సుమో రెజ్లింగ్‌లో వామికా గబ్బి...ఫైటర్‌ను ఓడించే అద్భుత ట్రిక్!

వామికా గబ్బి ఎక్కడున్నా తన స్టైల్‌తో సందడి సృష్టిస్తుంది. జపాన్ వెళ్లిన ఆమె అక్కడి సాంప్రదాయ సుమో రెజ్లింగ్‌ను సరదాగా ట్రై చేయాలనుకుంది.

Update: 2026-07-08 05:25 GMT

సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తెగ అల్లరి చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది నటి వామికా గబ్బి. తాజాగా ఆమె జపాన్ పర్యటనలో ఒక భారీకాయుడైన ప్రొఫెషనల్ సుమో రెజ్లర్‌తో సరదాగా తలపడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రింగ్ (డోహ్యో) లోపలికి దిగి, ఒక క్రేజీ ప్లాన్‌తో ఆ సుమో ఫైటర్‌ను రింగ్ బయటకు నెట్టేసి విజయం సాధించింది. నెటిజన్లు ఆమె సాహసాన్ని, ఫన్నీ ట్రిక్స్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ఆ కిరాక్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం..

ఊబలాటంతో రింగ్‌లోకి ఎంట్రీ:

వామికా గబ్బి ఎక్కడున్నా తన స్టైల్‌తో సందడి సృష్టిస్తుంది. జపాన్ వెళ్లిన ఆమె అక్కడి సాంప్రదాయ సుమో రెజ్లింగ్‌ను సరదాగా ట్రై చేయాలనుకుంది. ఇందుకోసం ఆమె గాలితో నింపిన ఒక పెద్ద సుమో సూట్ వేసుకుని రింగ్‌లోకి దూకింది. ఇక ఎదురుగా కొండలాంటి ఒరిజినల్ సుమో ఫైటర్ ఉన్నా అస్సలు తగ్గకుండా, "జపాన్‌లో సుమో ఫైటర్‌తో ఎలా పోరాడాలి" అనే క్రేజీ ఐడియాతో మ్యాచ్ స్టార్ట్ చేసింది.

స్టెప్ 1: ఆప్యాయంగా కౌగిలింత:

ఫైట్ అనగానే కొట్టుకోవడం అనుకుంటే పొరపాటే! వామికా తన మొదటి ట్రిక్‌గా మైత్రీ బంధాన్ని నమ్ముకుంది. రింగ్‌లో ఫైటర్‌కు ఎదురుగా నిలబడి, గంభీరంగా ఫైట్ చేసేలా బిల్డప్ ఇచ్చింది. కానీ మరుక్షణమే నవ్వుతూ ముందుకు వెళ్లి, ఆ సుమో రెజ్లర్‌కు ఎంతో ఆక్యాయంగా షేక్‌హ్యాండ్ ఇచ్చి, గట్టిగా ఒక హగ్ ఇచ్చేసింది. దీంతో ఆ రెజ్లర్ కూడా కాస్త కూల్ అయిపోయాడు.

స్టెప్ 2: మెల్లగా నెట్టేసే ప్రయత్నం:

హగ్ కాగానే అసలు కథ మొదలైంది. రెండో స్టెప్‌లో భాగంగా ఆమె ఆ భారీ ఫైటర్‌ను వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది. ఎంత బలం ఉపయోగించినా, కొండలాంటి ఆ రెజ్లర్ అంగుళం కూడా కదల్లేదు. వామికా పదే పదే ట్రై చేసినా ప్రయోజనం లేకపోయింది. మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోతుందనుకున్న టైమ్‌లో ఆమె మైండ్ బ్లాక్ అయ్యేలా మరో ప్లాన్ వేసింది.

స్టెప్ 3: కంటిలో నలుసు డ్రామా.. విక్టరీ:

అకస్మాత్తుగా వామికా కంటిలో ఏదో పడినట్టు యాక్టింగ్ చేస్తూ ఇబ్బంది పడిపోయింది. అది చూసి పక్కనున్న మహిళ, అలాగే ఆ సుమో రెజ్లర్ కూడా పాపం హెల్ప్ చేద్దామని ఆమెకు దగ్గరగా వచ్చారు. అంతే.. ఇదే ఛాన్స్ అనుకున్న వామికా, అస్సలు ఊహించని విధంగా ఆ సుమో ఫైటర్‌ను ఒక్కసారిగా రింగ్ అవతలికి నెట్టేసింది. అలా ఆమె నమ్మించి గేమ్‌ను గెలిచేసింది. ఈ ఫన్నీ వీడియో ను ఆమె సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో పంచుకుంది ..

ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న మల్టీలింగ్వల్ స్టార్:

ఈ ఫన్నీ విక్టరీ తర్వాత వామికా రింగ్‌లోనే క్రేజీ డ్యాన్స్ చేస్తూ తెగ హడావుడి చేసింది. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగులో 'G2', తమిళంలో 'జీని', 'DC' సినిమాలతో పాటు పలు క్రేజీ బాలీవుడ్, వెబ్ సిరీస్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇక ప్యాన్-ఇండియా స్టార్‌గా బిజీగా ఉంటూనే, ఇలాంటి ట్రావెల్ అడ్వెంచర్స్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తూ అభిమానులను అలరిస్తోంది.

Tags:    

Similar News