హైప్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు: ప్రముఖ వెబ్ సిరీస్ నటి అరెస్ట్!

థానే క్రైమ్ బ్రాంచ్ ఆధ్వర్యంలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ (ఏహెచ్‌టిసి) అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి.

Update: 2026-09-30 10:04 GMT

రంగుల ప్ర‌పంచంలో కొన్నిసార్లు కొంద‌రి త‌ప్ప‌ట‌డుగులు.. దారి త‌ప్పిన వ్య‌వ‌హారాలు మొత్తం ఇండ‌స్ట్రీకే చెడ్డ పేరు తెస్తుంటాయి. అలాంటి మ‌రో త‌ప్ప‌ట‌డుగు వేసిన న‌టి గురించి మ‌రోసారి చ‌ర్చ సాగుతోంది. మహారాష్ట్రలోని థానే నగరంలో పోలీసులు నిర్వహించిన దాడులలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పలు పాపుల‌ర్ వెబ్ సిరీస్‌లు.. సినిమాలలో నటించిన ఒక ముంబై నటి.. వ్యభిచార రాకెట్‌ను నడుపుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ ఘటన స్థానిక సినీ వర్గాలతో పాటు సర్వత్రా తీవ్ర కలకలం రేపింది.

థానే క్రైమ్ బ్రాంచ్ ఆధ్వర్యంలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ (ఏహెచ్‌టిసి) అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. నగరంలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో ఈ వ్యభిచార దందా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలు డబ్బు ఆశ చూపి యువతులను ఈ న‌ర‌క‌కూపంలోకి నెడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక నకిలీ కస్టమర్‌ను ఏర్పాటు చేసి ప్లాన్ అమలు చేశారు. ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సదరు నటి ఇద్దరు బాధితులతో కలిసి నిర్దేశిత ప్రాంతానికి చేరుకోగా.. ముందే మాటు వేసిన పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు మహిళలను సురక్షితంగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించి స్థానిక శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. నిందితురాలపై పిటా (PITA) చట్టంతో పాటు భారతీయ న్యాయ‌సంహిత (బీఎన్ఎస్) లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రాకెట్‌ వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది.. నటి ఎవరితో కలిసి ఈ నెట్‌వర్క్ నడుపుతోంది అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

గ్లామర్ ప్రపంచంలో పేరు తెచ్చుకోవాలని వచ్చే కొందరు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం విచారకరమని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ హైప్రొఫైల్ కేసులో మరింత మంది ప్రముఖుల ప్రమేయం ఉందా లేదా అనే దానిపైనా త్వరలోనే పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Tags:    

Similar News