బిహార్ పోల్: త్రిముఖ పోరులో ఏ పార్టీ ఏ కూటమిలో?

ఎవరు అవునన్నా.. కాదన్నా.. కొన్ని కీలక రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు.. వాటి ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని ఇట్టే మార్చేస్తుంటాయి.;

Update: 2025-10-26 04:43 GMT

ఎవరు అవునన్నా.. కాదన్నా.. కొన్ని కీలక రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు.. వాటి ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని ఇట్టే మార్చేస్తుంటాయి. అందుకు బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతం బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆ కోవకు చెందినదే. డెవలప్ మెంట్ లో వెనుకబడినప్పటికి.. గడిచిన పదేళ్లలో ఆ రాష్ట్ర రూపురేఖలు చాలానే మారాయి. ఈసారి ఎన్నికల్లో ఎలా అయినా విజయాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భావిస్తోంది. అదేసమయంలో మహాగఠ్ బంధన్ లోని కీలకమైన ఆర్జేడీ.. కాంగ్రెస్ తో జత కట్టి అధికారాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తోంది. ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ కాదన్నట్లుగా వ్యవహరిస్తోంది.

ఇలా ఓవైపు ఎన్డీయే.. మరోవైపు మహాగఠ్ బంధన్ కూటమిలతో పాటు.. మరో కీలకమైన కూటమి ఉంది. అదే భారతీయ ఎన్నికల సిత్రాన్ని సమూలంగా మార్చేసి.. పార్టీలకు వ్యూహాల్ని అందించే కార్పొరేట్ విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చిన ప్రశాంత్ కిశోర్ తన సొంత రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏర్పాటు చేసిన పార్టీతో పాటు..లాలూ కొడుకు ఏర్పాటు చేసిన పార్టీతో జత కట్టి ఎన్నికల బరిలోకి దిగారు. కీలక విజయాన్ని సొంతం చేసుకోవాలన్న తపనలో ఉన్నారు.

ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రుల్ని తయారు చేసిన ఫ్యాక్టరీగా ఆయనకు పేరుప్రఖ్యాతులు ఉన్నప్పటికి.. సొంత రాష్ట్రంలో ఆయన తన సత్తా ఎంతమేర చాటతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. హోరాహోరీగా సాగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమి తరఫున ఏ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నాం.

బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 38 జిల్లాల్లో ఉండే బిహార్ రాష్ట్రాన్ని మరోలా కూడా చెప్పొచ్చు. ఏపీని ఏ విధంగా అయితే కోస్తా, రాయలసీమ, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రగా పేర్కొంటారో.. అదే రీతిలో బిహార్ రాష్ట్రాన్ని చెప్పాలంటే.. మిథిల.. భోజ్ పూర్.. మగధ.. కోసి ప్రాంతంగా చెప్పొచ్చు.

మిథిల ప్రాంతం.. బిహార్ ఈశాన్య భాగంలో.. నేపాల్ సరిహద్దులో ఉంటుంది. భోజ్ పూర్ ప్రాంతం విషయానికి వస్తే.. నూరుతి భాగాన్ని ఇలా వ్యవహరిస్తారు. మగధ ప్రాంతం బిహార్ దక్షిణ భాగంలో ఉంటుంది. దీని పరిధిలోనే రాష్ట్ర రాజధాని పాట్నాతో పాటు గయ లాంటి ప్రధాన నగరాలు ఉంటాయి.కోసి ప్రాంతం రాష్ట్రంలోని తూర్పు భాగంలో ఉంటుంది. శ్రీనివాసపుర ప్రాంతం పశ్చిమ భాగంలో ఉంటుంది. త్రిముఖ పోరులో ఏ కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయన్న విషయానికి వస్తే..

ఎన్డీయే కూటమి

బీజేపీ

జేడీయూ

లోక్ జనశక్తి (రాంవిలాస్)

హిందుస్థాన్ అవామ్ మోర్చా

రాష్ట్రీయ లోక్ మంచ్

మహాగఠ్ బంధన్

ఆర్జేడీ

కాంగ్రెస్

వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ0

వామపక్ష పార్టీలు

మూడో కూటమి

జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్ కిశోర్ పార్టీ)

జన్ శక్తి జనతాదళ్ (జేజేడీ)

ఇక సీట్ల పర్దుబాటు విషయానికి వస్తే.. ఎన్డీయే కూటమిలో కీలక బీజేపీ.. జేడీయూ విషయానికి వస్తే ఈ రెండు ప్రధాన పార్టీలు 101 సీట్ల చొప్పున సర్దుబాటు చేసుకోగా.. ఎల్జేపీ 29 స్థానాలతో, రాష్ట్రీయ లోక్ మంచ్ 6 స్థానాల్లో.. హిందుస్థాన్ అవామ్ మోర్చా ఆరు స్థానాల్లో బరిలోకి దిగనుంది. మహాగఠ్ బంధన్ కూటమి విషయానికి వస్తే.. సీట్ల సర్దుబాటు పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ కూటమిలో కీలకమైన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు చాలాచోట్ల స్నేహపూర్వక పోటీలో ఉన్నారు. ఆర్జేడీ 143 స్థానాల్లో.. కాంగ్రెస్ అధికారికంగా 61 సీట్లలో.. వీఐపీ 15 చోటల పోటీ చేస్తున్నాయి. అనధికారికంగా మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది.

Tags:    

Similar News