మైనర్లపై అత్యాచారం.. జ్యోతిష్యుడికి 200 జైలు.. శివగంగై పోక్సో కోర్టు

కొద్దిరోజులకు వారిద్దరూ అనారోగ్యానికి గురి కావటంతో తల్లిదండ్రులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారికి టెస్టులు చేసిన వైద్యులు.. వారికి ఎస్ టీడీ (సెక్సువల్లీ ట్రాన్సెమిటెడ్ డిసీజ్)గా పేర్కొన్నారు.;

Update: 2026-02-25 04:57 GMT

కామపిశాచికి కఠిన కారగార శిక్షను విధించటం ద్వారా శివగంగై పోక్సో కోర్టు సంచలనానికి తెర తీసింది. ఇద్దరు మైనర్ బాలికల్ని అత్యాచారం చేసిన దారుణ నేరానికి తీవ్రంగా రియాక్టు అయ్యింది. సదరు జ్యోతిష్యుడికి ఏకంగా 200 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి జ్యోతిష్యుడు కావటం గమనార్హం. అందరి ఫ్యూచర్ చెప్పే ఈ దుర్మార్గుడు.. తన భవిష్యత్తు గురించి తెలీదా? అంటూ జనాలు తిట్టిపోస్తున్న పరిస్థితి. తప్పుడు మాటలు చెబుతూ.. దుర్మార్గాలకు పాల్పడే ఇలాంటి వారికి సరైన శిక్షే పడిందన్న మాట వినిపిస్తోంది.

ఇంతకూ అసలేం జరిగిందంటే..

2021 నవంబరులో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలు (17 ఏళ్లు, 14 ఏళ్లు) సరిగా చదవటం లేదన్న సమస్యతో శివగంగై జిల్లా కారైక్కుడికి చెందిన 52 ఏళ్ల జ్యోతిష్యుడు రామక్రిష్ణణ్ వద్దకు తీసుకెళ్లింది. వారిద్దరిని పరిశీలించినట్లు నటించి.. వారికి పరిహారం చేయాల్సి ఉంటుందని సదరు మహిళకు చెప్పి.. ఆమె ఇద్దరు కుమార్తెలను ఒక గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు.

కొద్దిరోజులకు వారిద్దరూ అనారోగ్యానికి గురి కావటంతో తల్లిదండ్రులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారికి టెస్టులు చేసిన వైద్యులు.. వారికి ఎస్ టీడీ (సెక్సువల్లీ ట్రాన్సెమిటెడ్ డిసీజ్)గా పేర్కొన్నారు. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు కుమార్తెలను గట్టిగా అడగ్గా.. జ్యోతిష్యుడు తమపై అత్యాచారానికి పాల్పడినట్లుగా చెప్పటంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసు విచారణలో జ్యోతిష్యుడు తాను అత్యాచారానికి పాల్పడినట్లుగా ఒప్పుకున్నాడు.

దీంతో.. అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు శివగంగై పోక్సో కోర్టులో ప్రవేశ పెట్టారు. కేసు విచారణ నేపథ్యంలో నిందితుడు చేసిన దారుణ నేరం బయటకు రావటంతో అతడికి 200 ఏళ్లు జైలుశిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానాను విదించటంతో పాటు.. బాధితులకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ వైనం చూస్తే.. తప్పుడు వ్యక్తులను ఆశ్రయిస్తే జరిగే చేటు ఎంతన్న విషయాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News