టీడీపీ అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్
అదే విధంగా టీడీపీ పోటీ చేస్తున్న మునిసిపాలిటీలు, నగర పంచాయతీల అభ్యర్థులను కూడా ప్రకటించింది.
తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున తాము పోటీ చేసే కార్పొరేషన్లలో 11కి గాను ఏడింటికి మేయర్ అభ్యర్ధులను ప్రకటించింది. ఈ లిస్ట్ చూస్తే విశాఖ నుంచి దాక్టర్ ముక్కా శ్రావణిని ఎంపిక చేసింది. విజయనగరం మేయర్ గా అవనపు భార్గవికి చాన్స్ ఇచ్చింది. ఇక చిత్తూరులో కటారి హేమలత, కడపలో డాక్టర్ నెల్లటూరి సువర్ణ, కర్నూలులో విజయ ప్రత్యూష, తిరుపతిలో మన్నెం శ్రీనివాస ప్రసాద్, వి నెల్లూరులో పోలబోయిన రూప్ కుమార్ లను ఎంపిక చేసింది. దీంతో తొలి జాబితాలో ఏడుగురు మేయర్ అభ్యర్ధులు ఎంపిక పూర్తి అయింది. మరో నలుగురు మేయర్ అభ్యర్ధులను మలి జాబితాలో ప్రకటిస్తారు అని అంటున్నారు.
మున్సిపాలిటీలలో అభ్యర్ధులుగా :
అదే విధంగా టీడీపీ పోటీ చేస్తున్న మునిసిపాలిటీలు, నగర పంచాయతీల అభ్యర్థులను కూడా ప్రకటించింది. అలా 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్పర్సన్ అభ్యర్థులతో టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో ఆళ్లగడ్డ-అనీషాషేక్, అద్దంకి-అశోక్, ఆదోని- నాగమణి, ఆత్మకూరు- గోవిందరాజులు, బద్వేల్- దివ్య తేజ, బొబ్బిలి-రేణుకాదేవి, దాచేపల్లి-శ్రీనివాసరావు, ధర్మవరం-సుధాకర్, గురజాల-బొల్లయ్య, హిందూపురం- మంజునాథ్, ఇచ్ఛాపురం-లీలారాణి, జగ్గయ్యపేట-వినీత, జమ్మలమడుగు- జ్యోతి చాడిప్రళ్ల, కమలాపురం- గొంగలిరెడ్డి స్వప్న ఉన్నారు.
పులివెందులకు గీతా కుమారి :
తొలి జాబితాలోనే పులివెందుల మునిసిపాలిటీకి కూడా టీడీపీ చైర్ పర్సన్ ని ప్రకటించింది. అలా పులివెందులకు తుగుట్ల గీతా కుమారికి చాన్స్ దక్కింది. కుప్పం-రాజకుమార్, మాచర్ల-ఏనుముల సుష్మ, మదనపల్లె-శ్రీరామ్ చిన్నబాబు, మార్కాపురం-వక్కలగడ్డ మల్లికార్జున, నగరి-శ్రీనివాసన్, పలాస కాశీబుగ్గ- గంగాభవాని, పెద్దాపురం-వత్సవాయి రాజు, పెనుకొండ- త్రివేంద్ర మూర్తి, రాజంపేట-దొంతం గాయత్రి, రామచంద్రపురం-మేడిశెట్టి శేషారావు, రాయచోటి-ఖాదర్ వలీ షేక్, రాయదుర్గం-టంకశాల హనుమంతు, రేపల్లె-కె.అపర్ణ, సూళ్లూరుపేట-పిట్టల సుహాసిని ఉన్నారు.
తుది కసరత్తులో :
ఇక మొత్తం 29 మునిసిపాలిటీలు నగర పంచాయతీలు , ఏడు మేయర్ పదవులకు టీడీపీ అభ్యర్ధుల తొలి విడత ప్రకటనతో 36 మందికి చాన్స్ దక్కింది. ఇంకా 53 మంది అభ్యర్ధులతో అసలైన జాబితా రిలీజ్ కావాల్సి ఉందని అంటున్నారు. తుది కసరత్తు పూర్తి కాగానే శనివారం ఆ జాబితా కూడా విడుదల అవుతుందని చెబుతున్నారు. ఆశావహులుగా ప్రచారం ఉన్న వారికే అభ్యర్ధులుగా ఎక్కువ మందికి చాన్స్ దక్కింది అని అంటున్నారు.