మోడీ ‘విష్ణు’ అవతారం అని నేను ఎందుకు అన్నాను ?!
‘మోడీ విష్ణువు అవతారం. నేను 2019లో ఈ మాట అన్నాను. కానీ మోడీ విష్ణువు అవతారం ఎందుకు అన్నాను.
‘మోడీ విష్ణువు అవతారం. నేను 2019లో ఈ మాట అన్నాను. కానీ మోడీ విష్ణువు అవతారం ఎందుకు అన్నాను. కానీ నా మాట సరైంది. ఆయన గుజరాత్ ను ముఖ్యమంత్రిగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు దేశాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు’ అని భూటాన్ ప్రధానమంత్రి ట్షెరింగ్ టోబ్గే అన్నారు. మోడీ విష్ణువు అవతారం మాత్రమే కాదు. ఆయన కల్కి అవతారం అని పేర్కొనడం విశేషం.
2014కి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. అనంతరం 2019, 2024 నుండి వరసగా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. భారత్ - భూటాన్ సంబంధాలు బలంగా ఉన్న నేపథ్యంలో భూటాన్ ప్రధానమంత్రికి మోడీతో వ్యక్తిగత స్నేహం, గౌరవం పెరుగుతూ వస్తుంది.
2019 జులై 27న ఆయన ప్రధానమంత్రిగా ఉన్న మోడీని ఢిల్లీలో కలిశారు. అప్పటికి ఆయన కనీసం ఎంపీ కూడా కాలేదు. అప్పటికి ఓడిపోయి 10 నెలలు అయింది. ప్రైవేటు పౌరుడిగా మోడీని కలిశారు. ఆ సమయంలో నేను మిమ్మల్ని విష్ణువు అవతారంగా చూస్తాను. మన ప్రాంతంలో జ్ఞానవంతులైన వ్యక్తులను అలా భావిస్తారు అని చెప్పారు.
ఆ తర్వాత ఆ మాటలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి అని, నేను అతిశయోక్తి చేశానా ? తప్పు చేశానా అని ఆలోచించాను అని, కానీ మోడీ నాయకత్వం చూసి నేను సరిగ్గా చెప్పానని అన్నారు. తనతో మోడీ ‘నీవు నాకు ఎప్పటికీ అన్నయ్యగా ఉంటావు ‘ అని మోడీ చెప్పాడని పేర్కొన్నారు.
2024లో మోడీ ప్రధాని అయ్యాక మార్చి 14న ఢిల్లీలో కలిశాను. 2019లో మాటలు గుర్తు చేసుకున్నాను. విష్ణువు చివరి అవతారం కల్కి. అది అశాంతి తొలగించి, ధర్మాన్ని పునరుద్ధరించి, పునరుజ్జీవనం చేస్తుంది అని భూటాన్ ప్రధానమంత్రి ట్షెరింగ్ టోబ్గే అన్నారు.
వికసిత్ భారత్ అంటే వికసిత్ భూటాన్ అని, మోడీ ప్రధాని అయిన తర్వాత మొదటి పర్యటన భూటాన్ లో 2014లో చేశారని, ఆయనకు భూటాన్ నుండి గౌరవం, లోతైన ప్రేమ, గౌరవం, మద్దతు, సహకారం ఉంటాయని అంటున్నారు.