ఐఫోన్ కొత్త సిరీస్ లాంఛ్.. గొప్పలకుపోయి ఇలా బుక్కయ్యారేంటి?
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన ఆపిల్ సరికొత్త ఐఫోన్ సిరీస్ ని లాంఛ్ చేసింది.;
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలలో ఒకటైన ఆపిల్ సరికొత్త ఐఫోన్ సిరీస్ ని లాంఛ్ చేసింది. ఇందులో ఐఫోన్ ఎయిర్ మోడల్ ని విడుదల చేసింది. ఇది ఇప్పటివరకు ఆపిల్ చరిత్రలోనే అతి సన్నని మొబైల్ అని కేవలం 5.6 మిల్లీమీటర్లు మాత్రమే అని ఐఫోన్ సంస్థ ప్రకటించింది. అలా ఐఫోన్ చరిత్రలోనే ఇదే అతి సన్నని మొబైల్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకోవడంతో.. టెక్ నిపుణులు మాత్రం దీనిని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో సన్నదనం అనేది ఒక పాత ట్రెండ్ అంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఆండ్రాయిడ్ కంపెనీలు ఎప్పుడో ఈ పద్ధతి గల మొబైల్స్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చారంటూ తెలియజేస్తున్నారు.
అయితే iphone air మొబైల్ కంటే అతి సన్నని మొబైల్స్ లిస్టు విషయానికి వస్తే..
ఒప్పో R -5: 4.85 MM మందంతో అత్యంత సన్నని మొబైల్ గా నిలిచింది.
వివో X -5 MAX : ఈ మొబైల్ 5.1 MM మందంతో ఉన్నది.
టెక్నో స్పార్క్ స్లిమ్: ఈ మొబైల్ 5.75mm మందం కలదు.
సాంసంగ్ గెలాక్సీ S -25 ఎడ్జ్: ఈ మొబైల్ 5.8 mm తో కలదు.
ఇన్ఫినిక్స్ హాట్ 60 pro+: ఈ మొబైల్ 5.95mm మందంతో కలదు.
ఈ మొబైల్స్ అన్నీ కూడా ఐఫోన్ విడుదల చేసినటువంటి ఐఫోన్ ఎయిర్ మొబైల్ కంటే సన్నగా లేదా ఆ మొబైల్ తో సమానంగా కలవు. ఈ విషయాన్ని బట్టి చూస్తే సన్నని మొబైల్స్ విషయంలో మాత్రం ఆపిల్.. ఆండ్రాయిడ్ దారిలో నడుస్తోంది అని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతే కాదు ఇది చూసిన చాలా మంది ఐఫోన్ నిర్వాహకులు గొప్పలకు పోయి ఇలా బుక్కయ్యారేంటి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఆండ్రాయిడ్ మొబైల్స్ అనుభవం ప్రకారం:
ఆండ్రాయిడ్ కంపెనీలు సన్నని మొబైల్స్ ట్రెండు ని గతంలోనే ప్రయత్నించాయి. అయితే ఇందులో వారు గమనించిన విషయం ఏమిటంటే కేవలం మొబైల్ సన్నగా ఉండడం వల్ల వినియోగదారులకు పెద్దగా ఉపయోగం లేదని సన్నని మొబైల్స్ లో బ్యాటరీ సామర్థ్యం కూడా చాలా తక్కువగానే ఉంటుంది అని , ఇవి తొందరగా దెబ్బతినే అవకాశం ఉంటాయని.. అలాగే కెమెరా బంపు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోందని ఈ కారణాల వల్ల చాలామంది సన్నని మొబైల్స్ కంటే ఎక్కువగా కెమెరా పనితీరు, బ్యాటరీ పని తీరు చూసి దృఢమైన మొబైల్స్ ని ఇష్టపడుతున్నారట.
ఆపిల్ ఏయిర్ మొబైల్ డిజైన్ రివల్యూషన్ అని ప్రచారం చేసుకున్న ఐఫోన్ మొబైల్ మాత్రం ఆండ్రాయిడ్ వినియోగదారులను ఆకర్షించలేకపోతోంది. సన్నని మొబైల్ అనే కాన్సెప్ట్ ఆండ్రాయిడ్ యూజర్స్ కి పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల క్రితమే ఇలాంటి మొబైల్స్ వచ్చాయని వారికి తెలిసిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వినియోగదారులకు కావాల్సింది డిజైన్ ముఖ్యం కాదు.. బ్యాటరీ సామర్థ్యం, కెమెరా పనితీరు , మొబైల్ నాణ్యతనే ప్రధాన అంశంగా ఎంచుకుంటున్నారు.