బాబూ ఇదీ గ్రౌండ్ రిపోర్ట్....పెద్దాయన ఫ్యాక్ట్ షీట్

అయితే పెద్దాయన బాబుకు ఒకనాటి మిత్రుడు అయిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ అయితే తనదైన తీరులో ఫ్యాక్ట్ షీట్ ఇది అని బయటపెట్టేశారు.;

Update: 2025-09-30 04:30 GMT

ఏపీలో తమకు ఎదురు లేదని కూటమి పెద్దలు అనుకుంటున్నారు అధికారంలో ఉన్నపుడు అంతా అనందంగానే ఉంటుంది. కితాబులతో మతాబులు ముఖాన వెలిగిస్తారు. అంతా ఓకే ఆల్ ఈజ్ వెల్ ఈ మాటలే వినిపిస్తూంటారు. దాంతో గద్దెనెక్కిన పెద్దలు ఎవరైనా అది దాటి కాస్తైనా దిగువకు చూడలేరు. పైన అంతా ప్రశాంతంగా అనందంగా ఉందని అనుకుంటారు. లోతులు చూడరు, అసలు చూడలేరు కూడా. ఇదే ఒక పార్టీ అయిదేళ్ళ తరువాత ఓటమి పాలు కావడానికి. మరో విషయం కూడా ఉంది. జనాలకు కూడా అయిదేళ్లా అమ్మో కావాలి మార్పు అన్నది కూడా గడచిన దశాబ్దాలలో ఎక్కువైపోతోంది. దాంతో కూడా ఎన్ని చేసినా ఇంకా ఏదో చేయాలని ఉంటుంది అలా వ్యతిరేకత ఉంటుంది.

కూటమి కుశలమేనా :

ఏపీలో కూటమి పనితీరు బాగుందని గ్రాఫ్ పైపైన ఉందని అంటూంటారు. అయితే పెద్దాయన బాబుకు ఒకనాటి మిత్రుడు అయిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ అయితే తనదైన తీరులో ఫ్యాక్ట్ షీట్ ఇది అని బయటపెట్టేశారు. అంతే కాదు గ్రౌండ్ లెవెల్ లో కూటమి పట్ల పూర్తి వ్యతిరేకత ఉందని కూడా బాంబు లాంటి వార్త పేల్చారు. చంద్రబాబు ప్రభుత్వం మీద కేవలం పదిహేను నెలల వ్యవధిలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని ఆయన తన రిపోర్టుని బయట పెడుతున్నారు. ఏ వర్గమూ సంతోషంగా లేదు, కూటమి పాలన లో ఎవరికి వారు బాధలే పడుతున్నారు అని ఆయన అంటున్నారు.

కుమ్ములాటలు స్టార్ట్ :

అంతే కాదు కూటమిలో కుమ్ములాటలు స్టార్ట్ అయిపోయాయని గ్రౌండ్ లెవెల్ లో అయితే చాలా కాలంగా ఉన్నా ఇపుడు అవి పై స్థాయిలోకి వచ్చేశాయని ఆయన విశ్లేషించారు. ఐక్యత లేని పార్టీలు కూటమి కట్టి మేము కలసి ఉంటున్నామని చెప్పినా లోపల సీన్ అయితే అలా లేదని ఆయన అంటున్నారు దాని వల్లనే అసెంబ్లీలో కూడా సన్నివేశాలు వేరేగా ఉంటున్నాయని అంటున్నారు. ప్రజా సమస్యలు చెప్పుకోవాల్సిన చోట పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు అని మండిపడ్డారు.

ఈవీఎంల మీద డౌట్ :

ఏపీలో కూటమి గెలుపు మీద కూడా ఆయన ఎతి పెద్ద డౌట్ ని వ్యక్తం చేశారు. ఈవీఎంల మీద తమకు అనుమానాలు ఉన్నాయని కూడా చింతా మోహన్ చెబుతున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లుగా సందేహాలు అయితే ఉన్నాయని అంటున్నారు ఇక పదిహేనేళ్ళు సీఎం అని చెప్పే బాబు సొంత నియోజకవర్గానికి ఏమి చేశారని ఒక్క ఉద్యోగం కాదు కదా ఇడ్లీ కొట్టు అయినా పెట్టించగలిగారా అని ఆయన నిలదీశారు దళితుల మీద ప్రేమ అంటున్న బాబు సీఎం కుర్చీ రెండేళ్ళ పాటు వారికి ఇవ్వాలని చింతా మోహన్ కొత్త డిమాండ్ ని ముందుకు తెచ్చారు. మొత్తానికి బాబు పాలనలో ఏమీ లేదని అంతా అన్ హ్యాపీ అంటూ తన సర్వే ని బయటకు పెద్దాయన తీసారు. మరి దీని మీద కూటమి ఏ మేరకు స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News