జనసేన బీజేపీకి క్యాట్ వాక్...టఫ్ సీట్లలో టీడీపీ !

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. తొలి విడతలో మొత్తం 17 కార్పోరేషన్లకు జరిగే ఎన్నికల్లో మేయర్ పదవుల విషయంలో సాఫీగా సర్దుబాటు జరిగింది.

Update: 2026-10-15 17:33 GMT

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. తొలి విడతలో మొత్తం 17 కార్పోరేషన్లకు జరిగే ఎన్నికల్లో మేయర్ పదవుల విషయంలో సాఫీగా సర్దుబాటు జరిగింది. ఈ మేరకు కూటమి నుంచి కీలక ప్రకటన వెలువడింది. దీని ప్రకారం చూస్తే మొత్తం 17 కార్పోరేషన్లలో జనసేనకు నాలుగు కార్పొరేషన్లు, బీజేపీకి రెండు కార్పొరేషన్లు కేటాయించారు. అంటే మూడవ వంతు అన్న మాట. మిగిలిన రెండు వంతుల సీట్లలో టీడీపీ పోటీ చేయనుంది.

ఈజీగా గెలిచే సీట్లు :

మేయర్ అంటే ప్రత్యక్ష పద్ధతిలో గెలవాలి. ఈసారి ఆ నిబంధనతోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మిత్రులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా టీడీపీ పెద్దన్న తరహాలో నిర్ణయం తీసుకుని సీట్ల సర్దుబాటు చేసిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి రాజమండ్రి, అనంతపురం కార్పొరేషన్ దక్కాయి. ఈ రెండు చోట్లా కూటమికి క్యాట్ వాక్ గానే రాజకీయ పరిస్థితి ఉందని అంటున్నారు. అలాగే జనసేనకు శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లు కేటాయింపు చేశారు. వీటిని అన్నింటినీ జనసేన సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటు తో గెలిచే విధంగా ఇక్కడ ఆ పార్టీ బలంతో పాటు నూరు కూటమి బలం కూడా జమ కానుంది అని అంటున్నారు.

టీడీపీ పోటీలో ఉన్నవి :

ఇక మిగిలిన 11 సీట్లలో టీడీపీ పడనుంది. అలా విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూల్, తిరుపతి, చిత్తూరు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ లో ఎక్కువగా టీడీపీ సీట్లు తీసుకుంది. వైసీపీ బలంగా ఉన్న చోట నేరుగా టీడీపీ బరిలోకి దిగి చాలెంజ్ చేస్తోంది అని విశ్లేషిస్తున్నారు. అలాగే టీడీపీ ఈ సీట్ల విషయంలో ఆచీ తూచీ ఎంపిక చేసిన విధానం ఈ విధంగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక 17లో పదకొండు సీట్లలో టీడీపీ పోటీ చేయడం ద్వారా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తోంది అని అంటున్నారు.

ఉమ్మడి తూగోలో జనసేన టాప్ :

ఇదిలా ఉంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూటమి సీట్ల లెక్క తేలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కూటమి సీట్ల పంపకం సజావుగానే పూర్తయింది. మొత్తం 12 స్థానాలలో జనసేనకు ఏడు చోట్ల కేటాయించారు. అలాగే టీడీపీకి అయిదు స్థానాలు కేటాయించారు. తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, ముమ్మిడివరం, అమలాపురం, నిడదవోలు జనసేనకు దక్కాయి. ఏలేశ్వరం, పెద్దాపురం, రామచంద్రపురం, మండపేట, కొవ్వూరు తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. దీంతో ఇక్కడ జనసేన ఆధిపత్యం కచ్చితంగా కనిపించింది. అక్కడ జనసేన బలం సామాజిక కోణం అన్నీ ఆలోచించి ఈ విధంగా సర్దుబాటు చేశారు అని అంటున్నారు.

ఉమ్మడి విశాఖలో లెక్క :

ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే కూటమి లెక్క సరిగ్గా సరిపోయింది. సమతూకం పాటించారు. విశాఖ కార్పోరేషన్ నుంచి టీడీపీ పోటీ చేస్తోంది. అలాగే నర్శీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలలో టీడీపీ బీజేపీ చెరొకటి పంచుకున్నాయి. నర్శీపట్నం నుంచి టీడీపీ పోటీలో ఉంటే ఎలమంచిలి నుంచి బీజేపీ పోటీకి దిగనుంది. దాంతో అర్భన్ పరిధిలో అయితే జనసేనకు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు ఎక్కువగా ఇస్తారని అంటున్నారు.

Tags:    

Similar News