భ‌ర్త డెబ్యూపై ఆనందంతో ఉబ్బిత‌బ్బిబిన భార్య!

జైద్ దర్బార్‌కు డిజిటల్ మీడియాలో - సోషల్ మీడియా లో ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది.

Update: 2026-06-04 11:30 GMT

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రతిభావంతులు పరిచయం కావడం నిరంతరం జరిగే ప్రక్రియే అయినా? ఇప్పటికే పాపులర్ అయిన సెలబ్రిటీలు నటన వైపు అడుగులు వేసినప్పుడు ఆ ప్రాజెక్టులపై ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. ప్రముఖ మోడల్, నటి, `బిగ్ బాస్` విజేత గౌహర్ ఖాన్ భర్త జైద్ దర్బార్ త్వరలోనే నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. `ఫ్యాన్‌గర్ల్` అనే ఆసక్తికర ప్రాజెక్ట్‌తో నటనా జీవితాన్ని ప్రారంభించడం విశేషం. ఈ క్రమంలో తన భర్త వెండితెరపై నటుడిగా అరంగేట్రం చేయ‌డం పట్ల గౌహర్ ఖాన్ సంతోషం వ్య‌క్తం చేసారు.

జైద్ దర్బార్‌కు డిజిటల్ మీడియాలో - సోషల్ మీడియా లో ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ కుమారుడైన జైద్, అద్భుతమైన డాన్సర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా నెటిజన్లను ఎంతగానో అలరించారు. కేవలం సోషల్ మీడియా వీడియోలకే పరిమితం కాకుండా తనలోని నటన ప్రతిభను నిరూపించుకోవడానికి `ఫ్యాన్‌గర్ల్` అనే ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నారు. ఒక క్రియేటర్ సంస్కృతి నుండి మెయిన్‌స్ట్రీమ్ నటుడిగా మారడం అనేది ఆయన కెరీర్‌లో పెద్ద మైలురాయిగా నిల‌వ‌నుంది.

ఈ కొత్త ప్రయాణంలో జైద్ దర్బార్‌కు భార్య గౌహర్ ఖాన్ నుండి లభిస్తున్న మద్దతు ఎంతో విశేషమైనది. సినీ పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉండి, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌహర్ తన భర్తలోని ప్రతిభను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. జైద్ నటనపై ఆమె చూపించిన నమ్మకం, తోడ్పాటు ఒక నూతన నటుడికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకే రంగంలో సృజనాత్మకంగా ఎదగడం వారి పరస్పర బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

`ఫ్యాన్‌గర్ల్` అనే టైటిల్ వినడానికి ఎంతో వినూత్నంగా నేటి యువతను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ కథాంశం సెలబ్రిటీ సంస్కృతి, అభిమానుల క్రేజ్ ,ఆధునిక వినోద ప్రపంచం చుట్టూ తిరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. జైద్ దర్బార్ మొదటి చిత్రంలోనే ఎలాంటి విభిన్నమైన పాత్రను పోషించబోతున్నారనేది? అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన బాలీవుడ్ .. ఓటీటీ ప్రపంచంలో విలక్షణమైన నటుడిగా స్థిరపడాలని చూస్తున్నారు.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రధానంగా నటన వైపు మొగ్గు చూపడం సరికొత్త ట్రెండ్‌గా మారింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అశేష ప్రజాదరణ పొందిన వారు తమ పరిధిని విస్తరించుకోవడానికి సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఎంచుకుంటున్నారు. జైద్ దర్బార్ డెబ్యూ కూడా ఈ పరిణామ క్రమంలో ఒక భాగమే. సాంప్రదాయ ఆడిషన్ల ద్వారానే కాకుండా తమకున్న డిజిటల్ ఫాలోయింగ్ .. ప్రతిభ ఆధారంగా అవకాశాలను అందుకోవడం నేటి తరం నటుల ప్రత్యేకత.

Tags:    

Similar News