అప్పుడు అలా ఇప్పుడు ఇలా... నిజంగా గొడవలు లేనట్లేనా?

టీం ఇండియా క్రికెటర్‌ పృథ్వీ షా ఇటీవల ఆకృతి అగర్వాల్‌ను వివాహం చేసుకునేందుకు నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెల్సిందే.

Update: 2026-07-07 07:46 GMT

టీం ఇండియా క్రికెటర్‌ పృథ్వీ షా ఇటీవల ఆకృతి అగర్వాల్‌ను వివాహం చేసుకునేందుకు నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెల్సిందే. వీరి నిశ్చితార్థం మార్చి 2026లో జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలు, పోస్ట్‌లు సోషల్‌ మీడియాలో ఆ సమయంలో తెగ వైరల్‌ అయ్యాయి. ఆకృతి అగర్వాల్‌ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆన్‌ లైన్‌లో తెగ సెర్చ్ చేశారు. పథ్వీ షా తో నిశ్చితార్థం అయిన వెంటనే ఆకృతి అగర్వాల్‌ సోషల్‌ మీడియా ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగారు. అంతేకాకుండా ఆమెకు సెలబ్రిటీ హోదా దక్కింది. స్టార్‌ హీరోయిన్స్‌ రేంజ్‌లో ఆకృతి గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది. అంతా సాఫీగా జరుగుతుంది, పృథ్వీ షా, ఆకృతి పెళ్లి ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్ పోస్ట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యింది. ఆ పోస్ట్‌ తీవ్ర గందరగోళంను క్రియేట్‌ చేసింది.

పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌ నిశ్చితార్థం...

ఆకృతి అగర్వాల్‌ సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం... జీవితంలో నేను చాలా సార్లు మోసపోయాను, కానీ ఎప్పుడూ నోరు విప్పలేదు. జీవితంలో ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. అసలు నమ్మలేకపోతున్నాను. అతడి గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రతి ఒక్క రూమర్‌ నిజమే అంటూ చేసిన పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. పృథ్వీ షా గురించి ఆకృతి ఆ పోస్ట్‌ చేసిందని అంతా భావించారు. అంతే కాకుండా ఇద్దరి పెళ్లి క్యాన్సల్‌ అయినట్లే అనే వార్తలు వచ్చాయి. వివాహ నిశ్చితార్థం బ్రేక్ అయినట్లే అనే వార్తలు జోరుగా వస్తున్న సమయంలో అనూహ్యంగా ఆకృతి కొత్త పోస్ట్‌ కొత్త చర్చకు తెర తీసింది. తాము ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నట్లు ఆకృతి చెప్పింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు లేకుంటా ఆ పోస్ట్‌ ఎవరిని ఉద్దేశించి అంటూ ప్రశ్నిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..

తాజాగా ఆకృతి అగర్వాల్‌ సోషల్‌ మీడియా ద్వారా... నేను పెట్టిన పోస్ట్‌ లో నా కాబోయే భర్త పేరు ఎక్కడ కూడా లేదు. మా నిశ్చితార్థం క్యాన్సల్‌ కాలేదు. అలాగే ఉంది. మేము విడిపోయాం లేదా విడిపోవాలి అనుకుంటున్నామని నేను ఎక్కడా చెప్పలేదు. అయినా ఎవరికి వారు ఊహించేసుకున్నారు. మేము ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. పృథ్వీ షా నా జీవితమే, కానీ నా జీవితంలో అతడు ఒక్కడే లేదు. ఇంకా చాలా మంది ఉంటారు కదా. నాకు స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు. ఆ పోస్ట్‌ పృథ్వీ షా గురించి కాదు, నా జీవితంలో ఉన్న ఇతరుల గురించి అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కేవలం సోషల్‌ మీడియాలో వచ్చే పోస్ట్‌లను చూసి పృథ్వీ షా యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ధారించవద్దని విజ్ఞప్తి చేసింది. సోషల్‌ మీడియాలో ఈమె కొత్త పోస్ట్‌ సైతం వైరల్‌ కావడంతో అదరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పథ్వీ షా గురించి విమర్శలు...

పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌ ఎంగేట్‌మెంట్‌ బ్రేక్‌ అంటూ వచ్చిన వార్తలు అన్ని నిజం కాదని, అందులో ఏమాత్రం నిజం లేదని వెల్లడి అయింది. అయితే నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. ఆకృతి ఆ పోస్ట్‌ చేసి, ఇప్పుడు దాని అర్థం వేరే అంటూ ఎంతగా చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఇంతకు ముందు గొడవలు లేవు అంటే మాత్రం ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా చెప్పడం చూస్తూ ఉంటే అకృతి, పృథ్వీ షా మధ్య గొడవ అయ్యి, తిరిగి అంతా సర్థుకుందనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంకు తెర పడటంతో పృథ్వీ షా అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతే కాకుండా ఆయన వ్యక్తిత్వం గురించి వచ్చిన విమర్శలకు స్వయంగా ఆకృతి అగర్వాల్‌ సమాధానం చెప్పినట్లు అయింది.

Tags:    

Similar News