టాక్సిక్ సక్సెస్ అయితే ఇండియన్ సినిమా గేమ్ మారుతుందా?

యష్ కెరీర్‌లో కేజీఎఫ్ ఒక పెద్ద మలుపు. ఆ స‌క్సెస్ తో వచ్చిన ఇమేజ్‌ను కాపాడుకోవడం ఒక మార్గమైతే, దాన్ని దాటి కొత్త గుర్తింపును సృష్టించడం మరో మార్గం.

Update: 2026-08-13 23:30 GMT

యష్ కెరీర్‌ను గమనిస్తే ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తుంది. ఆయన తీసుకునే డెసిష‌న్స్ లో కేవలం కమర్షియల్ లెక్కలు మాత్రమే కాదు, తనను తాను మరో స్థాయికి తీసుకెళ్లాలనే ధోరణి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది సాధ్యం కాదు అనే అభిప్రాయం ఎదురైనప్పుడల్లా దాన్ని ప‌ర్స‌న‌ల్ ఛాలెంజ్ గా తీసుకునే మనస్తత్వం ఆయన కెరీర్ ఎంపికల్లో ప్రతిబింబించిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

టాక్సిక్ విషయంలో కూడా ఇదే డిస్క‌ష‌న్ ఎక్కువగా వినిపిస్తోంది. పాన్ ఇండియా స‌క్సెస్ తో దేశవ్యాప్తంగా మార్కెట్‌ను సంపాదించిన తర్వాత చాలా మంది స్టార్లు అదే ఫార్ములాను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. కానీ యష్ మాత్రం ఆ దశను దాటి ఇంట‌ర్నేష‌న‌ల్ ఆడియ‌న్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లు ఇండ‌స్ట్రీలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాక్సిక్ ను ఇంగ్లీష్ లో కూడా షూట్ చేయ‌డం సాధారణ డబ్బింగ్ స్ట్రాట‌జీ కాదని, గ్లోబల్ మార్కెట్‌ను పరీక్షించే ప్రయత్నంగా చూడవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియ‌న్ స్టార్ ఒక ప్రాజెక్ట్‌ను అంత‌ర్జాతీయ‌ ప్రమాణాలతో నిర్మించి, విదేశీ పంపిణీ అవకాశాలను ముందుగానే దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయడం ఎంత వరకు సాధ్యమవుతుందనేదే ఇక్క‌డ కీలకం. ఆ ప‌రంగా చూస్తే టాక్సిక్ ఒక ఎక్స్‌పెరిమెంట‌ల్ బిజినెస్ మోడల్‌గా కూడా మారే అవకాశం ఉంది.

యష్ కెరీర్‌లో కేజీఎఫ్ ఒక పెద్ద మలుపు. ఆ స‌క్సెస్ తో వచ్చిన ఇమేజ్‌ను కాపాడుకోవడం ఒక మార్గమైతే, దాన్ని దాటి కొత్త గుర్తింపును సృష్టించడం మరో మార్గం. రెండో మార్గమే ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నది. ఇంగ్లీష్ వెర్షన్, ఇంట‌ర్నేష‌న‌ల్ టెక్నికల్ ప్రెజెంటేషన్, గ్లోబల్ మార్కెటింగ్ వంటి అంశాలు ఆ రిస్క్ స్థాయిని మరింత పెంచుతున్నాయి.

ఈ ఎక్స్‌పెరిమెంట్ స‌క్సెస్ అయితే దాని ప్రభావం ఒక్క యష్ కెరీర్‌కే పరిమితం కాకపోవచ్చు. భారతీయ సినిమాల్లో డబ్ చేసి రిలీజ్ చేయడం నుంచి బహుళ భాషల్లో ఒరిజినల్‌గా షూట్ చేయ‌డం అనే కొత్త ధోరణికి ఇది ఊతమివ్వొచ్చు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు విదేశీ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని ప్రీ ప్రొడక్షన్ దశ నుంచే కొత్త వ్యూహాలు రూపొందించే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగం రిజ‌ల్ట్ ఈ నెలాఖరులో టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది.

Tags:    

Similar News