అమ్మాయిల అక్రమ రవాణా డీలర్‌కు అనీల్ అంబానీ ఈమెయిల్స్?
షెల్ కంపెనీలు.. హవాలా సొమ్ములు.. వందల కోట్ల ముడుపులు.. బ్యాంకింగ్ ఫ్రాడ్స్..ఇలా చెప్పుకుంటూ వెళితే అన్నీ ఇన్నీ కావు.;
షెల్ కంపెనీలు.. హవాలా సొమ్ములు.. వందల కోట్ల ముడుపులు.. బ్యాంకింగ్ ఫ్రాడ్స్..ఇలా చెప్పుకుంటూ వెళితే అన్నీ ఇన్నీ కావు. రిలయన్స్ అనీల్ అంబానీ ఎదుర్కొంటున్న నిందారోపణలు ఇవి. ఇప్పుడు వీటికి `అమ్మాయిలు` కూడా యాడయ్యారు. లావా దేవీల వెనక `మగువ` కోణం ఆశ్చర్యపరుస్తోంది.
లైంగిక దుర్వినియోగం కోసం యువతులను అక్రమంగా తరలించే అంతర్జాతీయ నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ తో భారతీయ వ్యాపారవేత్త అనిల్ అంబానీ దేనికోసం ఇమెయిల్ సంభాషణలు జరిపాడనేది ప్రధాన అభియోగం. పార్టీ కార్యకర్త-న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్థావించడంతో కొత్త రాజకీయ వివాదం చెలరేగింది. అనీల్ అంబానీ- జెఫ్రీ ఇద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్నారని ఎక్స్ లో భూషణ్ వ్యాఖ్యానించారు.
మన ఆర్థికరంగంలో బ్యాంకులను మోసగించిన అనీల్ అంబానీ, లైంగిక రవాణా నేరస్తుడు జెఫ్రీతో ఈమెయిల్స్ మార్పిడి చేసుకున్నాడని.. ఇద్దరూ తోడు దొంగల్లాగా ఉన్నారని కూడా వ్యాఖ్యానించాడు. సంబంధిత పత్రాలను బయటపెట్టేందుకు అమెరికా ముందడుగు వేసిన రోజున భూషణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఎఫ్‌స్టీన్ 2019లోనే కస్టడీలో మరణించాడు. అతడిపై దర్యాప్తునకు సంబంధించిన ఫైళ్లను విడుదల చేయాలని ఆదేశించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. న్యాయ శాఖ ఇప్పటికే దాదాపు 50వేల పేజీల పత్రాలను కాంగ్రెస్‌కు అందజేసిందని ట్రంప్ చెప్పారు. సెనేట్ లో ఆమోద ప్రక్రియ పూర్తయింది. ఇక ట్రంప్ తనకు నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ తో ఎలాంటి సంబంధాలు లేవని వాదిస్తున్నారు. సంవత్సరాల క్రితమే అతడిని తమ క్లబ్ నుంచి బహిష్కరించామని తెలిపారు.
రిలయన్స్ ఇన్‌ఫ్రాకు ఇచ్చిన ఓ ప్రాజెక్ట్ నుండి సుమారు రూ. 40 కోట్లు షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించారని అంబానీపై ఇదివరకూ కేసులు ఫైల్ అయ్యాయి. ఇది రూ.600 కోట్లకు పైగా పెద్ద హవాలా నెట్‌వర్క్‌తో కనెక్టయిన ఆర్థిక నేరం అని ఈడీ భావిస్తోంది. జైపూర్-రీంగస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన ఫెమా దర్యాప్తులో ఈడీ సమన్లను అంబానీ దాటవేసారు. ఇప్పుడు పాత కేసులో `అమ్మాయిల` మ్యాటర్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది.