధాని విమ‌ర్శ లు గుప్పించారు. మ‌రో వంద సంవ‌త్స‌రాలు అయినా.. ఈ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుం ద‌ని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు తమ త‌ప్పులను దాచేందుకు ప్ర‌య‌త్నించినా.. ప్ర‌జ‌లు వాటిని మ‌రిచి పోర‌ని, వారిని క్షమించ‌ర‌ని కూడా వ్యాఖ్యానించారు. నేటి తరం యువకులు ఈ విష‌యాల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని.. ఎన్డీయే కూట‌మి విజ‌యానికి ప్ర‌య‌త్నించాల‌ని ఆయ‌న సూచించారు.

Tags:    

Similar News