ఒక్క సినిమా యష్ మార్కెట్‌ను తలకిందులు చేసిందా?
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ కెరీర్ ఇప్పుడు ఒడుదొడుకుల్లో పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ కెరీర్ ఇప్పుడు ఒడుదొడుకుల్లో పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. `కేజీఎఫ్` సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. కన్నడ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన యష్ ఆ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన `టాక్సిక్` తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ భారీ పరాజయంతో యశ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా జీరోకి పతనమైందనే చర్చ ఊపందుకుంటోంది.
`కేజీఎఫ్ 1`, `కేజీఎఫ్ 2` చిత్రాలు యష్‌ను సాధారణ నటుడి నుంచి పాన్-ఇండియా సూపర్‌స్టార్ ని చేసాయి. ఆ రెండు సినిమాల తర్వాత యష్ తదుపరి చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ..అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `టాక్సిక్` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా? వాటిని అందుకోవడంలో తీవ్రంగా విఫలమైన సంగతి తెలిసిందే. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన `టాక్సిక్` బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకోవడమే కాకుడా నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ నష్టాలను మిగిల్చింది.
వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కినా? కథనంలో లోపాలు ప్రేక్షకులతో కనెక్ట్ కాకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన అభిమానులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.
ఈ సినిమా పరాజయం ఆర్థికంగానే కాకుండా యష్ కెరీర్ సమయాన్ని కూడా దెబ్బతీసింది. `కేజీఎఫ్ 2` తర్వాత తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేయడానికి యష్ ఏళ్ల కొద్దీ సమయాన్ని వెచ్చించారు. ఇంత విలువైన సమయాన్ని కేటాయించినా? చివరకు డిజాస్టర్ రిజల్ట్ రావడం ఆయన కెరీర్ ప్రణాళికలను తలకిందులు చేసింది.
`టాక్సిక్` ప్లాప్‌తో యశ్ ఒత్తిడిలో పడ్డారు. ఏళ్ల తరబడి సమయాన్ని ఒక్క సినిమాకే కేటాయించి అది విఫలమైతే వచ్చే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రాక్టికల్ గా చూస్తున్నారు. ఒక్క ప్లాప్‌తో యష్ మళ్లీ తన క్రేజ్ .. మార్కెట్‌ను పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విఫలం నుంచి కోలుకుని తన స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకో వడానికి యష్ తదుపరి సినిమా పై స్ట్రాంగ్ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిలకడలేని ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని వేగంగా నాణ్యమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం యశ్ కి ఏర్పడింది. మరి రాబోయే చిత్రాలతో యష్ మళ్లీ కేజీఎఫ్ నాటి వైభవాన్ని సాధించి పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను కాపాడుకుంటారో? లేదో? అన్నది చూడాలి.