దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్.. మన ఏపీలో.. ఎక్కడంటే?

ఈ మహా ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 2,245 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కీలకమైన రైల్వే లింకులు కూడా అభివృద్ధి చేయబడతాయి.;

Update: 2025-10-14 20:30 GMT

భారత రైల్వే చరిత్రలో ఒక నూతన అధ్యాయం లిఖించబడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని అమరావతి సమీపంలో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ప్రపంచ స్థాయి నగర నిర్మాణ దృష్టికి అనుగుణంగా ఈ ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఏపీకి సరికొత్త గుర్తింపు తేనుంది.

* ప్రపంచ స్థాయి డిజైన్, విశాలమైన విస్తీర్ణం

ఈ రైల్వే స్టేషన్ డిజైన్ న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, లండన్‌లోని సెయింట్ పాంక్రాస్ స్టేషన్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడుతోంది. ఒక ఆధునిక ఎయిర్‌పోర్ట్‌ తరహాలో ప్లాన్ చేసిన ఈ స్టేషన్.. 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఉండనుంది. 24 ప్లాట్‌ఫామ్స్ , 4 టెర్మినల్స్‌ను కలిగి ఉంటుంది.రోజుకు 3,00,000 మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

* భారీ పెట్టుబడి, కీలక కనెక్టివిటీ

ఈ మహా ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 2,245 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా కీలకమైన రైల్వే లింకులు కూడా అభివృద్ధి చేయబడతాయి. 57 కిలోమీటర్ల బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ నిర్మాణం. 3.2 కిలోమీటర్ల మేర కృష్ణా నదిపై బ్రిడ్జ్ నిర్మాణం. చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు ప్రత్యక్ష రైలు అనుసంధానం (లింకులు) ఏర్పడతాయి.

* అభివృద్ధికి చోదక శక్తి

ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం 2 నుంచి 3 సంవత్సరాల్లో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రాంతీయ కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధి , అభివృద్ధికి గణనీయమైన ప్రేరణ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

అమరావతి ఇప్పుడు కేవలం రాజధాని నగరంగానే కాకుండా, దేశానికి మోడర్న్ రైల్వే నెట్‌వర్క్‌లో ఒక కీలక కేంద్రంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఈ చారిత్రాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఒక గొప్ప వరం.

Tags:    

Similar News