మన ఐఏఎఫ్ చీఫ్ తో మామూలుగా ఉండదు.. అమెరికన్ చీఫ్ ముందే వేసేశాడు..

అగ్రరాజ్యాలకు మన ఐఏఎఫ్ చీఫ్ ఐడియా ఉంటే చాలు.. స్టేజి పైనే కాస్త నవ్వుతూనే క్లాస్ పీకేస్తారు.

Update: 2026-10-11 05:33 GMT

అగ్రరాజ్యాలకు మన ఐఏఎఫ్ చీఫ్ ఐడియా ఉంటే చాలు.. స్టేజి పైనే కాస్త నవ్వుతూనే క్లాస్ పీకేస్తారు. అమెరికా ఎఫ్‌-35 స్పెషల్ గెస్ట్‌లా భారత్ వచ్చినా దాన్ని కనీసం తాకడానికి కూడా ఒప్పుకోకపోవడంపై వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"కనీసం జెట్ దగ్గరికి కూడా రానివ్వరు సామీ"

సంగతేంటంటే.. జోధ్‌పూర్‌లో ఇటీవల ముగిసిన ‘తరంగ్ శక్తి-2026’ అంతర్జాతీయ వైమానిక విన్యాసాల్లో అమెరికాకు చెందిన ఆరు ఎఫ్‌-35 ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాలు సందడి చేశాయి. ఇవన్నీ సరే గానీ ఇక్కడ సీన్ ఏంటంటే.. ఈ యుద్ధ విమానాల కొనుగోలుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పక్కనే ఉన్న అమెరికా పసిఫిక్ ఎయిర్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ కెవిన్ స్నేడర్‌ వైపు చూస్తూ ఏపీ సింగ్ తనదైన మార్కు చమత్కార విసిరారు. "అయ్యా.. అమెరికా అధికారులు మమ్మల్ని కనీసం ఆ విమానాల కాక్‌పిట్ వైపు చూడనివ్వడం లేదు.. దగ్గరకు కూడా వెళ్లనివ్వడం లేదు.. అలాంటప్పుడు వాటిని మాకు అమ్మే ప్రతిపాదనల గురించి మాట్లాడుకోవడం ఎందుకు దండగ?" అంటూ ఈ ఒక్క మాటతో అమెరికా నుంచి ఎఫ్‌-35 సేల్స్ గురించి ఎటువంటి అధికారిక ఆఫర్ రాలేదని చాలా కూల్‌గా తేల్చేశారు. మన పైలట్లను కేవలం పక్కన ఫార్మేషన్‌లో ఎగరడానికి మాత్రమే అనుమతి ఇచ్చిన అమెరికా కఠిన "రహస్య నిబంధనలను" ఐఏఎఫ్ చీఫ్ చాలా స్వీట్‌గా ఎండగట్టారు.

చైనా, పాక్ హడావుడి.. మన ముందున్న ఆప్షన్లేంటి?

ఒకవైపు చైనా ఇప్పటికే జే-20, జే-35 స్టెల్త్ జెట్లతో డ్రాగన్ గర్జనలు చేస్తోంది. పైగా పాకిస్థాన్‌కు ఈ జే-35 లు సప్లై చేయడానికి చైనా రెడీ అవుతోంది. ఇలాంటి టైమ్‌లో భారత వాయుసేనకు ఐదో తరం యుద్ధ విమానాలు అత్యవసరం. మరి భారత్ ఏం చేయాలి? రష్యా ఎస్‌యూ-57 ఆఫర్ ఇచ్చింది. అమెరికా షో-ఆఫ్ చూపిస్తుంటే రష్యా మాత్రం "మా ఎస్‌యూ-57 తీసుకోండి సామీ" అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చిందని ఏపీ సింగ్ ధృవీకరించారు. అయితే ధరలు, టెక్నాలజీ బదిలీ చూసుకోకుండా భారత్ తొందరపడదు గాక తొందరపడదు. ఇక మన సొంత అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఆమ్కా) ప్రాజెక్టు రెడీ అవుతోంది. కానీ అది పూర్తిస్థాయిలో ఆకాశంలోకి ఎగరడానికి కాస్త సమయం పడుతుంది.

గాల్లో తేలడం కాదు.. స్వయం సమృద్ధి ముఖ్యం

అమెరికా జెట్లను కేవలం దూరం నుంచి చూసి సంబరపడిపోయే రోజులు పోయాయి. భారత్‌కు కావలసింది కేవలం షోరూమ్‌లో ఉన్న మెరిసే ఎఫ్‌-35 విమానం మాత్రమే కాదు. దానికి సంబంధించిన పూర్తి సాంకేతికత, మన సొంత ఆయుధాలను అనుసంధానించుకునే వెసులుబాటు.. అలాగే దీర్ఘకాలిక నిర్వహణ హక్కులు.

అమెరికా తన 'సెక్యూరిటీ రూల్స్' పేరుతో కాక్‌పిట్ కూడా చూపించనప్పుడు అటువంటి విమానాలపై కోట్లు కుమ్మరించడం కంటే మన సొంత ఏఎంసీఏ సామర్థ్యాలను పెంచుకోవడం లేదా టెక్నాలజీ ఇచ్చే భాగస్వాములను ఎంచుకోవడమే శ్రేయస్కరమని ఐఏఎఫ్ చీఫ్ తన సరదా వ్యాఖ్యలతో అమెరికాకు స్పష్టమైన సందేశం ఇచ్చేశారు.

Tags:    

Similar News