CM విజయ్ విడాకుల్లో ట్విస్ట్.. ఏంటి నిజమేనా?
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం దళపతి విజయ్ పర్సనల్ లైఫ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం దళపతి విజయ్ పర్సనల్ లైఫ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆయన భార్య సంగీత స్వర్ణలింగంతో విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుండగా.. ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు నిజం ఏంటన్నదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
గత కొన్ని నెలలుగా విజయ్, సంగీత విడివిడిగా ఉంటున్నారనే వార్తలు వినిపించాయి. పొలిటికల్ ఈవెంట్స్, ఎలక్షన్ క్యాంపెయిన్ మీటింగ్స్, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకల్లో కూడా సంగీత కనిపించకపోవడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఆమె లండన్ లోనే ఉంటున్నారని, ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని అనేక వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అదే సమయంలో సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారనే వార్తలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. అయితే ఆ వ్యవహారంపై విజయ్ కుటుంబ సభ్యులు గానీ, ఆయన టీమ్ గానీ ఇప్పటివరకు ఎప్పుడూ అఫీషియల్ గా రెస్పాండ్ అవ్వలేదు. దీంతో బయటకు వస్తున్న సమాచారం మొత్తం అన్ అఫీషియల్ గానే మిగిలిపోయింది.
ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న కథనం ప్రకారం, విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కుటుంబ పెద్దలతో కలిసి విజయ్, సంగీత మధ్య మీడియేషన్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య జరిగిన చర్చలకు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయని, సంగీత లండన్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి సమయం గడుపుతున్నారని కూడా రూమర్లు వైరల్ అవుతున్నాయి.
దీంతో విడాకుల ప్రక్రియ నిలిచిపోయిందని, కోర్టులో ఉన్న పిటిషన్ ను వెనక్కి తీసుకునే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న ఆ విషయంపై అధికారిక ప్రకటన కూడా రావచ్చని కొందరు చెబుతున్నారు. మరోవైపు ఇంకొందరు మాత్రం విడాకుల కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని, రెండు రోజుల్లో నెక్స్ట్ విచారణ ఉందని చెబుతున్నారు.
ఇటీవల విజయ్ పేరు సీనియర్ హీరోయిన్ త్రిషతో లింక్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో పలు గాసిప్స్ వచ్చాయి. అయితే వాటిపై కూడా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఇప్పుడు విజయ్- సంగీత మళ్లీ కలిసిపోయారనే ప్రచారం నేపథ్యంలో ఆ పాత వార్తలు మరోసారి చర్చకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం బయటకు వస్తున్న వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
విజయ్, సంగీత లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆ వార్తలు కంప్లీట్ గా నిజమని చెప్పలేం. అందుకే అభిమానులు కూడా అఫీషియల్ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా విజయ్ పర్సనల్ లైఫ్ పై సాగుతున్న ఆ ప్రచారం నిజమా? లేక మరో రూమరా? అన్న ప్రశ్నకు ఆన్సర్ తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు మాత్రం వేచి చూడాల్సిందే.