శుభ కార్యక్రమాలకు భారీ బ్రేక్
ఇక ఈ నెల 17 నుంచి అధిక జ్యేష్ట మాసం మొదలుతోంది. దీనిని మూఢమి గా కూడా చెబుతారు. అలాగే శూన్య మాసంగా పేర్కొంటారు.
కొత్త ఏడాది పరాభవ నామ సంవత్సరంలో శుభ కార్యక్రమాలకు తొలి బ్రేక్ పడబోతోంది. ఈ బ్రేక్ ఏకంగా 36 రోజుల పాటు ఉండనుంది. ఈ ఏడాది మార్చి 19న కొత్త తెలుగు సంవత్సరాది మొదలైంది. ఈ రెండు నెలల కాలంలో ఎన్నో శుభ కార్యాలు జరిగాయి. గత తెలుగు ఏడాదిలో పెద్దగా శుభ కార్యక్రమాలకు ముహూర్తాలు లేకపోవడంతో అంతా పరాభవ నామ సంవత్సరం మీద అంతా ఆధారపడ్డారు. దాంతో రెండు నెలల పాటు సన్నాయి మేళాలు డోలూ బాజాలు మారు మోగాయి. అయితే దానికి ఇపుడు భారీ బ్రేక్ వచ్చి పడింది.
అధిక జ్యేష్టంతో :
ఇక ఈ నెల 17 నుంచి అధిక జ్యేష్ట మాసం మొదలుతోంది. దీనిని మూఢమి గా కూడా చెబుతారు. అలాగే శూన్య మాసంగా పేర్కొంటారు. ఈ నెల 18 నుంచి జూన్ 18 వరకూ అధిక జ్యేష్టం కొనసాగనుంది. దాని ఫలితంగా శుభ కార్యక్రమాలు చేసుకునేందుకు వీలు కాకుండా పోతోంది. ఇక ప్రస్తుతం నడుస్తున్న వైశాఖ మాసంలో మంచి ముహూర్తంగా ఈ నెల 13తో పూర్తి అవుతోంది. దాంతో ఏకంగా 36 రోజుల పాటు బ్యాండ్ మేళాలు మోగేందుకు ఎలాంటి అవకాశం లేదని పండితులు చెబుతున్నారు.
అప్పటి నుంచీ జోరు :
ఇక జూన్ 19 నుంచి చూస్తే నిజ జ్యేష్టం మొదలవుతోంది. ఈ మాసం శుభాలకు మేలు చేస్తుంది. దాంతో ముహూర్తాలు పెద్ద ఎత్తున ఈ మాసంలో ఉన్నాయి. అలా జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28లలో ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక జూలై నెలలో చూస్తే జులై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలు, ఆగస్టు నెలలో 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీలు, సెప్టెంబరు నెలలో 1, 3, 4, 5 తేదీలు, అక్టోబర్ నెలలో 11, 14, 29, 30 తేదీలు, నవంబర్ నెలలో 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26 తేదీలు, డిసెంబర్ నెలలో 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీలలో శుభ ముహూర్తాలున్నాయి. దాంతో పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు ఇతర శుభ కార్యక్రమాలను ఈ తేదీలలో జరుపుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు.
పెళ్ళిళ్ళ సీజన్ :
ఇక పెళ్ళిళ్ళ సీజన్ ఈ ఏడాది బాగానే కొనసాగుతోందని అంటున్నారు. గడచిన రెండు నెలలుగా ఎక్కడా అవాంతరాలు లేకుండా మంచి ముహూర్తాలలో పెళ్ళిళ్ళు జరిగాయి. ఇక జూన్ నుంచి డిసెంబర్ వరకూ కూడా ఆరు నెలల పాటు శుభాలే శుభాలు అన్నట్లుగా ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది వివాహాలకు అంతా అనుకూలించే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు.