పెళ్లికి ముందే భార్య‌లా విశాల్ కు సేవ‌లు!

'సాయిధన్షిక నా అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్ అని విశాల్ ఆప్యాయంగా చెప్పారు. చిత్ర నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురై నప్పుడు పక్కనే ఉండి తనకు మనోధైర్యాన్ని అందించార‌న్నారు.

Update: 2026-07-15 03:32 GMT

రెండు దశాబ్దాలుగా యాక్షన్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న విశాల్ కెరీర్‌లో సరికొత్త అడుగులు వేస్తున్నారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాల్ ఇప్పుడు 'మకుటం' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కించే క్రమంలో విశాల్ వృత్తిపరమైన బాధ్యతలతో పాటు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నారు. ఈ దశలో ఆయన షూటింగ్ సెట్‌లో పడుతున్న కష్టాలను తన కాబోయే భార్య సాయిధన్షిక అందించిన మద్దతును ప్రేమతో గుర్తు చేసుకున్నారు.

షూటింగ్ ..వివాహ ఏర్పాట్లు.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఏ నటునికైనా కష్టమైన విషయమే. అయితే 'మకుటం' చిత్రం తనకు ఎంతో ప్రత్యేకం అని విశాల్ చెబుతున్నారు. ఈ సినిమా కోసం తను పడ్డ కష్టం, ఒత్తిడిని సాయిధన్షిక దగ్గరుండి చూసింద‌ని... ఒక భార్య వలె ఎంతో అండగా నిలిచారని విశాల్ పేర్కొన్నారు. షూటింగ్ సెట్‌లో తాను పడుతున్న శ్రమను గమనించి ప్రతి క్షణం ధైర్యం చెప్పడం ఎంతో ఊరటనిచ్చిందన్నారు.

'సాయిధన్షిక నా అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్ అని విశాల్ ఆప్యాయంగా చెప్పారు. చిత్ర నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురై నప్పుడు పక్కనే ఉండి తనకు మనోధైర్యాన్ని అందించార‌న్నారు.

ఈ సినిమా కోసం సర్వస్వాన్ని అంకితం చేయాల్సి వచ్చిందని ఆ క్రమంలో సాయి ఏనాడు ఫిర్యాదు చేయకుండా తన బాధ్యతలను భుజాన వేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తన విజయంలో సాయి ధ‌న్షిక పాత్ర మరువ లేనిదన్నారు. మొత్తానికి పెళ్లికి ముందే సాయి ధ‌న్షిక విశాల్ కు ఓ భార్య‌లా అన్ని ర‌కాలుగా మ‌ద్ద‌తుగా నిలుస్తు న్నారు. వివాహానికి ముందు చాలా జోడీలు డేటింగ్ పేరుతో క‌లిసి ఉంటారు. ఈ స‌మ‌యంలోనే ఒక‌ర్ని ఒక‌రు అర్దం చేసుకుంటారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య అండ‌ర్ స్టాండింగ్ ఎలా ఉందో చూసుకుంటారు.

అక్క‌డ టెర్మ్స్ అన్ని కుదిరితేనే పెళ్లి వ‌ర‌కూ వెళ్తారు. లేదంటే డేటింగ్ తో స‌రిపెట్టి ఎవ‌రి దారి వారు చూసు కుంటారు. కానీ విశాల్ అలాంటి వాటికి భిన్నంగా సాయిధన్షిక‌తో ప్ర‌యాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వ్య‌క్తిగ‌తంగా క‌లిసి ఉండ‌టం కంటే? వృత్తిప‌రంగా విశాల్ కు ముందే అండ‌గా నిల‌బ‌డుతున్నారు. ప‌ని అంటే? పారిపోయే ఈ రోజుల్లో ఇలా నిల‌బ‌డ‌టం గొప్ప విష‌యం. విశాల్- సాయి ధ‌న్షిక‌ల వివాహం ఆగ‌స్టులో జ‌ర‌గ‌నుంది.

విశాల్ త‌దుప‌రి సినిమాల విష‌యానికి వ‌స్తే పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు చాలానే ఉన్నాయి. `డిటెక్టివ్ 2` చిత్రాన్ని ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాలి. కానీ ఆ చిత్రం చాలా కాలంగా వాయిదా ప‌డుతోంది. ఈ చిత్రానికి కూడా విశాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిఆను విశాల్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు.

Tags:    

Similar News